ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం రెండు రాష్ట్రాలు ఏర్పాడిన అనంతరం నెలకొన్న వివాదాల పరిష్కారాలపై కేంద్ర దృష్టిసారించింది. ఈ నేపథ్యంలోనే ఏకే సింగ్ నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారుల బృందం హైదరాబాద్ కు రానుంది.
గురువారం రాత్రి ఉమ్మడి రాజధానికి చేరుకునే ఈ బృందం.. శుక్రవారం నుంచి ఏపీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో భేటీ కానుంది. విద్యుత్, నీటి వాటాలు సహా విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై చర్చించనుంది. విభజన ఇబ్బందులపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కేంద్రానికి ఫిర్యాదులు చేసిన దరిమిలా ఏకే సింగ్ బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.