రెండూ సమపాలు..అదే ఆర్మీ విశిష్టత
పైరవీలకు చోటు లేదు..ప్రతిభకే పట్టం
ఉన్నత విద్యావంతులకూ అవకాశాలు
దేశమాత సేవలో తరించే అదృష్టం
ఏటా నాలుగుసార్లు నియామక ర్యాలీలు
‘సాక్షి’తో ఆర్మీ అధికారులు సంగ్రాం దాల్వి, ఏకే సింగ్
రాత్రింబవళ్లు పహారా కాస్తాం. శత్రు దేశాల నుంచి మన సరిహద్దులను కాపాడతాం. దేశమాత సేవకు ఇంతకన్నా మంచి అవకాశం.. అదృష్టం ఇంకేముంటుంది.ఆ అవకాశాన్ని.. అదృష్టాన్ని ఆర్మీ కల్పిస్తోంది. అదీ అభ్యర్థుల వద్దకే వచ్చి కల్పిస్తోందని చెన్నైకి చెందిన ఆర్మీ డిప్యూటీ డెరైక్టర్ జనరల్(రిక్రూట్‌మెంట్) సంగ్రాం దాల్వి అన్నారు. పట్టణంలో జరుగుతున్న ఆర్మీ ఉద్యోగ నియామక ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన ఇక్కడి ప్రత్యేక అధికారి కల్నల్ ఎ.కె.సింగ్‌తో కలిసి ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే..
శ్రీకాకుళం : నెలల తరబడి కుటుంబాలకు దూరంగా కొండకోనల్లో విధులు నిర్వర్తించే ఆర్మీ ఉద్యోగం అంటేనే ఓ సవాల్. అయినా ఇందులో దేశసేవలో తరిస్తున్నామన్న తృప్తి ఉంటుంది.తక్కువ వయసులోనే ఉద్యోగానికి ఎంపికై పిన్న వయసులోనే పదవీ విరమణ తీసుకుంటాం. అయినప్పటికీ సైనికుల కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యాలు, రవాణా భత్యం, భోజనం ఇలా..అన్నీ కల్పించేందుకు దే శం ముందుకు వచ్చింది. ఉద్యోగ విరమణ తరువాత ఒక్క ఐడీ కార్డుతో మరెన్నో ఉద్యోగ అవకాశాలు. ఒక కుటుంబం జీవితాంతం హాయిగా ఉండే అవకాశం కల్పిస్తున్న ఉద్యోగం ఇది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కంటే ఆర్మీ ఉద్యోగం వేల రెట్ల సంతృప్తినిస్తుంది. అందుకే ఆర్మీకి రండి.. దేశ సేవ చేయండి.
వ్యాయామమే పెట్టుబడి
ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మార్చిలోపు నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి 12 ర్యాలీల ద్వారా వెయ్యి మందికి తక్కువ కాకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తుంటాం. ప్రతి జిల్లా అభ్యర్థులకూ ఏడాదికి రెండుసార్లు అవకాశం వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ లోపు కనీ సం 854 మందికి సోల్జర్ (జనరల్ డ్యూ టీ), టెక్నికల్ (నర్సింగ్), సోల్జర్ (ట్రేడ్స్‌మెన్).. ఇలా మూడు విభాగాల్లోఆర్మీ అవకాశం కల్పించింది. అంతకు మిం చిన అర్హతలున్న అభ్యర్థులున్నా తీసుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా క్లరికల్ విభాగంలో వీలైనంత ఎక్కువమందికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఈ విభాగంలో చాలామంది పరీక్ష రాశారు.
రేపోమాపో ఫలితాలొస్తాయి. కానీ మా కోరిక ఒకటే. దయజేసి ఎవరెన్ని చెప్పినా, ఏం చేస్తామన్నా, ఉద్యోగాలిప్పిస్తామంటే మాత్రం పైసా కూడా ఇవ్వొ ద్దు. లంచం ఇచ్చి దేశానికి సేవ చేస్తారా? తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఏజెంట్ల చేతి లో పెట్టొద్దు. ఎవర్నీ నమ్మకండి. కష్టపడి రోజూ వ్యాయాయం చేస్తే ఉద్యోగం గ్యారెంటీ.
మూడు నెలల్లోనే ఉద్యోగం
రూపాయి ఖర్చు లేకుండా, కానీ లంచం లేకుండా, పైరవీలతో పని లేకుండా వచ్చే ఉద్యోగం ఆర్మీ ఉద్యోగమే. దేహ దారుఢ్యం, ఎత్తు, పరుగు, చదువుకు సం బంధించి అన్ని పత్రాలు ఉండి.. వైద్య పరీక్షలు, అర్హత పరీక్షల్లో విజయం సాధిస్తే మూడంటే మూడు నెలల్లో ని యామక పత్రం చేతిలోకొచ్చి వాలుతుంది. ఈ ర్యాలీకి సంబంధించి ప్రస్తుతం మొదటి దశ ప్రక్రియ జరుగుతోంది. మార్చి 15నాటికి ఫలితాలొచ్చేస్తాయి. ఏప్రిల్ మొదటి వారంలో అన్ని పరీక్షలూ పూర్తయిపోతాయి.
మొదటి నెల జీతమే కనీసం రూ.30వేలు (అన్నీ కలుపుకొని). అందుకే ఈ ఉద్యోగాల కోసం ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా సహా కేంద్ర పాలిత ప్రాంతం అయిన యానాం నుంచీ అభ్యర్థులొచ్చారు. ఇంజినీరింగ్ అభ్యర్థులూ క్యూలో ఉన్నారు. ఏడెనిమిది వేల మంది అభ్యర్థులొస్తారని ఊహిస్తే 11వేలకు పైగా అభ్యర్థులు తమ భవిష్యత్తును వెతుక్కొంటూ వచ్చారు. మే మొదటి వారం లో వచ్చే ఏడాదికి సంబంధించి ఆదిలాబాద్‌లో మరో ర్యాలీకి సన్నహాలు చేస్తున్నాం.
సమాచారం సేకరించండి
ఈ ఉద్యోగం ఆశించేవారు ఇప్పటికే ఆర్మీలో పనిచేసి రిటైరైన వారి ద్వారా సమాచారం సేకరించవచ్చు. వాళ్లిచ్చే సలహాలతో రోజూ ప్రాక్టీస్ చేసుకుంటే ఉద్యోగం గ్యారెంటీ. మరిన్ని వివరాల కోసం ఏపీ డాట్ ఎన్‌ఐసీ డాట్ ఇన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే చాలామంది అభ్యర్థులు ఒకసారి ఫెయిలయ్యామని రెండోరోజో, మూడోరోజో వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అర్హతలేని అభ్యర్థులకు చేతి వేళ్లపై సిరా ఇంకు పెడుతున్నాం. కొంతమంది వాటిని సబ్బు, సర్ఫ్ ఇలా రకరకాలుగా చెరిపేసుకుని మళ్లీ వచ్చేస్తున్నారు. మేం వాళ్లను కోరేది ఒక్కటే.. ‘మరో చాన్స్ కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. వచ్చే ర్యాలీలో ముందుండండి.
ఏడాదిలోనే హిందీ నేర్పిస్తాం
దేశంలో అత్యధికులు మాట్లాడేది, ఆర్మీలో సంభాషించేంది హిందీ భాషే. గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు భాష రాక ఇబ్బందులు పడటం సహ జమే. అయితే ఒకసారి ఆర్మీకి ఎంపికైతే వివిధ దశల్లో భాష నేర్పుతారు. ‘స్ట్రక్చరల్ క్లాసెస్’ ద్వారా ఏ డాది వ్యవధిలో అందరికీ భాష వచ్చేస్తుంది. డిపార్ట్‌మెంటల్ అర్హత ఉద్యోగాల ద్వారా పదోన్నతులు సాధించొచ్చు.
- కల్నల్ ఎ.కె.సింగ్, ఆర్మీ ఉద్యోగ నియామక ప్రక్రియ పరిశీలన అధికారి
సాంకేతికత కూ విలువే
పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకే ఆర్మీ ఉద్యోగం అనుకుంటాం. కానీ బీటెక్ పూర్తయి, ఎంటెక్ చేస్తున్నవాళ్లూ వస్తున్నారు. బాధనిపిస్తుంది. కానీ వారికీ భవిష్యత్తు ఉంటుంది. వచ్చేదంతా సాంకేతిక కాలమే. సైన్యంలో కంప్యూటర్ల వినియోగం ఎక్కువైంది. ఆయుధ సంపత్తి వినియోగానికి ఇంజినీరింగ్ విద్య అవసరమే. కొత్త పరికరాలు డిజైన్ చేయడం, వాటి ప్రోగ్రామింగ్‌కు ఇప్పుడు ఈ తరహా అభ్యర్థులు అవసరం.
-సంగ్రాం దాల్వి, డీడీజీ(రిక్రూట్‌మెంట్), చెన్నై
సవాళ్లు..సౌకర్యాలు
Published Thu, Feb 19 2015 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement
Advertisement