Army officials
-
'అమరన్'ని సత్కరించిన ఆర్మీ అధికారులు (ఫొటోలు)
-
సిక్కిం వరదలు..18కి చేరిన మరణాలు
గ్యాంగ్‌టక్: సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. అదేవిధంగా, 22 మంది ఆర్మీ అధికారులు సహా గల్లంతైన వారి సంఖ్య 98కు పెరిగింది. ఉత్తర సిక్కింలో తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలోని ఎల్‌హొనాక్ సరస్సు ఉప్పొంగి సంభవించిన వరదల్లో గల్లంతైన మరో ఆరుగురి మృతదేహాలు లభ్యం కావడంతో మరణాల సంఖ్య 18కు చేరుకుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎస్‌ఎస్‌డీఎంఏ) గురువారం బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటివరకు 2,011 మందిని కాపాడినట్లు పేర్కొంది. గల్లంతైన 22 మంది జవాన్ల ఆచూకీ కోసం దిగువ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వివరించింది. ఇలా ఉండగా, వరదల్లో కొట్టుకువచ్చిన 18 మృతదేహాల్లో నాలుగు జవాన్లవని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ఇవి సిక్కింలో గల్లంతైన జవాన్ల మృతదేహాలా కాదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలతో చుంగ్థంగ్ డ్యామ్ ధ్వంసం కావడం.. విద్యుత్ మౌలిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతినడంతోపాటు నాలుగు జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంగన్ జిల్లాలోని 8 వంతెనలు సహా మొత్తం 11 బ్రిడ్జీలు వరదల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి పదో నంబర్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. చుంగ్థంగ్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. తీస్తా నదికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నందున, పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని ఎస్‌ఎస్‌డీఎంఏ కోరింది. సిక్కింలోని వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయిన వేల మంది పర్యాటకుల్లో విదేశీయులూ ఉన్నారు. -
కశ్మీర్లో ఉగ్రఘాతుకం
రాజౌరీ/జమ్మూ: ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టిన సైన్యంపై ఉగ్రవాదులు మాటువేసి మెరుపుదాడి చేశారు. ఈ దుర్ఘటనలో ఆర్మీ కల్నల్, మేజర్, డిప్యూటీ ఎస్పీలు వీరమరణం పొందారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని గరోల్ దగ్గర్లోని కొకొరెనాగ్ కొండ ప్రాంతంలో జరిగింది. రాజౌరీలో ఉగ్రకాల్పుల్లో జవానును కాపాడబోయి సైనిక జాగిలం కెంట్ ప్రాణాలు కోల్పోయిన మరుసటి రోజే ఈ కాల్పుల ఘటన జరగడం విషాదకరం. బుధవారం ఉదయం సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొకొరెనాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో మంగళవారం రాత్రి సైన్యం, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు వెంటనే తూటాల వర్షం కురిపించారు. దీంతో 19వ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ అధికారి అయిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిశ్ ధోనక్, డిప్యూటీ ఎస్పీ హుమయూన్ భట్ నేలకొరిగారు. J-K: Army Colonel, Major killed in gunfight with terrorists in Anantnag Read @ANI Story |https://t.co/29Tvl95ZE6#IndianArmy #TerroristAttack #Anantnag pic.twitter.com/HsGielfLEy — ANI Digital (@ani_digital) September 13, 2023 జమ్మూకశ్మీర్ మాజీ ఐజీ గులామ్ హసన్ భట్ కుమారుడే ఈ హుమయూన్. కాల్పుల ఘటనకు నిషేధిత రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ బాధ్యత ప్రకటించుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ లష్కరే తోయిబానే ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థను వెనక ఉండి నడిపిస్తోంది. ఆగస్టు నాలుగో తేదీన కుల్గామ్ జిల్లాలోని హలన్ అటవీప్రాంతంలో ముగ్గురు జవాన్ల మరణానికి కారకులైన వారే బుధవారం దాడి చేశారని సైనిక నిఘా వర్గాలు వెల్లడించాయి. Anantnag encounter | A Jammu and Kashmir Police official also lost his life in the encounter. The Army officers were leading the troops from the front after they had gone to search for terrorists in the area based on specific intelligence: Indian Army officials — ANI (@ANI) September 13, 2023 ఇదీ చదవండి: సైనికున్ని రక్షించేందుకు.. తూటాలకు ఎదురునిలిచి.. సైనిక శునకం ప్రాణ త్యాగం -
కులుమనాలిలో చిక్కుకున్న జీవీఎంసీ కార్పొరేటర్లు
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): అధ్యయన యాత్రకు వెళ్లిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కు చెందిన 74 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కులు మనాలిలో చిక్కుకు పోయారు. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో దాదాపు 20 గంటలపాటు నీరు, ఆహారం లేక అవస్థలు పడ్డారు. ఆర్మీ అధికారులు శనివారం రాత్రి ట్రాఫిక్ క్లియర్‌చేసి వాహనాలను వదలడంతో ఊపిరిపీల్చుకున్నారు. విశాఖ నుంచి మొత్తం 141 మంది ఈ నెల 16న అధ్యయన యాత్రకి వెళ్లారు. తొలుత ఢిల్లీ, ఆ తర్వాత సిమ్లాకు వెళ్లారు. అక్కడి నుంచి కులు మనాలి వెళ్లారు. మనాలి కార్పొరేషన్ విజిట్ అనంతరం శుక్రవారం చండీగఢ్‌కు వెళ్లాల్సి ఉంది. వీరిలో ఏడుగురు విమానంలో చండీగఢ్ వెళ్లేందు కులు మనాలిలో ఉండిపోయారు. మిగతా 134 మంది 4 బస్సుల్లో రాత్రి 11 గంటలకు బయల్దేరారు. చండీఘర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో మండీ వద్ద జోరుగా కురుస్తున్న వానకు కొండ చరియలు విరిగిపడ్డాయి. కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్పొరేటర్ల బస్సులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం సాయంత్రం వరకు బస్సులోనే ఉండాల్సి వచ్చింది. కనీసం తాగడానికి నీరు కూడా దొరకలేదని కొందరు కార్పొరేటర్లు చెప్పారు. శనివారం ఉదయం 11 గంటల అనంతరం ఉత్తరాఖండ్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఆ రాష్ట్రం నుంచి ఆర్మీ అధికారులు వచ్చారని, కొన్ని అరటిపండ్లు, రొట్టెలు ఇవ్వడంతో కొంత ఉపశమనం కలిగిందని తెలిపారు. శనివారం రాత్రి 7 గంటల తర్వాత అధికారులు రోడ్డుపై బండ రాళ్లను, దెబ్బ తిన్న వాహనాలను తొలగించారు. దీంతో కార్పొరేటర్ల బస్సులు కూడా బయల్దేరాయి. అందరూ సురక్షితం : మేయర్ కార్పొరేటర్లంతా సురక్షితంగానే ఉన్నారని విశాఖ మేయర్ గొలగాని హరివెంకటకుమారి చెప్పారు. కార్పొరేటర్లంతా ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచి వైజాగ్ వస్తారని ఆమె తెలిపారు. -
దేశ ప్రగతికోసం అగ్నిపథ్‌లో నడుస్తున్నారు మోదీ!
న్యూఢిల్లీ: దేశ ప్రగతికి ప్రధాని నరేంద్ర మోదీ అగ్నిపథ్ పై నడిచారంటూ బీజేపీ అధికార ప్రతినిధి మోదీపై ప్రశంసల జల్లు కరిపించారు. ఈ అగ్నిపథ్ పథకం పై పెద్ద ఎత్తు ప్రతిపక్షాల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో... సంస్కరణలు, పనితీరులో మార్పులు రూపాంతరం చెందకపోతే భారత్ ఎలా గొప్పగా మారుతుందని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఈ మేరకు అగ్నిపథ్ పథకానికి సంబంధించి భారత సాయుధ బలగాల ఉన్నతాధికారులతో జరిగిన మీడియా సమావేశం బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో సంబిత్ పాత్రా మాట్లాడుతూ...లెఫ్టినెంట్ జనరల్ పూరి ఆర్మీ కాన్ఫరెన్స్‌లో అగ్నిపథ్ కార్యక్రమాన్ని వివరించిన తీరు.. అందులో ఎలాంటి సందేహం లేదని అనుకుంటున్నా. కొన్ని విషయాల్లో రాజకీయాలు ఉండకూడదని చెప్పడం బాధాకరమన్నారు. జాతీయ విధానాలపై కూడా దేశంలో రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. ఆర్మీ అధికారులు ముందుకు వచ్చి ఈ దేశంలో కాల్పులకు, హింసకు తావు లేదని, హింసకు పాల్పడవద్దని నిరసనకారులకు చెప్పాలి. భారతదేశ ప్రగతి కోసం మోదీ అగ్నిపథ్‌లో నడవడం చూసి ఓర్వలేకపోతున్నారు. ఈ జాతీయవాదాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ సమావేశంలో ఒక సీనియర్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ..."ఈ పథకాన్ని వెనక్కి తీసుకోమని స్పష్టం చేశారు. దేశాన్ని యవ్వనంగా మార్చడానికి ఇదోక ప్రగతిశీల. మేము జాతీయ భద్రతలో తలామునకలవుతున్నాం, మాకసలు తీరికనేది ఉండేదు. ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నా...ఎత్తైన ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నప్పుడు ఆరోగ్యం పై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా అని ప్రశ్నించారు. ఏటా చాలా మంది ఈ ప్రాంతాల్లో చనిపోతున్నారు. ఎంత ప్రాణ నష్టం వాటిల్లుతోందో కూడా మీకు తెలియదు. ముందు వీటి గురించి కూలంకషంగా తెలుసుకోండి. ఆ తర్వాత యువత ఎందుకు ముఖ్యమో మీకు అర్థమవుతుంది." అని అన్నారు. (చదవండి: అగ్నిపథ్‌పై కీలక ప్రకటన) -
భారత్–చైనా మధ్య 15వ దఫా చర్చలకు రంగం సిద్ధం
బీజింగ్/న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య ఈ నెల 11న జరగబోయే 15వ దఫా చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలకు ముగింపు పలకడమే ఈ ఉన్నత స్థాయి సైనిక చర్చల లక్ష్యమని అన్నారు. శుక్రవారం లద్దాఖ్‌లోని చుషూల్ మాల్డో మీటింగ్ పాయింట్ వద్ద ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. భారత్–చైనా మధ్య పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలంటే సరిహద్దుల్లో శాంతి తప్పనిసరిగా నెలకొనాలని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా చెప్పారు. (చదవండి: దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ) -
సానుకూలంగా భారత్–చైనా చర్చలు
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో శనివారం రెండు దేశాల సైనికాధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు సానుకూలంగా ముగిశాయి. లదాఖ్‌లోని గాల్వాన్ లోయ, పాంగోంగ్ త్సో, గోగ్రా ప్రాంతాల్లో సరిహద్దులకు సమీపంలో మునుపటి పరిస్థితులను నెలకొల్పాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ కోరిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. మున్ముందు కూడా సంప్రదింపులు జరుపుకోవాలని, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను సైనిక, దౌత్యపరమైన మార్గాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అయితే, భారత్ గానీ, చైనా గానీ ఈ చర్చలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. చైనా భారీగా సైన్యాన్ని తరలించడం, సైనిక నిర్మాణాలను చేపట్టడంతో నెల రోజులుగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో చైనా భూభాగంలోని చెషుల్ సెక్టార్ మాల్దోలో జరిగిన ఈ చర్చలకు భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా చైనా పక్షాన టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ హాజరయ్యారు. ఉదయం 8.30 గంటలకే సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో మూడు గంటలు ఆలస్యంగా మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల రోజుల్లో రెండు దేశాల స్థానిక సైనిక కమాండర్ల స్థాయిలో 12 రౌండ్లు, మేజ ర్ జనరల్ స్థాయిలో మూడు రౌండ్ల చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి సాధించలేదు. -
టార్గెట్ ‘ఆర్మీ’ !
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరాదికి చెందిన సైబర్ నేరగాళ్ళు నగరానికి చెందిన ఆర్మీ అధికారులు, సిబ్బందిని టార్గెట్‌గా చేసుకున్నారు. వీరి చేతిలో మోసపోయిన ముగ్గురు ఆర్మీ సంబంధీకులు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో పని చేస్తున్న ఓ ఆర్మీ అధికారి ఇటీవల జియో ఫోన్‌కు ఆన్లైన్లో రీ–చార్జ్ చేసుకున్నారు. అయితే ఆ మొత్తం తన నెంబర్‌కు చేరకపోవడంతో సహాయం కోసం ప్రయత్నించారు. గూగుల్‌లో సెర్చ్ చేసిన ఆయన అందులో జియో కాల్ సెంటర్ పేరుతో కనిపించిన నెంబర్‌కు కాల్ చేశారు. ఆ సంస్థ ప్రతినిధులుగా స్పందించిన సైబర్ నేరగాళ్ళు విషయం మొత్తం విన్నారు. తాము పంపే లింకు ఓపెన్ చేసి, అందులో కోరిన వివరాలు నింపాలని ఆ వెంటనే మీ మొత్తం తిరిగి వచ్చేస్తుందని నమ్మబలికారు. సైబర్ నేరగాళ్ళ నుంచి వచ్చిన లింకును ఓపెన్ చేసిన ఈయన అందులో కోరిన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఓటీపీని పొందుపరిచారు. వీటి ఆధారంగా సైబర్ నేరగాళ్ళు ఆయన ఖాతా నుంచి రూ.42 వేలు కాజేశారు. మరో ఉదంతంలో తిరుమలగిరిలోని ఆర్మీ కార్యాలయంలో పని చేసే ఓ జవాన్‌కు ఇటీవల జమ్మూ కాశ్మీర్‌కు బదిలీ అయింది. ద్విచక్ర వాహనం లేని ఈయన అక్కడకు వెళ్లేలోపే ఒకటి ఖరీదు చేయాలని భావించారు. దానికోసం ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేశారు. అందులో ఆర్మీ అధికారి మాదిరిగా, యాక్టివా 5 జీ వాహనం విక్రయం పేరుతో ఉన్న ప్రకటనకు స్పందించారు. బేరసారాల తర్వాత రూ.23 వేలకు వాహనం ఖరీదు చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఆర్మీ అధికారిగా చెప్పుకున్న సైబర్ నేరగాడు ఆర్మీ ట్రాన్స్పోర్ట్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని చెప్పడంతో నగరంలో ఉంటున్న జవాన్ నమ్మేశాడు. ఆ మొత్తం ఆన్లైన్లో బదిలీ చేయగా... మరికొన్ని చార్జీల పేరు చెప్పి మొత్తం రూ.1.3 లక్షలు తమ ఖాతాల్లో వేయించుకున్నారు. సైబర్ నేరగాళ్ళు ప్రతి సందర్భంలోనూ వాహనం ఖరీదు మినహా మిగిలిన అన్ని చార్జీలకు చెందిన నగదు రిఫండ్ వస్తుందని చెప్పడంతో బాధితుడు చెల్లిస్తూ పోయాడు. మూడో ఉదంతంలో సికింద్రాబాద్‌లోని మిలటరీ విభాగంలో పని చేసే మరో జవాన్ టార్గెట్‌గా మారారు. ఈయన స్నేహితుడికి ఇటీవల మరో ప్రాంతానికి బదిలీ అయింది. ఆయన వెళ్తూ తన ఇన్వర్టర్ను అమ్మి పెట్టాలంటూ నగరంలో ఉంటున్న జవాన్‌కు ఇచ్చి వెళ్లారు. దాన్ని విక్రయించడానికి ఈయన ఓఎల్‌ఎక్స్‌ను ఆశ్రయించారు. ఈ ప్రకటన చూశామని, తమకు నచ్చిందని చెప్తూ సైబర్ నేరగాళ్ళు కాల్ చేశారు. సదరు ఇన్వర్టర్ ఖరీదు చేస్తున్నామంటూ చెప్పి క్యూఆర్ కోడ్స్ పంపారు. వీటిని బాధితుడు స్కాన్ చేయడంతో రూ.44 వేలు నేరగాళ్ళ ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. ఈ ముగ్గురూ గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు ఓటీపీ, తదితర ఫ్రాడ్స్‌తో నగదు కోల్పోయిన బాధితులు సైతం సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. -
హైదరాబాద్‌లో టెర్రరిస్టుల కలకలం
సాక్షి హైదరాబాద్: హింసాత్మక ఘటనలే లక్ష్యంగా నగరంలోకి ప్రవేశించిన అగంతకులను ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్ర రాజధానిలో టెర్రరిస్టుల కలకలం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. హైదరాబాద్‌లో అగంతకులు చొరబడ్డారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆర్మీ అధికారులు తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు. అల్వాల్‌తో పాటు అనుమానం ఉన్న ప్రాంతాలను అధికారులు జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఆర్మీ ‘పండిట్’ నియామకాల్లో అక్రమాలు
సాక్షి, హైదరాబాద్ : ఆర్మీలో రిలీజియస్ టీచర్స్ (పండిట్) ఉద్యోగాల నియామక ప్రక్రియలో కుంభకోణం జరిగిందని సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఆర్టిలరీ సెంటర్లో జరిగిన ఇంటర్వ్యూకు దేశంలోని అనేక రాష్ట్రాల అభ్యర్థులు హాజరయ్యారు. 2013 నుంచి 2014 మధ్య హైదరాబాద్‌లో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రక్రియలో కుంభకోణం జరిగిందని సీబీఐ పేర్కొంది. కొందరు ఆర్మీ సుబేదార్ అధికారులు అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలొచ్చాయి. ఆర్మీ సుబేదార్ ఎమ్ఎన్ త్రిపాఠి కుంభకోణం మొత్తానికి సూత్రధారిగా పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఇంటర్వ్యూలో సులభమైన ప్రశ్నలు అడిగేందుకు పలువురు అభ్యర్థుల నుంచి నగదును బినామీల అకౌంట్ల ద్వారా త్రిపాఠి స్వీకరించినట్లు తెలంగాణ, ఏపీ హెడ్‌క్వార్టర్ మేజర్ జనరల్ శ్రీనివాస్‌రావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. త్రిపాఠితో పాటు సత్యప్రకాశ్, ఎంకే పాండే, నాయక్ ఆదిత్యనారాయణ్ తివారీ, క్రాఫ్ట్స్‌మెన్ ప్రవీణ్‌కుమార్ సారస్వత్, నాయక్ సుబేదార్ పూజాన్ ద్వివేదీ, లాన్స్‌నాయక్ జితేంద్రకుమార్ యాదవ్, నాయక్ జగదీశ్ నారాయణ్‌పాండే, నాయక్ çసుబేదార్ బాల్ కృష్ణగార్గ్, సిపాయ్ మద్వేంద్ర మిశ్రా, సిపాయ్ రాజేశ్‌కుమార్ గోస్వామి, నాయక్ సుబేదార్ శక్తిధర్‌తివారీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. త్రిపాఠికి బినామీగా వ్యవహరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇంద్రజీత్‌గుప్తా, మితాయిలాల్‌గుప్తా, అమర్‌నాథ్‌గుప్తా, విశ్వజీత్ గుప్తా, మధ్యప్రదేశ్‌కు చెందిన పంకజ్ బిల్తారేపై కూడా కేసులు నమోదయ్యాయి. 12 మంది అభ్యర్థులకు, నిందితులకు మధ్య రూ.42 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు ఆర్మీ అంతర్గత విచారణలో తేలిందని సీబీఐ వెల్లడించింది. -
కుప్వారాలో ఎన్కౌంటర్: ఉగ్రవాది హతం
కుప్వారా: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. -
ప్రారంభమైన ఆర్మీ ర్యాలీ
తొలిరోజు హాజరైన 3,100 మంది యువత కొత్తగూడెం: తెలంగాణ పది జిల్లాల స్థాయి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో గురువారం ప్రారంభమైంది. ముందురోజు రాత్రే పలువురు అభ్యర్థులు ర్యాలీ నిర్వహించే ప్రాంతాలకు చేరుకోగా, వేకువజామున 3 గంటలకు ఆర్మీ ర్యాలీ ప్రక్రియను ఆర్మీ అధికారులు ప్రారంభించారు. పరుగుపందెంను కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు జెండా ఊపి ప్రారంభిం చారు. తొలిరోజు సోల్జర్ టెక్నికల్ విభాగంలో అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఐదు కేటగిరీల్లోని 780 పోస్టులకుగాను మొత్తం 4,359 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా 3,100 మంది హాజరయ్యారు. ఎత్తు, ఛాతీ కొలతలు సరిపోక 200 మందిని తిరస్కరించారు. ఎంపికైన అభ్యర్థులకు పుల్ అప్స్, బ్యాలెన్సింగ్ బీమ్, లాంగ్‌జంప్ పోటీలు నిర్వహిం చారు. అన్ని పోటీల్లో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహిం చనున్నారు. ర్యాలీకి హాజరైన అభ్యర్థులకు అధికారులు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. అన్ని విభాగాల్లో ఎంపికైన వారికి ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో రెండు బ్యాచ్‌లకు రాతపరీక్షలు నిర్వహిస్తామని, ఏప్రిల్ మొదటి తేదీ నుంచి శిక్షణకు పంపిస్తామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ డెరైక్టర్ బ్రిగేడియర్ సంగ్రామ్ దాల్వి చెప్పారు. ఆర్మీ ర్యాలీ ప్రక్రియను సంగ్రామ్ దాల్వితోపాటు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ సికింద్రాబాద్ కల్నల్ ఎ.కె.రోహిల్లా పర్యవేక్షించారు. నేడు సోల్జర్ క్లర్క్, నర్సింగ్ అసిస్టెంట్ ఎంపిక రిక్రూట్మెంట్ ర్యాలీలో శుక్రవారం సోల్జర్ క్లర్క్, నర్సింగ్ అసిస్టెంట్ విభాగాల్లో ఎంపికలు జరగనున్నాయి. ఈ రెండు విభాగాలకు సంబంధించి 5,596 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వేకువ జామున అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనతో ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా శుక్రవారం నిర్వహించనున్న సోల్జర్ క్లర్క్, నర్స్ అసిస్టెంట్ పోస్టుల ఎంపిక కోసం అభ్యర్థులు గురువారం సాయంత్రం 4 గంటల నుంచే క్యూ కట్టారు. -
నో యువర్ ఆర్మీ
-
సవాళ్లు..సౌకర్యాలు
రెండూ సమపాలు..అదే ఆర్మీ విశిష్టత పైరవీలకు చోటు లేదు..ప్రతిభకే పట్టం ఉన్నత విద్యావంతులకూ అవకాశాలు దేశమాత సేవలో తరించే అదృష్టం ఏటా నాలుగుసార్లు నియామక ర్యాలీలు ‘సాక్షి’తో ఆర్మీ అధికారులు సంగ్రాం దాల్వి, ఏకే సింగ్ రాత్రింబవళ్లు పహారా కాస్తాం. శత్రు దేశాల నుంచి మన సరిహద్దులను కాపాడతాం. దేశమాత సేవకు ఇంతకన్నా మంచి అవకాశం.. అదృష్టం ఇంకేముంటుంది.ఆ అవకాశాన్ని.. అదృష్టాన్ని ఆర్మీ కల్పిస్తోంది. అదీ అభ్యర్థుల వద్దకే వచ్చి కల్పిస్తోందని చెన్నైకి చెందిన ఆర్మీ డిప్యూటీ డెరైక్టర్ జనరల్(రిక్రూట్మెంట్) సంగ్రాం దాల్వి అన్నారు. పట్టణంలో జరుగుతున్న ఆర్మీ ఉద్యోగ నియామక ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన ఇక్కడి ప్రత్యేక అధికారి కల్నల్ ఎ.కె.సింగ్‌తో కలిసి ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే.. శ్రీకాకుళం : నెలల తరబడి కుటుంబాలకు దూరంగా కొండకోనల్లో విధులు నిర్వర్తించే ఆర్మీ ఉద్యోగం అంటేనే ఓ సవాల్. అయినా ఇందులో దేశసేవలో తరిస్తున్నామన్న తృప్తి ఉంటుంది.తక్కువ వయసులోనే ఉద్యోగానికి ఎంపికై పిన్న వయసులోనే పదవీ విరమణ తీసుకుంటాం. అయినప్పటికీ సైనికుల కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యాలు, రవాణా భత్యం, భోజనం ఇలా..అన్నీ కల్పించేందుకు దే శం ముందుకు వచ్చింది. ఉద్యోగ విరమణ తరువాత ఒక్క ఐడీ కార్డుతో మరెన్నో ఉద్యోగ అవకాశాలు. ఒక కుటుంబం జీవితాంతం హాయిగా ఉండే అవకాశం కల్పిస్తున్న ఉద్యోగం ఇది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ఆర్మీ ఉద్యోగం వేల రెట్ల సంతృప్తినిస్తుంది. అందుకే ఆర్మీకి రండి.. దేశ సేవ చేయండి. వ్యాయామమే పెట్టుబడి ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మార్చిలోపు నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి 12 ర్యాలీల ద్వారా వెయ్యి మందికి తక్కువ కాకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తుంటాం. ప్రతి జిల్లా అభ్యర్థులకూ ఏడాదికి రెండుసార్లు అవకాశం వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ లోపు కనీ సం 854 మందికి సోల్జర్ (జనరల్ డ్యూ టీ), టెక్నికల్ (నర్సింగ్), సోల్జర్ (ట్రేడ్స్‌మెన్).. ఇలా మూడు విభాగాల్లోఆర్మీ అవకాశం కల్పించింది. అంతకు మిం చిన అర్హతలున్న అభ్యర్థులున్నా తీసుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా క్లరికల్ విభాగంలో వీలైనంత ఎక్కువమందికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఈ విభాగంలో చాలామంది పరీక్ష రాశారు. రేపోమాపో ఫలితాలొస్తాయి. కానీ మా కోరిక ఒకటే. దయజేసి ఎవరెన్ని చెప్పినా, ఏం చేస్తామన్నా, ఉద్యోగాలిప్పిస్తామంటే మాత్రం పైసా కూడా ఇవ్వొ ద్దు. లంచం ఇచ్చి దేశానికి సేవ చేస్తారా? తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఏజెంట్ల చేతి లో పెట్టొద్దు. ఎవర్నీ నమ్మకండి. కష్టపడి రోజూ వ్యాయాయం చేస్తే ఉద్యోగం గ్యారెంటీ. మూడు నెలల్లోనే ఉద్యోగం రూపాయి ఖర్చు లేకుండా, కానీ లంచం లేకుండా, పైరవీలతో పని లేకుండా వచ్చే ఉద్యోగం ఆర్మీ ఉద్యోగమే. దేహ దారుఢ్యం, ఎత్తు, పరుగు, చదువుకు సం బంధించి అన్ని పత్రాలు ఉండి.. వైద్య పరీక్షలు, అర్హత పరీక్షల్లో విజయం సాధిస్తే మూడంటే మూడు నెలల్లో ని యామక పత్రం చేతిలోకొచ్చి వాలుతుంది. ఈ ర్యాలీకి సంబంధించి ప్రస్తుతం మొదటి దశ ప్రక్రియ జరుగుతోంది. మార్చి 15నాటికి ఫలితాలొచ్చేస్తాయి. ఏప్రిల్ మొదటి వారంలో అన్ని పరీక్షలూ పూర్తయిపోతాయి. మొదటి నెల జీతమే కనీసం రూ.30వేలు (అన్నీ కలుపుకొని). అందుకే ఈ ఉద్యోగాల కోసం ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా సహా కేంద్ర పాలిత ప్రాంతం అయిన యానాం నుంచీ అభ్యర్థులొచ్చారు. ఇంజినీరింగ్ అభ్యర్థులూ క్యూలో ఉన్నారు. ఏడెనిమిది వేల మంది అభ్యర్థులొస్తారని ఊహిస్తే 11వేలకు పైగా అభ్యర్థులు తమ భవిష్యత్తును వెతుక్కొంటూ వచ్చారు. మే మొదటి వారం లో వచ్చే ఏడాదికి సంబంధించి ఆదిలాబాద్‌లో మరో ర్యాలీకి సన్నహాలు చేస్తున్నాం. సమాచారం సేకరించండి ఈ ఉద్యోగం ఆశించేవారు ఇప్పటికే ఆర్మీలో పనిచేసి రిటైరైన వారి ద్వారా సమాచారం సేకరించవచ్చు. వాళ్లిచ్చే సలహాలతో రోజూ ప్రాక్టీస్ చేసుకుంటే ఉద్యోగం గ్యారెంటీ. మరిన్ని వివరాల కోసం ఏపీ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే చాలామంది అభ్యర్థులు ఒకసారి ఫెయిలయ్యామని రెండోరోజో, మూడోరోజో వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అర్హతలేని అభ్యర్థులకు చేతి వేళ్లపై సిరా ఇంకు పెడుతున్నాం. కొంతమంది వాటిని సబ్బు, సర్ఫ్ ఇలా రకరకాలుగా చెరిపేసుకుని మళ్లీ వచ్చేస్తున్నారు. మేం వాళ్లను కోరేది ఒక్కటే.. ‘మరో చాన్స్ కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. వచ్చే ర్యాలీలో ముందుండండి. ఏడాదిలోనే హిందీ నేర్పిస్తాం దేశంలో అత్యధికులు మాట్లాడేది, ఆర్మీలో సంభాషించేంది హిందీ భాషే. గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు భాష రాక ఇబ్బందులు పడటం సహ జమే. అయితే ఒకసారి ఆర్మీకి ఎంపికైతే వివిధ దశల్లో భాష నేర్పుతారు. ‘స్ట్రక్చరల్ క్లాసెస్’ ద్వారా ఏ డాది వ్యవధిలో అందరికీ భాష వచ్చేస్తుంది. డిపార్ట్మెంటల్ అర్హత ఉద్యోగాల ద్వారా పదోన్నతులు సాధించొచ్చు. - కల్నల్ ఎ.కె.సింగ్, ఆర్మీ ఉద్యోగ నియామక ప్రక్రియ పరిశీలన అధికారి సాంకేతికత కూ విలువే పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకే ఆర్మీ ఉద్యోగం అనుకుంటాం. కానీ బీటెక్ పూర్తయి, ఎంటెక్ చేస్తున్నవాళ్లూ వస్తున్నారు. బాధనిపిస్తుంది. కానీ వారికీ భవిష్యత్తు ఉంటుంది. వచ్చేదంతా సాంకేతిక కాలమే. సైన్యంలో కంప్యూటర్ల వినియోగం ఎక్కువైంది. ఆయుధ సంపత్తి వినియోగానికి ఇంజినీరింగ్ విద్య అవసరమే. కొత్త పరికరాలు డిజైన్ చేయడం, వాటి ప్రోగ్రామింగ్‌కు ఇప్పుడు ఈ తరహా అభ్యర్థులు అవసరం. -సంగ్రాం దాల్వి, డీడీజీ(రిక్రూట్మెంట్), చెన్నై -
కూండ్రం చేరిన ఆర్మీజవాన్ మృతదేహం
* కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు * నాయుడుబాబు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపిన * ఆర్మీ అధికారులు నేడు అంత్యక్రియలు తుమ్మపాల: జమ్మూకాశ్మీర్‌లో మృతి చెందిన ఆర్మీ జవాన్ సేనాపతి నాయుడుబాబు మృతదేహం స్వగ్రామం కూండ్రంకు సోమవారం రాత్రి 10 గంటలకు తీసుకొచ్చారు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న కొడుకు శవమై రావడాన్ని తల్లిదండ్రులు ఈశ్వరరావు, రాము, ఇతర కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. మృతదేహాన్ని జమ్మూకాశ్మీర్‌లోని 54ఆర్ఆర్ యూనిట్ నుంచి సుబేదార్ ఇ. శ్రీనివాసరావు, నాయక్ నరేష్‌లు విమానంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తరలించారు. గ్రామమంతటా విషాదం అలుముకుంది. జవాన్ మృతికి సంబంధించి ఇక్కడకు వచ్చిన ఆర్మీ అధికారులు శ్రీనివాసరావు, నరేష్ మాట్లాడుతూ 25వ తేదీ రాత్రి నాయుడుబాబు తనంతటతానే గుండెలపై గన్‌తో కాల్చుకొని మరణించాడని తెలిపారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ కూడా రాసినట్టు తెలిపారు. స్వగ్రామం వచ్చేందుకు ఈ నెల 28వ తేదీన రైల్వే రిజర్వేషన్ కూడా చేయించుకున్నాడని తెలిపారు. ఆత్మహత్యకు కారణం తెలియరాలేదన్నారు. దీనిపై ఆర్మీ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారని, త్వరలో ఇక్కడకు కూడా వచ్చి విచారణ చేపడతారన్నారు. మృతదేహానికి మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. -
'తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు'
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రహదారుల మూసివేత వ్యవహారంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సైనికాధికారులకు గవర్నర్ సూచించారు. రహదారుల మూసివేత తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని తొమ్మిది రూట్లలో వాహనాల రాకపోకలపై రక్షణాధికారులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
దూకుడు పెంచిన ఆర్మీ అధికారులు
కంటోన్మెంట్: కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ రోడ్లపైకి సామాన్యుల రాకపోకలను అక్టోబర్ 2 నుంచి రాత్రి వేళల్లో నియంత్రించనున్నట్టు ప్రకటించిన ఆర్మీ అధికారులు.. రెండ్రోజుల ముందే చర్యలు ప్రారంభించారు. ఎలాంటి సమాచారం లేకుండా సోమవారం రాత్రి ఆంక్షలు విధించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మారేడ్‌పల్లి నుంచి ఏఓసీకి వెళ్లే మార్గంలోని అలహాబాద్ గేట్ వద్ద, పికెట్- ఏఓసీ మార్గంలో స్టాప్ అండ్ గో బేకరీ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి కిలో మీటర్లు మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తూతూ మంత్రంగా భేటీ ఆంక్షల అమలు నేపథ్యంలో ఏఓసీ సెంటర్ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం సమీప కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశం మొక్కుబడిగా ముగిసింది. భేటీకి హాజరైన ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న అభిప్రాయాలను సైతం ఖాతరు చేయకుండా ఆర్మీ అధికారులు తామేమి చెప్పాలనుకున్నారో దానికే పరిమితమయ్యారు. ఆంక్షల నేపథ్యంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై చర్చించి పరిష్కరించుకునేందుకు వీలుగా ఐదుగురు సభ్యులతో కూడిన సివిల్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేసే వరకు రాత్రివేళల్లో సైతం రోడ్లను మూసేయొద్దని ఎంపీ, ఎమ్మెల్యే పదేపదే కోరినా అర్మీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన మల్లారెడ్డి, సాయన్న సమావేశం నుంచి బయటకు వెళ్లడంతో ప్రజలు సైతం వారిని అనుసరించారు. బాబుతో ఒత్తిడి తెప్పిస్తా: మల్లారెడ్డి సమస్యను కేంద్ర రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును కలిసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్యను పరిష్కరిస్తామన్నారు.