
సాక్షి హైదరాబాద్: హింసాత్మక ఘటనలే లక్ష్యంగా నగరంలోకి ప్రవేశించిన అగంతకులను ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్ర రాజధానిలో టెర్రరిస్టుల కలకలం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. హైదరాబాద్‌లో అగంతకులు చొరబడ్డారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆర్మీ అధికారులు తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు. అల్వాల్‌తో పాటు అనుమానం ఉన్న ప్రాంతాలను అధికారులు జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment