
'తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు'
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రహదారుల మూసివేత వ్యవహారంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సైనికాధికారులకు గవర్నర్ సూచించారు. రహదారుల మూసివేత తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని తొమ్మిది రూట్లలో వాహనాల రాకపోకలపై రక్షణాధికారులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.