ఏపీ ఎంపీలు, జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై పవన్ మరోసారి ఎదురుదాడికి దిగారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును లోక్సభలో పెట్టినపుడు సీమాంద్ర ఎంపీలు ఎంత మంది హాజరయ్యారని ఆయన ట్విట్టర్లో ధ్వజమెత్తారు. మార్చి 17, 2015న ఏపీ విభజన బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టినపుడు.. చర్చ జరుగుతున్న సమయంలో కేవలం ఐదుగురు సీమాంధ్ర ఎంపీలు మాత్రమే హాజరయ్యారని పవన్ తెలిపారు. హాజరుకానీ మిగతా ఎంపీలు చర్చలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. మిగిలిన ఎంపీలంతా ఏమయ్యారని అడిగారు. పార్లమెంట్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏ చర్చలో పాల్గొన్నారో...ఏ చర్చలో పాల్గొనలేదో వివరాలని పోస్టు చేశారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్ వెబ్ సైట్ లింక్ ను పోస్ట్ చేశారు.
Published Thu, Jul 9 2015 1:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement