సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం డ్రాలో తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీలు ఆంధ్రకు, ఏపీకి చెందిన ఇద్దరు ఎంపీలు తెలంగాణకు మారిన నేపథ్యంలో వారు తమ ఎంపీ ల్యాడ్స్ నిధులను తమ సొంత రాష్ట్రాల్లో వినియోగించుకునే వెసులుబాటు కలిగింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ నేతృత్వంలోని ఓ కమిటీ ఈ మేరకు తగిన సిఫారసులు చేసింది.
ఈ సిఫారసులను కేంద్రం ఆమోదించి కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీచేయనుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ ఎంపీలు డాక్టర్ కె.కేశవరావు, రేణుకాచౌదరి, టి.దేవేందర్ గౌడ్, ఎం.ఎ.ఖాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేశ్, డాక్టర్ కె.వి.పి.రామచంద్రరావు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఆ ఆరుగురి ఎంపీ ల్యాడ్స్ సొంత రాష్ట్రాల్లోనే!
Published Wed, Dec 17 2014 2:01 AM | Last Updated on Sat, Aug 18 2018 9:00 PM
Advertisement