MPlads funds
-
కరోనాతో ఎంపీ నిధులకు బ్రేక్
రాష్ట్ర ప్రభుత్వం ఎంత అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా కేంద్ర ప్రభుత్వ సాయం ఉంటేనే మరింత మంచి ఫలితాలు వస్తాయి. చన్నీళ్లకు వేడినీళ్లు తోడన్నట్లు కేంద్రం నిధులు ఇచ్చినపుడే అభివృద్ధి వేగంగా జరిగేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కొన్ని రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈప్రభావం జిల్లా అభివృద్ధిపైనా పడుతోంది. విజయనగరం గంటస్తంభం: పట్టణ, గ్రామాలాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అనేక పథకాలు అమలు చేస్తుంటాయి. ఇందులో భాగంగా కేంద్రం ప్రత్యేకంగా కొన్ని పథకాలు అమలు చేయడం జరుగుతోంది. ప్రస్తుతం కూడా రాష్ట్రంలో అనేక పథకాలు కేంద్రం అమలు చేస్తోంది. అయితే వీటిలో కొన్నింటిని కేంద్రం నిలుపుదల చేయడం సమస్యగా మారింది. ఆగిన ఎస్డీపీ.. ఎంపీ లాడ్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా జిల్లాలో కొన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రత్యేక అభివృద్ధి పథకం, పార్లమెంటు సభ్యులు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ లాడ్స్) ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని విభజన బిల్లులో పొందుపరిచారు. ఇందులో భాగంగా ఏడాదికి ప్రతి జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున రూ.350 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఈమేరకు 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2016–17 ఆర్థిక సంవత్సరం వరకు వరుసుగా మూడేళ్లపాటు నిధులు మంజూరు చేసింది. ఒక్కో ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున రూ.150 కోట్లు నిధులు మంజూరయ్యాయి. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.50 కోట్లు విడుదల చేసినా వెంటనే వెనుక్కి తీసుకుంది. ఈనిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోగా 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నిధుల ఊసెత్తలేదు. 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా ఆ పథకం ప్రస్తావన లేదు. కేంద్ర ప్రభుత్వం కావాలని ఈ నిధులను ఆపేసినట్లు సమాచారం. ఇదిలాఉండగా ఈఏడాది నుంచి ఎంపీ లాడ్స్ కూడా ఆగిపోయాయి. ఒక్కో ఎంపీకి ఏడాదికి రూ.5 కోట్లు ఇవ్వాల్సి ఉండగా నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇచ్చారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో ఈఏడాదితోపాటు వచ్చే ఏడాది కూడా ఎంపీ లాడ్స్ నిధులు విడుదల చేయమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఒక్కో ఎంపీకి రెండేళ్లులో రూ.10 కోట్లు నిధులు రావు. దీంతో వారు కేటాయించే పరిస్థితి ఉండదు. అభివృద్ధిపై ప్రభావం ఈరెండు పథకాలు ఆగడంతో జిల్లా అభివృద్ధిపై ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఎస్డీపీ నిధులు ఏడాదికి రూ.50 కోట్లు ఇవ్వడం వల్ల సాగునీటి వనరులు అభివృద్ధి, రోడ్లు, కాలువులు, తాగునీటి పథకాల నిర్మాణం, విద్య, వైద్యం తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వీలుంది. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో సుమారు రూ.200 కోట్లు విలవైన పనులు జరిగాయి. దీంతో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించే పరిస్థితి లేదు. ఈ సమయంలో ఎస్డీపీ పథకం ఉంటే ప్రయోజనం ఉండేది. కనీసం ఎంపీలాడ్స్ ఉన్నా ఎంతోకొంత అభివృద్ధి, సంక్షేమ పనులకు ఆస్కారం ఉండేది. గతేడాది ఒక్కో ఎంపీకి రూ.5 కోట్లు ఇవ్వడం వల్ల విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రూ.3.93 కోట్లుతో 75 పనులు మంజూరు చేశారు. అలాగే అరుకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి తన రూ.5 కోట్లు నుంచి జిల్లాలో పలు పనులకు సుమారు రూ.1.5 కోట్లు ఇచ్చారు. ఎస్.కోట నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ ఎంపీ సత్యనారాయణ రూ.5 లక్షలు ఇచ్చారు. వీటితో అనేక పనులు చేపట్టడం జరిగింది. రెండేళ్లుపాటు వారికి నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు జరిగేందుకు కొంత అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. కరోనాతో ఎంపీ నిధులు ఆగాయి ఈవిషయం జిల్లా ప్రణాళిక శాఖ అధికారి విజయలక్ష్మి వద్ద ప్రస్తావించగా ఎంపీ లాడ్స్ కరోనా నేపథ్యంలో రెండేళ్లు ఉండవని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎస్డీపీ నిధులు 2018–19 నుంచి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడుతుంది. వస్తే అభివృద్ధి పనులకు ఉపయోగపడతాయి. -
ఎంపీల వేతనాల్లో 30% కోత
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా పార్లమెంటు సభ్యులందరి వేతనంలో సంవత్సరం పాటు 30% కోత విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సంఘటిత నిధిలో చేరే ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటంలో వినియోగించనున్నారు. ఈ మేరకు ‘శాలరీ, అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్–1954’కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ రూపొందించామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు కూడా తమ సామాజిక బాధ్యతలో భాగంగా, తమ వేతనాల్లో కొంత భాగాన్ని కరోనాపై పోరుకు వినియోగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. సాయం అందించడం మన నుంచే ప్రారంభం కావాలన్న నానుడిని ఈ సందర్భంగా జవదేకర్ ఉటంకించారు. ఎంపీల వేతనానికి, ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల వేతనాలకు తేడా ఉంటుంది. ఎంపీలు నెలకు సుమారు రూ. లక్ష వేతనంతో పాటు, రూ. 70 వేలను నియోజకవర్గ అలవెన్స్‌గా పొందుతారు. మంత్రుల వేతనం కూడా దాదాపు అంతే ఉంటుంది కానీ వారికి వేరే అలవెన్సులు కూడా ఉంటాయి. అయితే, ఈ కోత వేతనానికే అని, పెన్షన్, ఇతర అలవెన్సుల్లో ఈ కోత ఉండబోదని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఆ తరువాత వివరణ ఇచ్చారు. ఎంపీల్యాడ్(ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్) ఫండ్ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని రెండు ఆర్థిక సంవత్సరాల(2020–21, 2021–22) పాటు నిలిపివేయనున్నారు. ఈ మొత్తాన్ని కూడా కోవిడ్–19పై పోరుకు వినియోగిస్తారు. లోక్‌సభలో 543, రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. ఈ మొత్తం 788 మంది ఎంపీలకు ఎంపీల్యాడ్స్ కింద ఒక్కొక్కరికి ఏటా రూ. 5 కోట్ల చొప్పున ఇస్తారు. రెండేళ్లకు గానూ ఈ మొత్తం దాదాపు రూ. 7,880 కోట్లు అవుతుంది. అలాగే, ఎంపీల వేతనాల్లో కోత ద్వారా ఏటా రూ. 29 కోట్లు కరోనాపై పోరాటానికి జమ అవుతాయి. వేతనాల్లో కోత ద్వారా కోల్పోయే మొత్తం ఎంపీలకు పెద్ద సమస్య కాబోదు కానీ, ఎంపీల్యాడ్స్‌ను కోల్పోవడంతో నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఎంపీల వేతనాల్లో కోత నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. అయితే, ఎంపీల్యాడ్స్‌పై నిర్ణయానికి సంబంధించి పునరాలోచించాలని కోరింది. -
కరోనా సాయంగా 50 లక్షల ఎంపీ ల్యాడ్స్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకుగాను ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా సీఎంవోకు సమాచారం అందజేశారు. కరోనాను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటే ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచాలని, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులోకి తీసుకురావాలని ట్వీట్ చేశారు. తాను ఇస్తున్న ఎంపీ ల్యాడ్స్‌ను ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు మాస్కులు, శానిటైజర్ల కొనుగోలుకు ఉపయోగించాలని కోరారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వం మరింత దూకుడుతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజలంతా సామాజిక దూరాన్ని విధిగా పాటించి కరోనాను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. వారిని ఇళ్లకు చేర్చండి కాశీ యాత్రకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన తెలుగు ప్రజలను వారి స్వస్థలాలకు చేర్చాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. కాశీలో దాదాపు వెయ్యి మంది తెలుగు ప్రజలు చిక్కుకున్నారని, వారిలో తన నియోజకవర్గ పరిధిలోని బి.పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్ గ్రామానికి చెందిన 35 మంది ఉన్నారని తెలిపారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అక్కడి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు కోమటిరెడ్డి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
ఆ 25 మంది.. ఒక్క రూపాయీ ముట్టుకోలేదు!!
బీహార్ రాష్ట్రం నుంచి లోక్‌సభకు మొత్తం 40 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్లందరికీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉంటాయి. అయితే.. ఆ ఎంపీల్లో 25 మంది మాత్రం గడిచిన ఏడాది కాలంగా ఒక్క రూపాయి కూడా ఎంపీ లాడ్స్‌లో నుంచి ఖర్చుపెట్టలేదు. వాళ్లలో బీజేపీ ఎంపీలు 16 మంది కాగా ఆరుగురు ఎల్జేపీ, ఆర్‌ఎల్‌ఎస్పీల వాళ్లు. ఇద్దరు ఆర్జేడీ సభ్యులు, ఒక జేడీయూ ఎంపీ కూడా తమ కోటా నిధుల్లోంచి ఒక్క పైసాకూడా ఖర్చుచేయలేదని ఓ అధికారి తెలిపారు. అయితే, ఇటీవలే ఆర్జేడీ నుంచి ఉద్వాసనకు గురైన ఎంపీ రాజీవ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, ఎల్జేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ మాత్రం నిధులు ఖర్చుపెట్టిన వాళ్లలో అగ్రస్థానంలో ఉన్నారు. ముగ్గురు కేంద్ర మంత్రులు రాం కృపాల్ యాదవ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, రాధామోహన్ సింగ్ కూడా తమ ఎంపీలాడ్స్ నిధులు ఏమీ ఖర్చుపెట్టలేదు. ఈ పథకం కింద ప్రతి ఎంపీ ఏడాదికి రూ. 5 కోట్ల అభివృద్ధి పనులను తమ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు సూచించవచ్చు. -
ఆ ఆరుగురి ఎంపీ ల్యాడ్స్ సొంత రాష్ట్రాల్లోనే!
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం డ్రాలో తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీలు ఆంధ్రకు, ఏపీకి చెందిన ఇద్దరు ఎంపీలు తెలంగాణకు మారిన నేపథ్యంలో వారు తమ ఎంపీ ల్యాడ్స్ నిధులను తమ సొంత రాష్ట్రాల్లో వినియోగించుకునే వెసులుబాటు కలిగింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ నేతృత్వంలోని ఓ కమిటీ ఈ మేరకు తగిన సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను కేంద్రం ఆమోదించి కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీచేయనుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ ఎంపీలు డాక్టర్ కె.కేశవరావు, రేణుకాచౌదరి, టి.దేవేందర్ గౌడ్, ఎం.ఎ.ఖాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేశ్, డాక్టర్ కె.వి.పి.రామచంద్రరావు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
ఎంపీ ల్యాడ్స్ నిధులు వచ్చేదెన్నడో!
సాక్షి, మంచిర్యాల : ఎంపీలకు కూడా నిధుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ప్రమాణ స్వీకారం చేసి నాలుగు నెలలు దాటుతు న్నా నిధుల విషయంలో స్పష్టత లేదు. దీంతో సంక్షేమ అవసరాలకు నిధుల కేటాయింపు కష్టంగా మారింది. ఈ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. నియోజకవర్గ ప్రతినిధులుగా ప్రజాసమస్యలు తీర్చేందుకు, అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎంపీకి ఏటా రూ.5 కోట్లు విడుదల చేస్తుంది. భారత ప్రభుత్వ గ ణాంక, ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీం(ఎంపీ లాడ్స్) పేరుతో ఆ కేటాయింపులు పార్లమెంటు సభ్యులకు ఇస్తుంది. అకాల వర్షాలతో కొట్టుకు పోయిన రహదారులకు, స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం, మురికినీటి కాల్వల నిర్మాణం-మరమ్మతులు, విద్య అవసరాలు, వైద్య సదుపాయాలు, పీహెచ్‌సీల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తారు. నిధులు కేటాయించకపోవడంతో కష్టంగా మారింది. నిధులు విడుదల చేయాలి.. - జి.నగేష్, ఎంపీ, ఆదిలాబాద్ ఎంపీ ల్యాడ్స్ నిధుల విడుదల జాప్యంతో ప్రజలకు వసతులు కల్పించలేక పోతున్నాం. ఇటీవల వర్షానికి రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా రోడ్లను చూసినప్పటికీ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాను. వెంటనే ఎంపీ ల్యాడ్స్ నిధులు విడుదల చేయాలి.