బీహార్ రాష్ట్రం నుంచి లోక్సభకు మొత్తం 40 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్లందరికీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉంటాయి. అయితే.. ఆ ఎంపీల్లో 25 మంది మాత్రం గడిచిన ఏడాది కాలంగా ఒక్క రూపాయి కూడా ఎంపీ లాడ్స్లో నుంచి ఖర్చుపెట్టలేదు. వాళ్లలో బీజేపీ ఎంపీలు 16 మంది కాగా ఆరుగురు ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీల వాళ్లు. ఇద్దరు ఆర్జేడీ సభ్యులు, ఒక జేడీయూ ఎంపీ కూడా తమ కోటా నిధుల్లోంచి ఒక్క పైసాకూడా ఖర్చుచేయలేదని ఓ అధికారి తెలిపారు.
అయితే, ఇటీవలే ఆర్జేడీ నుంచి ఉద్వాసనకు గురైన ఎంపీ రాజీవ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, ఎల్జేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ మాత్రం నిధులు ఖర్చుపెట్టిన వాళ్లలో అగ్రస్థానంలో ఉన్నారు. ముగ్గురు కేంద్ర మంత్రులు రాం కృపాల్ యాదవ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, రాధామోహన్ సింగ్ కూడా తమ ఎంపీలాడ్స్ నిధులు ఏమీ ఖర్చుపెట్టలేదు. ఈ పథకం కింద ప్రతి ఎంపీ ఏడాదికి రూ. 5 కోట్ల అభివృద్ధి పనులను తమ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్కు సూచించవచ్చు.
ఆ 25 మంది.. ఒక్క రూపాయీ ముట్టుకోలేదు!!
Published Sat, May 16 2015 2:34 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM
Advertisement