సాక్షి, మంచిర్యాల : ఎంపీలకు కూడా నిధుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ప్రమాణ స్వీకారం చేసి నాలుగు నెలలు దాటుతు న్నా నిధుల విషయంలో స్పష్టత లేదు. దీంతో సంక్షేమ అవసరాలకు నిధుల కేటాయింపు కష్టంగా మారింది. ఈ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. నియోజకవర్గ ప్రతినిధులుగా ప్రజాసమస్యలు తీర్చేందుకు, అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎంపీకి ఏటా రూ.5 కోట్లు విడుదల చేస్తుంది.
భారత ప్రభుత్వ గ ణాంక, ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీం(ఎంపీ లాడ్స్) పేరుతో ఆ కేటాయింపులు పార్లమెంటు సభ్యులకు ఇస్తుంది. అకాల వర్షాలతో కొట్టుకు పోయిన రహదారులకు, స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం, మురికినీటి కాల్వల నిర్మాణం-మరమ్మతులు, విద్య అవసరాలు, వైద్య సదుపాయాలు, పీహెచ్‌సీల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తారు. నిధులు కేటాయించకపోవడంతో కష్టంగా మారింది.
నిధులు విడుదల చేయాలి.. - జి.నగేష్, ఎంపీ, ఆదిలాబాద్
ఎంపీ ల్యాడ్స్ నిధుల విడుదల జాప్యంతో ప్రజలకు వసతులు కల్పించలేక పోతున్నాం. ఇటీవల వర్షానికి రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా రోడ్లను చూసినప్పటికీ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాను. వెంటనే ఎంపీ ల్యాడ్స్ నిధులు విడుదల చేయాలి.
ఎంపీ ల్యాడ్స్ నిధులు వచ్చేదెన్నడో!
Published Fri, Sep 26 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM
Advertisement