Department of Planning
-
రాష్ర్ట ప్రణాళిక మండలి ఏర్పాటు
* సీఎం అధ్యక్షతన ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ * సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వానికి సలహాలివ్వాలని ప్రణాళిక శాఖ మార్గదర్శకాలు * ప్రణాళిక మండలికి అన్ని శాఖలు సహకరించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ‘తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి’ ఏర్పాటైంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మండలికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య విడుదల చేశారు. ప్రణాళిక యంత్రాంగాన్ని పటిష్టపరిచే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకుని సమగ్రాభివృద్ధి సాధించడానికి వీలుగా అర్హులైన మేధావుల నుంచి సూచనలను స్వీకరించి, ప్రభుత్వానికి ప్రణాళిక మండలి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఎక్స్అఫీషియో వైస్-చైర్మన్‌గా ఆర్థికమంత్రి వ్యవహరిస్తారు. మండలి ఉపాధ్యక్షున్ని ప్రభుత్వం నియమిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ పదవిలో టీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. సభ్యులుగా సీఎస్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శితోపాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు. సభ్య కార్యదర్శిగా ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి వ్యవహరిస్తారు. ప్రణాళిక మండలికి మార్గదర్శకాలు - అభివృద్ధి కోసం సంస్థల ఏర్పాటుకు పాటించాల్సిన విధానాలు సూచించడం. - ఆర్థికాభివృద్ధి పర్యవేక్షణ, మదింపు. వివి ద శాఖలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల మెరుగుకు సలహాలివ్వడం. - రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఏ అంశంపైనైనా సలహాలు అందజేయాలి. - వార్షిక, పంచవర్ష ప్రణాళికల రూపకల్పనలో సలహాలు ఇవ్వాలి. - మండలి కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని ప్రణాళిక శాఖ అందించాలి. - మండలికి అడిగిన గణాంకాలను ప్రభు త్వ శాఖలన్నీ వెంటనే అందించాలి. రాష్ట్ర, కేంద్రస్థాయిలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మండలి దృష్టికి తీసుకురావాలి. -
ఎంపీ ల్యాడ్స్ నిధులు వచ్చేదెన్నడో!
సాక్షి, మంచిర్యాల : ఎంపీలకు కూడా నిధుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ప్రమాణ స్వీకారం చేసి నాలుగు నెలలు దాటుతు న్నా నిధుల విషయంలో స్పష్టత లేదు. దీంతో సంక్షేమ అవసరాలకు నిధుల కేటాయింపు కష్టంగా మారింది. ఈ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. నియోజకవర్గ ప్రతినిధులుగా ప్రజాసమస్యలు తీర్చేందుకు, అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎంపీకి ఏటా రూ.5 కోట్లు విడుదల చేస్తుంది. భారత ప్రభుత్వ గ ణాంక, ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీం(ఎంపీ లాడ్స్) పేరుతో ఆ కేటాయింపులు పార్లమెంటు సభ్యులకు ఇస్తుంది. అకాల వర్షాలతో కొట్టుకు పోయిన రహదారులకు, స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం, మురికినీటి కాల్వల నిర్మాణం-మరమ్మతులు, విద్య అవసరాలు, వైద్య సదుపాయాలు, పీహెచ్‌సీల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తారు. నిధులు కేటాయించకపోవడంతో కష్టంగా మారింది. నిధులు విడుదల చేయాలి.. - జి.నగేష్, ఎంపీ, ఆదిలాబాద్ ఎంపీ ల్యాడ్స్ నిధుల విడుదల జాప్యంతో ప్రజలకు వసతులు కల్పించలేక పోతున్నాం. ఇటీవల వర్షానికి రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా రోడ్లను చూసినప్పటికీ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాను. వెంటనే ఎంపీ ల్యాడ్స్ నిధులు విడుదల చేయాలి.