విభజన హామీల అమలుపై ఏపీ ఎంపీల నిరసనలతో గురువారం రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కేంద్ర మంత్రులకు సమిష్టి బాధ్యత ఉంటుందని, కేబినెట్‌లో బడ్జెట్‌కు ఆమోదం తెలిపి సభలో విభేదించడం రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశారు.