ఏపీ ఇబ్బందుల్లో ఉంది.. ఆదుకోవాలి: మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. మంగళవారం లోక్ సభలో ఏపీకి ఎమ్మెల్సీ స్ధానాలు పెంచే విషయంలో తెచ్చిన ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ కు కచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని కోరారు. హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. పోలవరానికి కేవలం వందకోట్లు మాత్రమే కేటాయించారని మిథున్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.