అపాయింటెడ్ డేట్ ప్రకటించవద్దు: యనమల
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన 'అపాయింటెడ్ డేట్'ను తొందరపడి ప్రకటించవద్దని కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ విజ్క్షప్తి చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన 'అపాయింటెడ్ డేట్'ను తొందరపడి ప్రకటించవద్దని కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ నేతలు విజ్క్షప్తి చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు రాజ్యాంగ బద్దత లేదనే అంశంపై సుప్రీంకోర్టులో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్నో పిటిషన్లు ఉన్నాయి. బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని పలువురు న్యాయశాఖ నిపుణులు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. బిల్లుపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చేదాకా కేంద్ర ప్రభుత్వం వేచి ఉండాలి అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ఱుడు ఓ ప్రకటనలో తెలిపారు.
పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందిన బిల్లుకు రాజ్యాంగ బద్దత ఉందా లేదా అనే అంశంపై ధృవీకరించాల్సిన అధికారం సుప్రీంకోర్టుకే ఉంది అని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయం వచ్చేదాకా అపాయింటెడ్ డేట్ ను ప్రకటించకూడదు అని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.