సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న యూపీఏ హామీని ప్రస్తుత ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశించానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. బీజేపీ నేతలతో సంప్రదించిన అనంతరం ఏపీకి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఏపీ విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ భారత ప్రధానిగా 2014లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చ జరుగుతున్నదని అన్నారు.
ప్రధాని హోదాలో ఏపీకి ప్రత్యేక హోదాను నిండు సభలో తాను హామీ ఇచ్చానని చెప్పారు. అప్పటి విపక్ష నేత అరుణ్ జైట్లీ సహా పలువురు సీనియర్ బీజేపీ నేతలతో చర్చించిన అనంతరం తాను ప్రత్యేక హోదా హామీ ఇచ్చానని అన్నారు. సభలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment