సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునరవ్యవస్థీకరణ చట్టం-2014లోని అంశాల అమలు స్థితిగతులపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలోని పార్లమెంటరీ హోంశాఖ స్టాండింగ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల విభజన, ఆర్టీసీ ఆస్తుల పంపకం, రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాల గురించి కమిటీ చర్చించనుంది. ఈ సందర్బంగా విభజన చట్టం అమలు నివేదికను ఏపీ ప్రభుత్వం కమిటీకి అందించింది. విభజన అనంతరం కేంద్రం ఇచ్చిన నిధులకు సంబధించిన మరో నివేదికను సమర్పించింది.
రాష్ట్రంలో ఏర్పడిన రెవెన్యూ లోటుకు కేంద్రం 3,979 కోట్ల నిధులు ఇచ్చినట్లు వీటికి సంబంధించిన వినియోగ పత్రాలు(యూసీలు) ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం కమిటీతో పేర్కొంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టిన 6,727 కోట్లకు యూసీలు అవసరం లేదని కమిటీకి సూచించింది. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన 1,632 కోట్లకు యూసీలు ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. విజయవాడ- గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్దికి కేంద్రం మంజూరు చేసిన వెయ్యి కోట్లకు గాను 229 కోట్లకు యూసీలు ఇచ్చినట్టు తెలిపింది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ది కోసం కేంద్రం ఇచ్చిన 1,050 కోట్లకు గాను 946 కోట్లకు యూసీలు ఇచ్చినట్టు ఏపీ ప్రభుత్వం కమిటీకి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment