ప్రత్యేక ప్యాకేజ్‌ను చంద్రబాబు స్వాగతించారని రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పష్టం చేశారు. ప్యాకేజ్‌ను స్వాగతిస్తూ మహానాడులో, శాసనసభలో చంద్రబాబు చేసిన తీర్మానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. హోదా కింద వచ్చేవన్నీ ప్యాకేజ్ రూపాంలో వస్తాయని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారన్నారు. ఏపీ విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జీవీఎల్ టీడీపీ వైఖరిని దుయ్యబట్టారు. బీజేపీ వల్లే ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి విదేశీ నిధులు వస్తున్నాయన్నారు. ఏపీపై ప్రధాని ప్రత్యేక దృష్టి పెట్టి సాయం చేస్తున్నారన్నారు.