GVL narasimharao
-
ఆంధ్రలో తెలంగాణ పార్టీలు అవసరమా : GVL
-
ప్రభుత్వ జీవోను సమర్ధించిన GVL
-
ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: జీవీఎల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు కేసీఆర్‌ను ఎందుకు సమర్థించాలని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదు. తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ను ఛీ కొడుతున్నారు. ఏపీ ప్రజలు కేసీఆర్‌ను ఎందుకు సమర్థించాలి? ఏపీ ప్రజలను తిట్టినందుకు కేసీఆర్‌ను సమర్థించాలా? ఆంధ్రా వాళ్లను తరిమి తరిమి కొడతామన్నందుకు సమర్థించాలా? కోవిడ్ సమయంలో ఏపీ ప్రజలు వైద్యం కోసం వస్తే బోర్డర్లో అడ్డుకున్నావ్. ఆంధ్రాకు రావాల్సిన నీటిని సముద్రం పాలు చేస్తున్నావ్. పోలవరం ఎత్తు తగ్గించాలంటూ సుప్రీంను ఎందుకు ఆశ్రయించారు? రాష్ట్రాన్ని ఎడారిలా మార్చాలనుకున్న కేసీఆర్ ఏపీలో ఎలా రాజకీయం చేస్తారు? ఏపీకి రావాల్సిన నిధులను ఇంతవరకు రాకుండా చేశావ్. ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరహింహారావు. ఇదీ చదవండి: కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరికలు -
చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యమైంది : జీవీఎల్ నరసింహారావు
-
ప్రధాని మోదీ విశాఖ పర్యటన విజయవంతమైంది : బీజేపీ ఎంపీ జీవీఎల్
-
ప్రధాని పర్యటనలో రాజకీయ అంశాలు లేవు : బీజేపీ ఎంపీ జీవీఎల్
-
రైల్వే జోన్ పై ఎంపీ జీవీఎల్
-
చంద్రబాబు డైరెక్షన్లో బీజేపీ నేతలు: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు డైరెక్షన్లో బీజేపీ నేతలు నడుస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, చంద్రబాబు పెట్టుబడిదారులైన సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఏపీ బీజేపీలో పని చేస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి: వాడుకుందాం.. వదిలేద్దాం.. అచ్చెన్న వ్యాఖ్యలు వైరల్ ‘‘గతంలో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ లు పవన్ కల్యాణ్ ఒక్కరే చదివేవారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు బీజేపీ నేతలు తోడయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదా, పోలవరానికి నిధులు, కడపకు స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ ఇస్తామని చెప్పే సత్తా సోము వీర్రాజు, జీవీఎల్‌కు ఉందా?. బీజేపీ నేతలు కపట నాటకాలాడుతున్నారని’’ మంత్రి వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. ఏపీ అభివృద్ధికి సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని.. ఇలాంటి వారు ఎంతమంది అడ్డుపడినా సీఎం జగన్ ఏపీని అభివృద్ధి చేసి తీరతారన్నారు. చంద్రబాబు ఇచ్చిన కాగితాలు చదవొద్దని ఏపీ బీజేపీ నేతలకు మంత్రి హితవు పలికారు. చంద్రబాబు డైరెక్షన్లో ఇలాగే కొనసాగితే బీజేపీ మరింత హీనంగా తయారవుతుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. -
‘టీడీపీ, బీజేపీ మధ్య చీకటి తెరలు తొలగిపోయాయి’
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదా అంశానికి తీవ్ర ద్రోహం చేసింది చంద్రబాబేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు. చదవండి: AP: వైద్య, ఆరోగ్య శాఖలో మరో 2,588 పోస్టులు ‘‘నాడు ప్యాకేజీకి ఒప్పుకుని పండగ చేసుకుంది చంద్రబాబు కాదా?. హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే టీడీపీ ఎందుకు చేయలేదు?. ఇప్పుడు హోదా గురించి మాట్లాడేందుకు చంద్రబాబుకు సిగ్గుందా?. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే. లోకేష్ ఏ బ్రాండ్ తాగుతున్నాడో అర్థం కావడం లేదు. ట్విట్టర్ ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడుతున్నాడు. హోదా అంశాన్ని జీవీఎల్ తొలగించేలా చేయడం అశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు కలిసి జీవీఎల్ చేశారా?. హోదా అంశం తొలగింపుతో టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న చీకటి తెరలు తొలగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల జీవీఎల్‌కు ఉన్న బాధ్యత ఏంటని’’ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. -
చంద్రబాబుపై జీవీఎల్ ఫైర్.. చేసిన తప్పులు ఒప్పుకోవాలని డిమాండ్
-
కాంగ్రెస్ సంక్షోభానికి బీజేపీయే కారణం: జీవీఎల్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి బీజేపీయే కారణమని ఎంపీ జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాదరణ పొందడం కారణంగానే కాంగ్రెస్ పతనానికి చేరుకుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పార్టీలో యువ నాయకత్వం తీవ్ర నిరాశతో ఉంది. జ్యోతిరాదిత్య సింథియా పార్టీ వీడి వచ్చారు. సచిన్ పైలట్ దాదాపు వీడే వరకు వచ్చారు. కుటుంబ పార్టీల్లో ఈ తరహా పరిస్థితి ఎప్పటికైనా తప్పదు. ప్రజలు సైతం కేవలం రాజకీయాలు చేసే పార్టీల వైఖరితో విసిగిపోయి ఉన్నారు. చైనా విషయంలో ఆర్మీ స్థైర్యాన్ని దెబ్బతీసేలా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రజలు విస్మరించరు. తెలంగాణలో కాంగ్రెస్ కొంత మేర ఉన్నా, ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణలో సైతం జాతీయస్థాయిలో ఎదుర్కొంటున్న పతనావస్థకు చేరుకుంది. ( జీవీఎల్‌పై అనుచిత వ్యాఖ్యలు, కేసు నమోదు ) అక్కడ బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. కాంగ్రెస్ తరహాలోనే టీడీపీ కూడా అలాగే ఉంది. ఏపీలో టీడీపీ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రజల అభిమానం చూరగొని అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది. టీడీపీకి ఇంకో మైనస్ పాయింట్ అధికారంలో లేకపోవడం, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడమే. ప్రజలు ప్రతిభ, సమర్ధత కోరుకుంటున్నారు. కుటుంబాలకు చెందిన వ్యక్తులను కాదు. తెలుగుదేశం పార్టీని అభిమానించే పత్రికాధినేతలు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీలను కూడా ‘మీ రాహుల్ మీ ఇష్టం ...మీ లోకేష్ మీ ఇష్టం’ అంటారో లేదో చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలహీనపడిందని సామాన్య కార్యకర్తలకు అర్థం అయింది’’ అని అన్నారు. -
దీని వెనకాల ఏ కుట్ర జరిగిందో బయటకు రావాలి
-
లేఖ రాయకపోతే ఎందుకు మౌనం..
సాక్షి, ఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. లేఖ తాను రాయలేదని ఏఎన్ఐకి ఈసీ రమేష్ చెప్పారని తెలిపారు. టీడీపీ నేతలు మాత్రం ఎలక్షన్ కమిషనర్ లేఖ రాశాడని వకాల్తా పుచ్చుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై చాలా అనుమానాలు వస్తున్నాయని, దీని వెనకాల ఏ కుట్ర జరిగిందో బయటకు రావాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడం మంచిది కాదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అందరూ కాపాడుకోవాలని తెలిపారు. ఈసీ రమేష్‌కుమార్ స్పందించటం లేదంటే.. ఏదో తప్పు జరిగిందని అనుమానం వస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో హింస జరిగిందని ఈసీ లేఖ రాశారు. అలా అయితే ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్లు అని జీవీఎల్ సూటిగా ప్రశ్నించారు.(‘నిమ్మగడ్డకు ఈసీగా కొనసాగే అర్హత లేదు’) ఎన్నికల సంఘం రాజ్యాంగ ప్రతిపత్తి గౌరవించి సుప్రీంకోర్టు సైతం వాయిదా విషయంలో జోక్యం చేసుకోలేదని జీవీఎల్ తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థను రాజకీయం కోసం దుర్వినియోగం చేయకూడదాన్నారు. లేఖ రాయకపోతే మౌనంగా ఈసీ రమేష్‌కుమార్ ఎందుకు ఉంటున్నారని జీవీఎల్ ప్రశ్నించారు. మాట్లాడకుండా ఉండడం రాజ్యాంగ సంస్థకు మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జీవీఎల్ నరసింహారావు అన్నారు. -
‘ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’
కాకినాడ: కరోనా వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదివారం నిర్ణయం తీసుకుంది. దీనిపై మాట్లాడిన జీవీఎల్.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం మంచి నిర్ణయమేనన్నారు. ( ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా) కరోనాపై అప్రమత్తత అవసరమని పేర్కొన్న జీవీఎల్.. ఆ వైరస్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలన్నింటినీ ఇప్పటికే చేపట్టిందన్నారు. విదేశాల నుంచి వచ్చే వేలాది మంది టూరిస్టులుకు, ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉండిపోయిన భారతీయులను కూడా కరోనా పరీక్షలు నిర్వహించి తీసుకువస్తున్నామన్నారు. బీజేపీ తరఫున కార్యకర్తలు కూడా కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ సంప్రదాయంలో భాగమైన నమస్కారం పెట్టి సంస్కృతి కొనసాగించాలన్నారు. -
‘రాహుల్ అఫిడవిట్లో పొంతన లేని సమాచారం’
ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గ ఎన్నికల అఫిడవిట్లో పొంతన లేని సమాచారం ఇచ్చారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. రాహుల్ విద్యార్హతలు, పౌరసత్వంపై చాలాకాలంగా వివాదాలున్నాయన్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ తరఫున రిటర్నింగ్ ఆఫీసర్ వివరణ కోరారని, అయితే రాహుల్ గాంధీ తరఫు వివరణ ఇచ్చే న్యాయవాది వద్ద తగిన సమాచారం లేదన్నారు. అందుకే సోమవారం వరకు గడువు కావాలని కోరారని తెలిపారు. జీవీఎల్ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ 94లో డిగ్రీ చేసి, 95లో ఎమ్‌ఫిల్ చేసినట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారు. డిగ్రీ తర్వాత పీజీ చేయకుండా ఎమ్‌ఫిల్ ఎలా చేస్తారో ఆయనకే తెలియాలి. పైగా డెవలప్మెంట్ ఎకనామిక్స్‌లో ఎమ్‌ఫిల్ చేసినట్టు ఓసారి, డెవలప్మెంట్ స్టడీస్‌లో చేసినట్టు మరోసారి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బ్రిటీష్ కంపెనీలో డైరక్టర్‌గా ఉన్నట్టు కూడా ఓసారి పేర్కొన్నారు. ఆ కంపెనీ ఇచ్చిన వివరాల్లో రాహుల్ గాంధీని బ్రిటీష్ పౌరుడిగా వెల్లడించారు. దీనిపై రాహుల్ గాంధీ నుంచి ఎటువంటి వివరణ లేదు. ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ వివరణ అడిగింది. రాహుల్ సరైన వివరణ ఇస్తారా లేక తప్పించుకుని పారిపోతారా చూడాలి. ఇతర దేశ పౌరసత్వం కలిగి ఉంటే భారతదేశ పౌరసత్వం కోల్పోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన భారతదేశంలో ఎన్నికల్లో పోటీచేయడానికి రాహుల్‌కి అర్హత ఉండదు. ఒకవేళ పౌరసత్వం లేకుండా అక్కడి కంపెనీకి తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే అక్కడి చట్టాల ప్రకారం శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని తెలిపారు. -
‘సీఎం రమేష్‌కు అదేం కొత్త కాదు’
సాక్షి, విజయవాడ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై జరిగిన పోలీసులు దాడులు బూటకమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. సీఎం రమేష్ కావాలనే పోలీసులతో తన ఇంటిపై దాడులు జరిపించుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల దినపత్రిక బట్టబయలు చేసిందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా డ్రామాలు ఆడిన సీఎం రమేష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో సానుభూతి కోసమే టీడీపీ నేతలు పోలీసుల దాడులు అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. డ్రామాలు ఆడడం సీఎం రమేష్‌కు, టీడీపీ నేతలకు కొత్తేం కాదన్నారు. సీఎం రమేష్ డ్రామాలపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టడానికి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన టీడీపీకి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. -
రిటైర్మెంట్కు చంద్రబాబు సిద్ధమైపోయారు
-
‘ఏపీకి కియోను తీసుకొచ్చింది ఆయనే!’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. శోభన్‌బాబులా సోకులు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి కియోతో ఎటువంటి సంబంధం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ చొరవతోనే ఏపీకి కియో పరిశ్రమ వచ్చిందని తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ కియోను ఏపీకి తీసుకువచ్చారని వెల్లడించారు. ప్రతి పథకాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలకు హెరిటేజ్ నుంచి డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి రెండు పార్టీలను తీసుకెళ్లలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల ఖర్చుపై నిఘా పెడతామని తెలిపారు. నాలుగున్నరేళ్లు జులాయిలాగా తిరిగిన చంద్రబాబు.. చివరి ఆరు నెలలు డబ్బుతో మేనేజ్ చేయాలని చూస్తున్నారన్నారు. ప్యాకేజీలు ఇచ్చి తన పార్టీలోకి నేతలను తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన మోసం ప్రజలకు అందరికి తెలుసునన్నారు. -
'బతుకులు చెడ' అని కేసీఆర్ ఊరికే అనలా!
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. యూ-టర్న్ సీఎం చంద్రబాబు హైకోర్టు విషయంలో ప్లేటు మార్చారని ట్విటర్లో పేర్కొన్నారు. విభజన చట్టం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆంధ్ర హైకోర్టుకు సహకరిస్తే చంద్రబాబు నీచంగా రాజకీయాలు ఆపాదిస్తున్నారని నిప్పులు చెరిగారు. నిన్నకు నిన్న క్రెడిట్ తమదేనని ఎంపీ కే. రవీంద్ర కుమార్ డబ్బా కొట్టుకున్నారని గుర్తు చేశారు. మీ 'బతుకులు చెడ' అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఊరికే అనలా! అంటూ జీవీఎల్ ఎద్దేవా చేశారు. U-టర్న్ CM చంద్రబాబు @ncbn హైకోర్ట్ విషయంలో ప్లేటు మార్చారు. విభజన చట్ట అమలులో భాగంగ కేంద్రం ప్రత్యేక ఆంధ్ర హైకోర్ట్కుకు సహకరిస్తే నీచంగా రాజకీయం ఆపాదిస్తున్నారు. నిన్నకు నిన్న క్రెడిట్ మాకేనని ఎంపీ కే. రవీంద్ర కుమార్ డబ్బా కొట్టుకున్నారు. మీ "బతుకులు చెడ" అని KCR ఊరికే అనలా! pic.twitter.com/aag4QyRWDi — GVL Narasimha Rao (@GVLNRAO) December 28, 2018 -
‘రాఫెల్‌పై రాహుల్ క్షమాపణలు చెప్పాలి’
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చి చెప్పడంతో ఎన్డీయే సర్కారుకు ఊరట లభించింది. ఈ డీల్‌కు వ్యతిరేకంగా దాఖలైన 36 పిటిషన్లను కూడా కోర్టు తోసిపుచ్చింది. దీంతో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో మీడియాతో మట్లాడతూ... కేంద్ర ప్రభుత్వంపై, రక్షణ వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే 2002లో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. (రాఫెల్ కేసులో మోదీ సర్కార్‌కు ఊరట) కానీ, 2015 వరకు ఆ కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగలేదని తెలిపారు. అప్పటికే శత్రుదేశాలు పలు యుద్ద విమానాలు కొనుగోలు చేసి మనకన్నా పటిష్ట స్థితిలో ఉన్నాయనీ, రాఫెల్ డీల్‌ను కాంగ్రెస్ కావాలనే ఆలస్యం చేసిందిని జీవీఎల్ ఆరోపించారు. రాబర్ట్ వాద్రా, ఆయన మిత్రులకు కమీషన్లు రాలేదనే అక్కసుతోనే రాహుల్ కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. యుద్ద విమానాల కొనుగోలును ఆలస్యం చేసి దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా కాంగ్రెస్ వ్యవహరించిందని మండిపడ్డారు. మధ్యవర్తులు లేకుండా విమనాలు కొనుగోలు చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో చేరినందుకు చంద్రబాబు నాయుడిని తెలంగాణ ప్రజలు గట్టి దెబ్బకొట్టారనీ, ఆయనకు మరోసారి దెబ్బ పడడం ఖాయమని జీవీఎల్ జోస్యం చెప్పారు. రాఫెల్ డీల్‌పై చర్చించేందుకు బీజీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్లో స్పష్టం చేశారని జీవీఎల్ వెల్లడించారు. -
టీడీపీ సర్కారు అవినీతిలో కూరుకుపోయింది..
-
‘రేవంత్, రమేష్‌లు చంద్రబాబు బినామీలు’
సాక్షి, న్యూఢిల్లీ : మంత్రి లోకేష్ వ్యాఖ్యలతో సీఎం రమేష్ చంద్రబాబు బినామీ అని తేలిపోయిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి లోకేష్ బినామీ ఐటీ కంపెనీలు పెట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను, భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రాధమిక ఆధారాలు లేకుండా ఐటీ శాఖ సోదాలు జరపదు, సమాచారం ఉంది కనుకనే దాడులు నిర్వహిస్తుందన్నారు. ఐటీ అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా కక్ష సాధింపు చర్యలు అంటే ఎలా అని ప్రశ్నించారు. తప్పు చేయని వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇతర పార్టీలపై ఐటీ సోదాలు జరిగితే భేష్ అన్న టీడీపీ నేతలు తమపై జరిగితే మాత్రం భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, సీఎం రమేష్‌లు చంద్రబాబు బినామీలని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు టీడీపీ ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారని, అదంతా అవినీతి సొమ్మేనని విమర్శించారు. దొంగ దీక్షలకు ఎవరూ భయపడరు ఉక్కు కర్మాగారం కోసం సీఎం రమేష్ చేసే దొంగ దీక్షలకు ఎవరూ భయపడరని జీవీఎల్ అన్నారు. దీక్ష చేసినందుకే కక్ష కట్టి కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోదనడంలో వాస్తవం లేదన్నారు. అక్రమార్జనపై వచ్చిన ప్రశ్నలకు సీఎం రమేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్టాంట్‌పై ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌తో చర్చలు జరిపామని, ఆయన సానుకూలంగా స్పందించారని జీవీఎల్ చెప్పారు. మేకాన్ సంస్థ నివేదిక అనంతరం నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ( చదవండి : సీఎం రమేశ్ ఇంట్లో ఐటీ సోదాలు) -
ఆ లేఖ చంద్రబాబుకు చెంప పెట్టులాంటిది : జీవీఎల్
సాక్షి, న్యూఢిల్లీ : తమ ప్రభుత్వంలో ఉన్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. తాను పదవిలో ఉన్నప్పుడు సాధించిన అంశాల గురించి వివరిస్తూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ రాసిన లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెంప పెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. 2016-17 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 9700 కోట్ల రూపాయలు మంజూరు చేసిన కేంద్రం.. 2017-18లో 17, 500 కోట్ల రూపాయలు విడుదల చేసిందని జీవిఎల్ తెలిపారు. అదే విధంగా ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లో 10, 372 కోట్ల రూపాయల నిధులు కేటాయించారన్నారు. ఇవన్నీ బీజేపీతో టీడీపీ నుంచి విడిపోయాక విడుదలైన నిధులేనని.. అయినప్పటికీ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతుందంటూ అసత్య ప్రచారం చేస్తూ టీడీపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా అలా వ్యవహరించినట్లైతే రాష్ట్రానికి ఇన్ని నిధులు వచ్చేవా అని జీవీఎల్ ప్రశ్నించారు. రాద్దాంతం చేయకండి కేంద్ర నిధుల విడుదలపై వివరాలు కోరుతూ చంద్రబాబుకు లేఖ రాశానన్న జీవీఎల్ వెనుకబడిన జిల్లాల విషయంలో 350 కోట్ల రూపాయలపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. యూసీలు ఇచ్చామని చెప్తున్నారు... వాటితో పాటు యుటిలైజేషన్ ఎక్స్ పెండిచర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలా చేయకుండా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఓ డప్పు కొట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడికి గ్లోబల్ అగ్రికల్చర్ పాలసీ లీడర్ షిప్ అవార్డు వచ్చిందని టీడీపీ నాయకులు డప్పు కొట్టుకుంటున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. అదేదో ప్రపంచంలో ఈయనకి ఒక్కడికే వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికే కేసీఆర్ సహా చాలా మంది ముఖ్యమంత్రులకు ఈ అవార్డు వచ్చిందని.. అయితే ప్రపంచంలో ఎవరికీ ఈ అవార్డు రాలేదన్నట్టుగా ఊదరగొడతారని ఎద్దేవా చేశారు. -
న్యాయం నుంచి ఎవరూ తప్పించుకోలేరు : జీవీఎల్
సాక్షి, ఢిల్లీ : తెలుగుదేశం నేతలు మరోసారి డ్రామాలకు తెరతీశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 2010లో చేసిన దొంగపోరాటంపై కేసుపెట్టింది కాంగ్రెస్ పార్టీనే తప్ప బీజేపీ కాదన్నారు. గతంలో 22 నోటీసులు ఇచ్చినా చంద్రబాబు స్పందించకపోవడంతోనే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారన్నారు. అది ఒక న్యాయ ప్రక్రియ మాతమే తప్ప అందులో రాజకీయాలు లేవన్నారు. నోటీసులు చూసి చంద్రబాబు భయపడే రకం కాదని తెలిపారు. ఇవన్నీ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే అని ఎద్దేవా చేశారు. కోర్టు నోటీసులను కూడా పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీని వాటేసుకుని డ్యూయెట్లు పాడుకుంటున్నారని, మరి ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. అప్పుడు మహారాష్ట్ర పోలీస్‌లు దురుసుగా ప్రవర్తించారని, అదంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. కేసులు తనపై రాకుండా అన్ని తంత్రాలు చంద్రబాబు చేస్తూనే ఉంటారన్నారు. చంద్రబాబుపై కక్ష సాధింపు అవసరం బీజేపీకి లేదని జీవీఎల్ అన్నారు. ప్రజలే అతనికి బుద్ధి చెప్తారన్నారు. న్యాయపోరాటం చెయ్యాలి తప్ప, న్యాయవ్యవస్థపై బురద చల్లడం సరికాదని, న్యాయం నుంచి ఎవరు తప్పించుకోలేరని తెలిపారు. ఓటుకి నోటుకు కేసులో బహిరంగంగా పట్టుబడిన బాబు, దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పీడీ అకౌంట్స్ విషయంలో సీబీఐ ఎంక్వైరీ చేస్తే బాబు .. అవినీతి బాగోతం బయటకు వస్తుందని ధ్వజమెత్తారు. సినిమా నటుడు శివాజీకి వేశాలు లేకపోవడం వల్లే ప్యాకేజీ తీసుకొని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నీటిపారుదల ప్రాజెక్ట్‌లపై బాబుకు ఎప్పుడు చిత్త శుద్ధి లేదని, అయన నీటి కోసము పోరాడటం ఏంటని ఎద్దేవా చేశారు. -
టీడీపీ నేతలు మరోసారి డ్రామాలకు తెరతీశారు
-
గుమ్మడికాయ కొట్టారు
ఎవరికి ఎవరూ తక్కువ కాదన్నట్లు నలుగురు రాణులు ఒకేసారి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారట. హిందీ హిట్ ‘క్వీన్’ సౌత్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమన్నా ప్రధాన పాత్రధారిగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెలుగు వెర్షన్ ‘దటీజ్ మహాలక్ష్మి’ రూపొందింది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహారావు, మాస్టర్ సంపత్ కీలక పాత్రలు చేశారు. బాలీవుడ్ స్టార్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే రమేశ్ అరవింద్ దర్శకత్వంలో తమిళ క్వీన్ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో కాజల్, కన్నడ వెర్షన్ ‘బటర్ ఫ్లై’లో పరుల్ యాదవ్ నటించారు. మలయాళంలో మంజిమా మోహన్ నాయికగా ‘జామ్ జామ్’ టైటిల్‌తో రీమేక్ అయింది. -
చంద్రబాబు ప్యాకేజీను స్వాగతించారు
-
రాజ్యసభలో చర్చ.. టీడీపీపై జీవీఎల్ తీవ్ర విమర్శలు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక ప్యాకేజ్‌ను చంద్రబాబు స్వాగతించారని రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పష్టం చేశారు. ప్యాకేజ్‌ను స్వాగతిస్తూ మహానాడులో, శాసనసభలో చంద్రబాబు తీర్మానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కింద వచ్చేవన్నీ ప్యాకేజ్ రూపాంలో వస్తాయని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారన్నారు. ఏపీ విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జీవీఎల్ టీడీపీ వైఖరిని దుయ్యబట్టారు. బీజేపీ వల్లే ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి విదేశీ నిధులు వస్తున్నాయన్నారు. ఏపీపై ప్రధాని ప్రత్యేక దృష్టి పెట్టి సాయం చేస్తున్నారన్నారు. ప్యాకేజ్‌కు మద్దతుగా మద్దతుగా టీడీపీ చేసిన తీర్మానాలను ఆయన సభలో చదివి వినిపించారు. జీవీఎల్ ప్రసంగానికి టీడీపీ ఎంపీలు పలుమార్లు అడ్డుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ రాద్ధాంతం చేస్తోందని జీవీఎల్ మండిపడ్డారు. రూ లక్షా 27వేల కోట్లు ఏపీకి అదనంగా వస్తున్నప్పుడు అన్యాయం జరిగిందని టీడీపీ ఎలా అంటుందని నిలదీశారు. హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ కాదు మల్టీపుల్ టర్న్‌లు తీసుకున్నారన్నారు. మరోవైపు చర్చ సందర్భంగా సీఎం రమేష్‌ను ఎం వెంకయ్య నాయుడు మందలించారు. ఏపీకి నీవు ఒక్కడివే ప్రతినిధి అనుకోవద్దని చురకలంటించారు. కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తున్న చంద్రబాబు కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని జీవీఎల్ విమర్శించారు. మోదీ నిధులతో చంద్రన్న బీమా పథకం అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే చంద్రబాబు సర్కార్ కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఇక హోదా ఉన్న రాష్ట్రాలకూ, లేని రాష్ట్రాలకూ తేడా లేదని చెప్పుకొచ్చారు. కృష్ణపట్నం కొత్త పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రెవిన్యూ లోటు కింద రాష్ట్రానికి కేంద్రం రూ 22,300 కోట్లు కేటాయించిందని చెప్పారు. ప్రత్యేక హోదాకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదన్నారు. -
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి!
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క రూపాయి కూడా బకాయి లేదని, అయినా, రూ. 1935 కోట్లు బకాయిలు ఉన్నాయనడం పచ్చి అబద్ధమని ఆయన మంగళవారం ఢిల్లీలో తెలిపారు. ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ విషయం స్పష్టమైందని చెప్పారు. అయినా పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబును ప్రధాని చేస్తామని ఎవరూ అనలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. చంద్రబాబును ప్రధానిని చేస్తామని ఏ ఒక్క నేతా ప్రతిపాదించలేదని అన్నారు. తుమ్మితే ఊడిపోయే పదవి అని అప్పట్లో ఆయనే ప్రధాని పదవికి దూరంగా ఉండి త్యాగం చేసినట్టు ఫోజులు కొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ధర్మపోరాట సభలు పెట్టడం పట్ల జీవీఎల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర నిధులతో పార్టీ సభలు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తిరుమలను రాజకీయ వ్యవస్థగా మార్చాలని చూస్తున్నారని అన్నారు. అర్చకులను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అర్చకులను తొలగించినందుకు చంద్రబాబు చెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి ఆభరణాల మాయంపై విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు ఏమయ్యాయో వెల్లడించాలని జీవీఎల్ నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ధర్మ పోరాటం కాదు.. సీట్ల ఆరాటం: జీవీఎల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన దీక్షలో ధర్మపోరాటం కంటే సీట్లు కావాలన్న ఆరాటమే ఎక్కువగా కనిపించిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు కేవలం సీట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం, మంత్రులు పనిచేయడం మానేసి..గంటల కొద్ది ఉపన్యాసాలు ఇస్తూ కాలం చెల్లిస్తున్నారని విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా వద్దు స్పెషల్ ప్యాకేజీయే కావాలన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కాగ్ రిపోర్ట్ చూస్తే ఏపీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుందన్నారు. పట్టిసీమలో వందల కోట్ల అవినీతి జరిగిందని కాగ్ నివేదించినా..రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రత్యేక సాధికారిక సంస్థ(ఎస్పీవీ) కింద కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా..రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని జీవీఎల్ పేర్కొన్నారు. నిధులు తీసుకోకపోవడానికి సాకులు చెప్తూ..ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్పీవీ కింద వచ్చే నిధులను వినియోగించాలని, వాటిని ఎలా ఖర్చు చేశారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదివరకు ఇచ్చిన నిధులకు వివరాలు ఇవ్వలేనందునే రాష్ట్రానికి రావాల్సిన 350 కోట్లు నిలిపివేశారన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా చేస్తే తామే ప్రభుత్వంపై పోరాటం చేస్తానన్నారు. బీజేపీ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తోందన్నారు. కేంద్రం చేపట్టిన పంట భీమా పథకం రైతులకు చాలా ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. టీడీపీ కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతోందని, చాటు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీకి ఓటు వెయ్యొద్దని బాబు పిలుపునివ్వడం ఆయన భ్రమ అని..ఇక్కడి ప్రజలనే ప్రభావితం చేయనివారు అక్కడేం చేస్తారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కంటే 50 శాతం గిట్టుబాటు ధరను అందించేలా చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. -
ఆ తీర్పు రాహుల్‌కు చెంపపెట్టు: జీవీఎల్
సాక్షి, హైదరాబాద్: సీబీఐ మాజీ జడ్జి బీహెచ్ లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి చెంపదెబ్బ లాంటిదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్. నర్సింహారావు విమర్శించారు. లోయాది సహజ మరణమేనని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయతో కలసి నర్సింహారావు గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జడ్జి లోయా మృతి కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, రాహుల్ గాంధీ స్వయంగా రాష్ట్రపతిని కలిశారని నర్సింహారావు గుర్తుచేశారు. దీనిపై దాఖలైన పిల్‌ను కొట్టివేస్తూ ఇది రాజకీయ పన్నాగం అని కోర్టు వ్యాఖ్యానించిందన్నారు. రాజకీయ, వ్యక్తిగత వైరాలు బయట చూసుకోవాలని, కోర్టులో కాదంటూ స్పష్టం చేసిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు బీజేపీ వ్యతిరేకులకు చెంపపెట్టు వంటిదన్నారు. దేశాన్ని భ్రష్టు పట్టించేలా, అప్రతిష్టకు గురిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని, ఇకనైనా ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. దత్తాత్రేయ మాట్లాడుతూ జడ్జి లోయాది సహజ మరణమేనని కుటుంబ సభ్యులు చెప్పినా శవ రాజకీయాలు చేయడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించారని ఆరోపించారు. -
ఏపీలో టీడీపీ గెలవదు: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాపై ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటమి భయంతో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి గెలిచే శక్తిలేదని అందుకే ఏమీ చేయలేని పరిస్థితిలో కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తోందని ఆయన శుక్రవారమిక్కడ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా ఉండికూడా 29సార్లు ఢిల్లీ వెళ్లి ఒక్క పని కూడా చేయించుకోలేని అసమర్థ వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. టీడీపీ వైదొలగడం తమకొక మంచి అవకాశం అని, తమ వ్యూహాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. ఇన్ని రోజులు కేంద్రంలో ఉండికూడా రాష్ట్రానికి ఏం చేయలేని చేతకాని ముఖ్యమంత్రి చంద్రబాబు అని, త్వరలోని ఆయన కుట్రలు, మోసాలు, అవినీతి బయట పెడతామని జీవీఎల్ హెచ్చరించారు. ఏపీలో టీడీపీని ఎదుర్కునే శక్తి బీజేపీకి ఉందని, రాష్ట్రంలో గెలవలేనివారు ఢిల్లీలో ఏం చేయగలరని ఆయన సూటిగా ప్రశ్నించారు. తమ చేతగాని తనాన్ని బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, నాలుగేళ్లల్లో రాష్ట్రాన్ని అవినీతి మయంగా మార్చారని దుయ్యబట్టారు. -
కేంద్రంపై అనవసర ఆరోపణలు
-
రాజ్యసభ బరిలో జీవీఎల్
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ 18 మందితో జాబితాను ఆదివారం విడుదల చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి బరిలో దిగుతారని పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిగా జీవీఎల్‌కు మంచి పేరుంది. భారత ప్రధాని అయ్యే సత్తా మోదీకి ఉందని 2011లోనే జీవీఎల్ తెలిపారు. ప్రస్తుతం ఈయన బీజేపీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అటు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు అనిల్ జైన్, సరోజ్ పాండే, అధికార ప్రతినిధి అనిల్ బాలుని తదితరులకు అవకాశం కల్పించింది. మహారాష్ట్ర నుంచి రాణే.. జైన్, జీవీఎల్లు ఉత్తరప్రదేశ్ నుంచి, ఛత్తీస్‌గఢ్ నుంచి పాండే, ఉత్తరాఖండ్ నుంచి బాలుని బరిలో దిగుతారని పేర్కొంది. కిరోడి లాల్ మీనా, మదన్‌లాల్‌లను రాజస్తాన్ నుంచి, కేరళ మాజీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధరన్‌ను మహారాష్ట్ర నుంచి బరిలో దించనుంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్న బలాల కారణంగా 18 మంది సభ్యుల విజయం ఖాయమే. మార్చి 23న ఎన్నికలు జరనుండగా.. నామినేషన్లకు సోమవారమే చివరితేది. మిషన్ 2019 లక్ష్యంతో.. రాణేకు పట్టం గట్టడం ద్వారా మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో బలం పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. రాజస్తాన్‌లో మీనా వర్గానికి ప్రతినిధిగా ఉన్న కిరోడీలాల్కు టికెట్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతనుంచి గట్టెక్కాలని బీజేపీ భావిస్తోంది. -
రాహుల్ గాంధీ సూపర్ వీవీఐపీనా?
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలను కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని చూస్తోందని బీజేపీ మండిపడింది. గణతంత్ర వేడుకల సందర్భంగా రాహుల్ గాంధీకి ఆరో వరుసలో సీటు ఎందుకిచ్చారు, మొదటివరుసలో ఎందుకివ్వలేదంటే కాంగ్రెస్ రచ్చ చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ప్రజాస్వామ్య నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తుంది కానీ, వ్యక్తుల ఆధారంగా కాదని ఆయన అన్నారు. ఇంత చిన్న విషయం 133ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు ఎందుకు అర్థం కావట్లేదని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ హయాంలో ఎమెర్జెన్సీ విధించారని విమర్శించారు. మీరు అధికారంలో ఉన్న సమయంలో మా పార్టీ జాతీయ అధ్యక్షులకు ఎక్కడ స్థానం కల్పించారని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ అర్థం చేసుకోవాలని, రాహుల్ గాంధీ తానో సూపర్ వీవీఐపీ అనుకోవడం సరికాదని హితవు పలికారు. ఈ విషయంలో చేసిన రాద్ధాంతానికి కాంగ్రెస్ పార్టీ తక్షణమే క్షమాపణ చెప్పాలని అన్నారు. -
‘ఒవైసీ, బాబ్రీ కమిటీతో రాహుల్ కుమ్మక్కు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ జఫర్యాబ్ జిలానీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్, ఒవైసీ తదితరులతో... రాహుల్ కుమ్మక్కయ్యారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. రాహుల్ పూర్తిగా బాబర్ భక్తుడని, ఖిల్జీ వారసుడని వ్యాఖ్యానించారు. బాబర్ రామాలయాన్ని ధ్వంసం చేస్తే ఖిల్జీ సోమ్నాధ్ దేవాలయాన్ని ఛిద్రం చేశారని, నెహ్రూ వారసులు దేశంపై దండెత్తిన ఇస్లాం పాలకులకు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో సున్నీ వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపిస్తున్న కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ కేసులో కోర్టు నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే కారణంగా నిర్ణయాన్ని సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం జులై 2019 వరకూ వాయిదా వేయాలని సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరిన నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
అతడు ఔరంగజేబ్..అలాఉద్దిన్ ఖిల్జి
సాక్షి,అహ్మదాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ అక్కడి దేవాలయాలను సందర్శించడంపై బీజేపీ స్పందిస్తూ ఔరంగజేబ్, అలాఉద్దిన్ ఖిల్జిల బాటలో ఆయన పయనిస్తున్నారని వ్యాఖ్యానించింది. తన పాలనలో ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసిన మొగల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబ్ దీన్ని సామాన్యులు వ్యతిరేకిస్తే రెండు మూడు దేవాలయాలు నిర్మిస్తానని హామీ ఇచ్చేవారని, ఖిల్జీ సైతం ఇదే మాదిరి వ్యవహరించేవారని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రస్తుతం రాహుల్ వీరి బాటలో పయనిస్తున్నారని ఆరోపించారు.గుజరాత్లో ఇటీవల తన పర్యటన సందర్భంగా రాహుల్ అక్షర్ధామ్ సహా పలు ఆలయాలను సందర్శించారు. హిందువుల ఓట్లను ఆకట్టుకునేందుకే రాహుల్ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. రాహుల్ ఆలయాలను సందర్శించడం డ్రామా అని ఎన్నికల కోసమే ఆయన ఈ నాటకానికి తెరలేపారని విమర్శించారు. -
‘జీఎస్టీలో కాంగ్రెస్‌కూ భాగస్వామ్యం’
సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్టీపై రాహుల్ గాంధీ విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది. ఈ రెండు నిర్ణయాలపై దేశ ప్రజలు మోదీ సర్కార్‌కు బాసటగా నిలిచారని ఆ పార్టీ ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు అన్నారు. జీఎస్టీని పార్లమెంట్లో సమర్థించిన కాంగ్రెస్ ఇప్పుడు దాని అమలును వ్యతిరేకించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. జీఎస్టీలో అన్ని రకాలుగా భాగస్వామ్యం కలిగిన కాంగ్రెస్ తన బాధ్యత నుంచి తప్పించుకోలేదని హెచ్చరించారు. రాహుల్ మేథావిలా వ్యవహరించాలనుకున్న ప్రతిసారీ అది జోక్‌గా నిలిచిపోతున్నదని చురుకలు వేశారు. యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నోట్ల రద్దును రాజకీయం చేసిన కాంగ్రెస్‌కు ఓటర్లు బుద్ధి చెప్పారని అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అలా చేయదలుచుకుంటే ప్రజలు ఆ పార్టీకి దీటుగా బదులిస్తారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లధనానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని మోదీ సర్కార్ బ్లాక్‌మనీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే అడ్డుకుంటోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని, ప్రజలంతా ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారని చెప్పారు. వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు చేపట్టిన ప్రక్రియకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. నవంబర్ 8న నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ విపక్షాలు బ్లాక్‌డేకు పిలుపు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. -
రాహుల్ అమెరికా పర్యటన వెనక మతలబేంటి?
- కాంగ్రెస్‌ను ప్రశ్నించిన బీజేపీ న్యూఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటన విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తన విమర్శలను మరింత పెంచింది. రాహుల్ గాంధీ అమెరికాలో పాల్గొంటారని చెబుతున్న ‘వీకెండ్ విత్ చార్లీ రోస్’ సదస్సు ఎప్పుడో జూలైలో ముగిసిందని, అలాంటిది ఇప్పుడు ఆ పేరు చెప్పి రాహుల్ అమెరికాలో పర్యటించడం వెనుక ఏం మతలబు ఉందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఈ విషయంలో పొంతనలేని సమాధానాలు చెబుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీ రోజుకో కథ చెబుతోందని అన్నారు. రాహుల్ పేరుతో తమ వద్దకు ఎవరూ రాలేదని, అలాగే తమ వద్దకు రావాల్సిన అతిథుల జాబితాలో కూడా అలాంటి పేరులేదని ఈ వార్షిక సదస్సును నిర్వహించే ఆస్పియన్ ఇన్స్టిట్యూట్ మేనేజర్ తమకు చెప్పారని నరసింహారావు వెల్లడించారు. రాహుల్ వ్యక్తిగతంగా ఎక్కడికైనా వెళ్లవచ్చని, అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పక్కదోవపట్టించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ వస్తే తమ విజయావకాశాలు దెబ్బతింటాయని కాంగ్రెస్ మిత్రపక్షాలు చెప్పడంతో రాహుల్‌ను బలవంతంగా సెలవుపై పంపించారని బీజేపీ ఎద్దేవా చేస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా తిప్పికొట్టింది. ఓటమి భయంతోనే బీజేపీ ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవా దుయ్యబట్టారు.