
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. శోభన్‌బాబులా సోకులు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి కియోతో ఎటువంటి సంబంధం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ చొరవతోనే ఏపీకి కియో పరిశ్రమ వచ్చిందని తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ కియోను ఏపీకి తీసుకువచ్చారని వెల్లడించారు. ప్రతి పథకాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ పథకాలకు హెరిటేజ్ నుంచి డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి రెండు పార్టీలను తీసుకెళ్లలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల ఖర్చుపై నిఘా పెడతామని తెలిపారు. నాలుగున్నరేళ్లు జులాయిలాగా తిరిగిన చంద్రబాబు.. చివరి ఆరు నెలలు డబ్బుతో మేనేజ్ చేయాలని చూస్తున్నారన్నారు. ప్యాకేజీలు ఇచ్చి తన పార్టీలోకి నేతలను తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన మోసం ప్రజలకు అందరికి తెలుసునన్నారు.
Comments
Please login to add a commentAdd a comment