జీవీఎల్ నరసింహారావు
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ 18 మందితో జాబితాను ఆదివారం విడుదల చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి బరిలో దిగుతారని పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిగా జీవీఎల్‌కు మంచి పేరుంది. భారత ప్రధాని అయ్యే సత్తా మోదీకి ఉందని 2011లోనే జీవీఎల్ తెలిపారు. ప్రస్తుతం ఈయన బీజేపీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అటు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు అనిల్ జైన్, సరోజ్ పాండే, అధికార ప్రతినిధి అనిల్ బాలుని తదితరులకు అవకాశం కల్పించింది.
మహారాష్ట్ర నుంచి రాణే.. జైన్, జీవీఎల్‌లు ఉత్తరప్రదేశ్ నుంచి, ఛత్తీస్‌గఢ్ నుంచి పాండే, ఉత్తరాఖండ్ నుంచి బాలుని బరిలో దిగుతారని పేర్కొంది. కిరోడి లాల్ మీనా, మదన్‌లాల్‌లను రాజస్తాన్ నుంచి, కేరళ మాజీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధరన్‌ను మహారాష్ట్ర నుంచి బరిలో దించనుంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్న బలాల కారణంగా 18 మంది సభ్యుల విజయం ఖాయమే. మార్చి 23న ఎన్నికలు జరనుండగా.. నామినేషన్లకు సోమవారమే చివరితేది.
మిషన్ 2019 లక్ష్యంతో..
రాణేకు పట్టం గట్టడం ద్వారా మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో బలం పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. రాజస్తాన్‌లో మీనా వర్గానికి ప్రతినిధిగా ఉన్న కిరోడీలాల్‌కు టికెట్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతనుంచి గట్టెక్కాలని బీజేపీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment