
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్న క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు కేసీఆర్‌ను ఎందుకు సమర్థించాలని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదు. తెలంగాణ ప్రజలే బీఆర్‌ఎస్‌ను ఛీ కొడుతున్నారు. ఏపీ ప్రజలు కేసీఆర్‌ను ఎందుకు సమర్థించాలి? ఏపీ ప్రజలను తిట్టినందుకు కేసీఆర్‌ను సమర్థించాలా? ఆంధ్రా వాళ్లను తరిమి తరిమి కొడతామన్నందుకు సమర్థించాలా? కోవిడ్ సమయంలో ఏపీ ప్రజలు వైద్యం కోసం వస్తే బోర్డర్‌లో అడ్డుకున్నావ్. ఆంధ్రాకు రావాల్సిన నీటిని సముద్రం పాలు చేస్తున్నావ్. పోలవరం ఎత్తు తగ్గించాలంటూ సుప్రీంను ఎందుకు ఆశ్రయించారు? రాష్ట్రాన్ని ఎడారిలా మార్చాలనుకున్న కేసీఆర్ ఏపీలో ఎలా రాజకీయం చేస్తారు? ఏపీకి రావాల్సిన నిధులను ఇంతవరకు రాకుండా చేశావ్. ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరహింహారావు.
ఇదీ చదవండి: కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి చేరికలు
Comments
Please login to add a commentAdd a comment