Rajyasabha Elections
-
హిమాచల్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్
Himachal Pradesh Crisis Live Updates రాజీనామా వెనక్కి తీసుకున్న విక్రమాదిత్య హిమాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఊహించని మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నాయకత్వంపై అసంతృప్తితో బుధవారం ఉదయం రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత, పీడబ్ల్యూడీ మంత్రి విక్రమాదిత్య సింగ్ సాయంత్రానికి కల్లా తన మనసు ర్చుకున్నారు. విక్రమాదిత్య తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు: విక్రమాదిత్య పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది: విక్రమాదిత్య పార్టీ విస్తృత ప్రయోజనాలు, పార్టీ ఐక్యత దృష్ట్యా ఉదయం నేను ఇచ్చిన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించలేదు : విక్రమాదిత్య ఈ తరుణంలో మరింత ఒత్తిడి తీసుకురావాలని నేను కూడా అనుకోవడం లేదు : విక్రమాదిత్య ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేదు: విక్రమాదిత్య హిమాచల్ మాజీ సీఎం వీరభద్ర సింగ్తనయుడే విక్రమాదిత్య తన తండ్రికి కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వలేదని విక్రమాదిత్య ఆరోపణ ఢిల్లీ చర్చలతో.. సాయంత్రానికి చల్లబడ్డ విక్రమాదిత్య #WATCH | Shimla, Himachal Pradesh: Congress MP Rajeev Shukla says, "Our party observers who have come to Shimla are talking to the party MLAs and taking their opinion. First, they met the PCC Chief and also met Vikramaditya Singh. CM Sukhvinder Singh Sukhu has said that he is not… pic.twitter.com/8zIbqWq0vc — ANI (@ANI) February 28, 2024 ఆపరేషన్ లోటస్ జరగనివ్వం: జైరాం రమేశ్ హిమాచల్ ప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై ఏఐసీసీ సమీక్ష ముగ్గురు పరిశీలకులు సిమ్లాకు పరిశీలకులుగా.. డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హుడా, భూపేష్ బఘేల్ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా కాంగ్రెస్ వెనకాడదన్న సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రజాతీర్పునకు ద్రోహం జరగనివ్వం: జైరామ్ రమేష్ వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీయే ముఖ్యం: జైరామ్ రమేష్ ఆపరేషన్ లోటస్‌తో ప్రజా తీర్పుకు భంగం వాటిల్లనివ్వం: జైరామ్ రమేష్ అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటాం: జైరామ్ రమేష్ బీజేపీదే అధికారం: హర్ష్ మహాజన్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ థ్రిల్లింగ్ విక్టరీ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్.. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల ఓట్లతో 34 ఓట్లు సంపాదించుకున్న హర్ష కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి సైతం 34 ఓట్లు డ్రా కావడంతో టాస్‌లో హర్ష్ మహాజన్ విజయం హర్ష్ మహాజన్‌ను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణిస్తున్న రాజకీయ విశ్లేషకులు త్వరలో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హర్ష్ ధీమా కేంద్రం నుంచి కాంగ్రెస్‌ను దింపేసి.. ఒక్కో రాష్ట్రంలో పడగొడుతున్నామన్న హర్ష్ హిమాచల్‌లో.. బీజేపీతో మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్య మరికొన్ని గంటల్లో పరిణామాలు మారిపోవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు మరో 10-20 ఏళ్లపాటు హిమాచల్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోదంటూ జోస్యం బీజేపీపై ప్రియాంక ఫైర్ హిమాచల్ ప్రదేశ్ పరిణామాలపై ప్రియాంక వాద్రా గాంధీ మండిపాటు ధన బలం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో ప్రజల తీర్పును తుంగలోకి తొక్కుతోందంటూ బీజేపీపై ఫైర్ రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు యత్నిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆరోపణ హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తమ ఓటుహక్కు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ, అధికార దుర్వినియోగంతో వారి తీర్పును అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ యత్నిస్తోంది. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ.. 43మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ప్రభుత్వాన్ని సవాల్ చేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతుందనేందుకు ఇదే నిదర్శనం. ఇది పూర్తిగా అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. హిమాచల్ ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ చర్యలను గమనిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రజలను ఆదుకోని కేంద్రం.. ఇప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టాలని చూస్తోంది హిమాచల్ సంక్షోభం.. ఏఐసీసీ ఫోకస్ హిమాచల్ రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ ప్రమాదంలో హిమాచల్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభ పరిణామాలపై ఏఐసీపీ ఫోకస్ ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా భేటీ హిమాచల్‌లో ఏం జరిగింది?.. అలాగే తాజా పరిణామాలపై చర్చ తెరపైకి సీఎంను మారుస్తారనే ప్రచారం రాజీనామా ఊహాగానాలకు కొట్టేసిన సీఎం సుఖ్విందర్సింగ్ సుఖు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని.. ఐదేళ్లు ఉంటుందంటూ వ్యాఖ్య నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం హిమాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభ పరిస్థితుల్ని కాంగ్రెస్ కేంద్రం నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ మేరకు ముగ్గురు పరిశీలకులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాలతో పాటు స్టేట్ ఇన్‌ఛార్జి రాజీవ్ శుక్లా సిమ్లాకు బయల్దేరినట్లు సమాచారం. నేను ఫైటర్ని: వదంతుల్ని కొట్టిపారేసిన హిమాచల్ సీఎం రాజీనామా వదంతుల్ని కొట్టిపారేసిన హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్సింగ్ సుఖు. ‘‘ నేను ఫైటర్‌ను. పోరాడుతూన ఉంటా. ఎవరూ నన్ను రాజీనామా చేయాలని కోరలేదు. నేనెవరికీ రాజీనామా సమర్పించలేదు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరుగుతోంది. కానీ, మా మెజారిటీని మేం నిరూపించుకుంటాం. మేమే గెలుస్తాం. బడ్జెట్ టైంలో ఊహాగానాలతో కాంగ్రెస్‌లో చీలిక తేవాలని బీజేపీ యత్నిస్తోంది. కాంగ్రస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని యత్నిస్తోంది. కానీ, కాంగ్రెస్ సంఘటితంగానే ఉంది అని ప్రకటించారాయన. రాజీనామా యోచనలో సీఎం సుఖ్విందర్ సింగ్ ప్రభుత్వం మైనారిటీలో పడటంతో రాజీనామా యోచనలో సీఎం సుఖ్విందర్సింగ్ కాంగ్రెస్ హైకమాండ్‌కు నిర్ణయం తెలిపిన సీఎం గవర్నర్‌కు ఇంకా రాజీనామా లేఖ పంపని సుఖ్విందర్ హిమాచల్‌కు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్స్ డీకే, భూపిందర్ హుడా కాంగ్రెస్‌లో అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన హైకమాండ్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హుడాలు హిమాచల్‌కు పయనం సీఎంను మార్చాలని ఇప్పటికే పట్టుబడుతున్న ఎమ్మెల్యేలు ఉదయం నుంచి అజ్ఞాతంలోకి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్.. హిమాచల్‌లో రాజకీయ సంక్షోభం రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాటరీలో గెలిచిన బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ మరుసటి రోజు బుధవారమే ఆట షురూ చేసిన బీజేపీ అసెంబ్లీలో బడ్జెట్ బిల్లుపై ఓటింగ్‌కు బీజేపీ పట్టు తిరస్కరించిన స్పీకర్, మూజువాణి ఓటుతోనే పాస్ చేస్తామని స్పష్టం సభ రెండుసార్లు వాయిదా పడ్డ శాంతించని బీజేపీ ఎమ్మెల్యేలు 15 మంది బీజేపీ సభ్యులను సస్పెండ్ చేసిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా వెంటనే గవర్నర్‌ను కలిసిన బీజేపీ శాసనసభాపక్ష నేత జైరాం ఠాకూర్ అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు వినతి ఈ నేపథ్యంలో గవర్నర్‌తో భేటీ అయిన అసెంబ్లీ స్పీకర్ #WATCH | After meeting Governor Shiv Pratap Shukla, Himachal Pradesh LoP Jairam Thakur says, "We have informed the Governor about what happened in the Assembly...In the Assembly, when we demanded division of vote during the financial bill, it was not allowed and the House was… pic.twitter.com/5RymuHzEop — ANI (@ANI) February 28, 2024 మంత్రి రాజీనామా పదవికి రాజీనామా చేసిన మంత్రి విక్రమాదిత్య సింగ్ ఎమ్మెల్యేల అభిప్రాయానికి విలువ లేనందునే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి సీఎంను మార్చాలన్న డిమాండ్‌ను పట్టించుకోనందునే క్రాస్ ఓటింగ చేశామని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరి బాటలోనే మంత్రి విక్రమాదిత్య సింగ్ అజ్ఞాతంలోకి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసి హర్యానాలోని పంచకులకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఇవాళ ఉదయం అజ్ఞాత ప్రదేశానికి తరలింపు రంగంలోకి కాంగ్రెస్ అధిష్టానం సంక్షోభంలో హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వం రంగంలోకి అధిష్టానం ముఖ్య నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బుజ్జగింపు ఎమ్మెల్యేల డిమాండ్ మేరకే సీఎంను మారుస్తారని ప్రచారం తెరపైకి పీసీసీ చీఫ్ ప్రతిభాసింగ్ పేరు మైనార్టీలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సమానంగా 34 ఓట్లు వచ్చి ఫలితం టై అయింది. లాటరీ తీయగా బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి ఓటమి పాలయ్యారు. హిమాచల్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 68 కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 40 మంది సభ్యులు, బీజేపీకి 25, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు. వీరు కూడా బీజేపీకి ఓటు వేయడంతో ఆ పార్టీ బలం ఒక్కసారిగా 34కు పెరిగింది. ఆరుగురు సభ్యులను కోల్పోవడంతో కాంగ్రెస్ బలం 34కు తగ్గి మైనారిటీలో పడిపోయింది. -
రాజ్యసభ ఎన్నికల ఫలితాలు: రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపు
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల ఫలితాల వెల్లడి సమయానికి హైడ్రామా మొదలైంది. నాలుగు రాష్ట్రాలు.. 16 స్థానాల కోసం శుక్రవారం ఓటింగ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటల నుంచే కౌంటింగ్ మొదలు కావాల్సి ఉంది. అయితే.. ఈసీకి ఫిర్యాదులు అందడంతో కౌంటిగ్ ప్రక్రియకాస్త ఆలస్యంగా మొదలైంది. ఇదిలా ఉంటే.. రాజ్యసభ ఎన్నికల రాజస్థాన్ ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ మూడు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. జీ మీడియా అధినేత సుభాష్ చంద్ర ఓటమి పాలయ్యారు. ఇద్దరు బీజేపీ సభ్యులు క్రాసింగ్ ఓటింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. మొత్తం స్థానాల్లో ఏకగ్రీవం 41 స్థానాలు కాగా, ఎన్డీయే 17, యూపీఏ 10, ఇతరులు 14 ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. -
రాజ్యసభ ఎన్నికలు: ఎన్సీపీ నేతలకు షాక్
రాజ్యసభ ఎన్నికల విషయంలో మహా వికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమికి షాక్ తగిలింది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్‌ముఖ్, మంత్రి నవాబ్ మాలిక్‌లకు రాజ్యసభ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాకరించింది ముంబై కోర్టు. ఈ మేరకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఈ ఇద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్(PMLA)యాక్ట్ ప్రకారం వేర్వేరు కేసుల్లో ఈ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి దేశ్‌ముఖ్ ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉండగా.. కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ మాత్రం అనారోగ్యకారణంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం(జూన్ 10న) రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమను అనుమతించాలని, ఒక్కరోజు ఎస్కార్ట్‌తో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూర్ చేయాలని ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. బుధవారం ఈ పిటిషన్‌కు సంబంధించి సుదీర్థ వాదనలు జరిగాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. జైల్లో ఉన్న వాళ్లకు ఓటు వేసే హక్కు ఉండదని వాదించారు ఈడీ తరపు న్యాయవాదులు. దీంతో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్ఎస్ రోకడే.. బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 2017లో మనీల్యాండరింగ్ కేసులో శిక్ష అనుభవించిన ఆనాటి కేబినెట్ మంత్రి చగ్గన్ భుజ్‌బల్.. కోర్టు అనుమతి ద్వారా అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల కోసం ఓటు వేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు దేశ్‌ముఖ్ తరపు న్యాయవాది. అయితే ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలతోనే కోర్టు ఏకీభవించింది. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్.. మంత్రిగా ఉన్న సమయంలో వివిధ పబ్‌ల నుంచి పోలీసుల ద్వారా నాలుగున్నర కోట్ల రూపాయలు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకుగానూ నవంబర్ 2021లో ఆయన అరెస్ట్ అయ్యారు. అలాగే మహారాష్ట్ర మైనార్టీ అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన మనీల్యాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల మేరకు ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసింది. -
ఎగువసభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్
న్యూఢిల్లీ: గుజరాత్, మణిపూర్‌లు మినహా మిగిలిన రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాల్లో ఊహించిన ఫలితాలే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ నాలుగు స్థానాల్లోనూ ఘనవిజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్, బీజేపీ నుంచి జ్యోతిరాధిత్య సింధియా, జార్ఖండ్ నుంచి షిబు సోరెన్ వంటి వారు సులువుగా ఎగువ సభకు ఎన్నికయ్యారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే దేశవ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిపారు. కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ ఒక్క స్థానంలో గెలుపొందింది. జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా(జెఎంఎం) ఒక సీటు సాధించుకుంది. బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది. గుజరాత్లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా, ఇద్దరు బీజేపీ అభ్యర్థుల ఓట్లను తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యం అయ్యింది. విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. మేఘాలయలోని ఒక స్థానాన్ని మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్ అభ్యర్థి వాన్వే రాయ్ ఖర్లుకి విజయం సాధించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూనే శాసనసభ్యులకు థర్మల్ స్క్రీనింగ్ చేయడం, మాస్క్‌లు ధరించడంలాంటి అన్ని జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని తొమ్మిది మంది సభ్యులు రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభంలో పడిన మణిపూర్‌లో ఒకే ఒక్క రాజ్యసభ సీటుని కాంగ్రెస్ అభ్యర్థి టి. మంగిబాబు పై బీజేపీకి చెందిన లీసెంబా సనజోబా గెలుచుకున్నారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన శుక్రవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో ఓటు వేశారు. కాగా ముఖ్యమంత్రి తన ఓటును బీసీ వర్గానికి చెందిన పార్టీ రాజ్యసభ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కేటాయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం జగన్ స్వయంగా దీన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు పోటీలో ఉండగా టీడీపీ తరఫున వర్ల రామయ్య బరిలో ఉన్నారు. (ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం) -
అద్భుతాలు లేవు; అంతా అనుకున్నట్టే..
సాక్షి, బెంగళూరు : అంతా ఊహించినట్టే జరిగింది. రాజ్యసభ ఎన్నికల్లో ఎలాంటి అద్భుతాలు జరగలేదు. రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిశాయి. ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీలోని బలాబలాల ఆధారంగా బీజేపీ రెండు స్థానాలు, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు చెరొక స్థానాన్ని దక్కించుకున్నాయి. శుక్రవారం రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత రాజ్యసభ నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులే బరిలో ఉండడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటిస్తూ డిక్లరేషన్ విడుదల చేసింది. కర్ణాటక విధానసభ ముఖ్య కార్యదర్శి విశాలాక్షి రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఆదేశాలు జారీచేశారు. జేడీఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన హెచ్డీ దేవెగౌడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన జీవితంలో రెండోసారి పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మల్లికార్జున ఖర్గే తొలిసారి రాజ్యసభ ఎన్నికల్లో అడుగుపెట్టనున్నారు. కాగా దేవెగౌడ, ఖర్గేలు గత లోకసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన సంగతి తెలిసింది. చదవండి: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం రాజ్యసభకు ఎంపికవ్వడం విశేషం. ఇక బీజేపీ నుంచి ఈరణ్ణ కడాడి, అశోక్ గస్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెళగావి జిల్లాకు చెందిన 54 ఏళ్ల ఈరణ్ణ, రాయచూరు జిల్లాకు చెందిన 55 ఏళ్ల అశోక్ గస్తీలు రాజ్యసభకు ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. కాగా, వీరిరువురి పేర్లను రాజ్యసభకు ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మరో వ్యక్తి అభ్యర్థిత్వాన్ని ప్రొపొజల్ సంతకం లేని కారణంతో అతని నామినేషన్‌ను తిరస్కరించారు. చదవండి: అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్ -
రాజ్యసభ ఫైట్
-
రాజ్యసభ బరిలోకి మాజీ ప్రధాని దేవెగౌడ
-
టీఆర్ఎస్లో ‘రాజ్యసభ’ లెక్కలు
రాజ్యసభలో 55 స్థానాలకు సంబంధించిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించగా, మార్చి 6వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర కోటాలో కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్), గరికపాటి రామ్మోహన్రావు, (బీజేపీ)తో పాటు ఏపీ కోటాలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షం నేత కె.కేశవరావు రిటైర్ అవుతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో 55 స్థానాలకు సంబంధించిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించగా, మార్చి 6వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర కోటాలో కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్), గరికపాటి రామ్మోహన్రావు (బీజేపీ)తో పాటు ఏపీ కోటాలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షం నేత కె.కేశవరావు రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు వచ్చే నెల 26న పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ విడుదలైంది. అయితే అసెంబ్లీలో సంఖ్యా పరంగా టీఆర్ఎస్కు 104 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. రాజ్యసభలో రాష్ట్రం నుంచి ఏడుగురు సభ్యులుండగా, ఐదుగురు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. వీరిలో డి.శ్రీనివాస్ ప్రస్తుతం టీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వచ్చే నెలలో జరిగే ద్వైవార్షిక ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి మరో ఇద్దరు ఎన్నికయ్యే అవకాశం ఉండటంతో రాజ్యసభలో రాష్ట్ర కోటాకు సంబంధించిన ఏడు స్థానాలు టీఆర్ఎస్కు దక్కనున్నాయి. వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థిత్వం ఎవరికి? శాసనసభలో టీఆర్ఎస్కు సంఖ్యా బలం ఉండటంతో పలువురు ఆశావహులు టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ అభ్య ర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. త్వరలో రాజ్యసభ నుంచి రిటైరవుతున్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు మరోమారు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. అయితే సంఖ్యా పరంగా పార్టీ తరఫున ఇప్పటికే బీసీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులుండటం కేశవరావు అభ్యర్థిత్వానికి ఆటంకంగా కనిపిస్తోంది. అయితే రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాల్లో ఒకదానికి మాజీ ఎంపీలు కల్వకుంట్ల కవిత, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రెండో స్థానాన్ని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ఇస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. 2014లో వరంగల్ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై న కడియం ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నా సామాజిక సమీకరణాలతో రాష్ట్ర మంత్రిమండలిలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో కడియంను రాజ్యసభకు పంపాలని పార్టీ అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇటు ఎస్టీ కోటాలో మాజీ ఎంపీ సీతారాంనాయక్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా
-
రాజ్యసభ ఎన్నికలకు 6న నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 17 రాష్ట్రాలకు సంబంధించి 55 మంది సభ్యుల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయా స్థానాల భర్తీకి ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 2న మహారాష్ట్ర నుంచి ఏడుగురు, ఒడిశా నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు, పశ్చిమ బెంగాల్ నుంచి ఐదుగురు సభ్యుల పదవీ కాలం పూర్తవుతుంది. ఏప్రిల్ 9న ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు, అసోం నుంచి ముగ్గురు, బిహార్ నుంచి ఐదుగురు, ఛత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరు, గుజరాత్ నుంచి నలుగురు, హరియాణా నుంచి ఇద్దరు, హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఒకరు, జార్ఖండ్ నుంచి ఇద్దరు, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు, మణిపూర్ నుంచి ఒకరు, రాజస్తాన్ నుంచి ముగ్గురు సభ్యుల పదవీకాలం పూర్తికానుంది. అలాగే ఏప్రిల్ 12న మేఘాలయ నుంచి ఒక సభ్యుడి పదవీకాలం పూర్తవుతుంది. పదవీ విరమణ పొందుతున్న వారు వీరే.. ఏపీ నుంచి మొత్తం 11 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇందులో ఎంఏ ఖాన్ (కాంగ్రెస్), కె.కేశవరావు (టీఆర్ఎస్), టి.సుబ్బిరామిరెడ్డి (కాంగ్రెస్), తోట సీతారామలక్ష్మి (టీడీపీ) ఏప్రిల్ 9న పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ నుంచి కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్), గరికపాటి మోహన్‌రావు (బీజేపీ) పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 1వ షెడ్యూలు ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని 18 మంది సభ్యుల్లో 11 మందిని ఏపీకి, ఏడుగురిని తెలంగాణకు లాటరీ పద్ధతిలో కేటాయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కె.కేశవరావు, ఎంఏ ఖాన్లు సాంకేతికంగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి వచ్చింది. అలాగే ఏపీకి చెందిన కేవీపీ రామచంద్రరావు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి వచ్చింది. -
చెరో మూడు ఖాయం
సాక్షి,ముంబై: రాబోయే రాజ్యసభ ఎన్నికల కోసం మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2న ముగియనుంది. గడువు పూర్తవనున్న రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈ నెలలో నోటిఫికేషన్ వెలువడనుంది. పదవీకాలం పూర్తవుతున్న వారిలో ఆర్పీఐ అధ్యక్షుడు రామ్‌దాస్ ఆఠవలేతోపాటు సంజయ్ కాకడేలున్నారు. అదేవిధంగా బీజేపీకి చెందిన అమర్ సాబలే, కాంగ్రెస్ నేత హుసేన్ దల్వాయి, శివసేన నేత రాజ్‌కుమార్ దూత్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ç పవార్, అడ్వొకేట్ మాజీద్ మేమన్లు ఉన్నారు. అయితే మహావికాస్ ఆఘాడికి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ముగ్గురు ఎన్నిక కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఏడవ రాజ్యసభ సభ్యుడి ఎన్నిక కోసం గట్టిపోటీ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్థానం కూడా దక్కించుకునేందుకు మహావికాస్ ఆఘాడి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిన సంగతి తెలిసిందే. గతంలో బీజేపీతో కలిసి ఉన్న శివసేన అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి రాష్ట్రంలో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రస్తుతం శాసన సభ్యుల సంఖ్యను పరిశీలిస్తే బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44, ఎమ్మెన్నెస్ 1, సమాజ్‌వాదీ పార్టీ 1, బహుజన్ వికాస్ ఆఘాడి 3, ఇండిపెండెంట్లు కలసి మొంత్తం 288 మంది ఉన్నారు. రాష్ట్రంలో మహావికాస్ ఆఘాడి మిత్రపక్షాలతోపాటు ఇండిపెండెంట్లతో కలిసి 170 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు బీజేపీ వద్ద ఇండిపెండెంట్లు మిత్రపక్షాలతో కలిపి 115 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. ఈ నేపథ్యంలో గడువు ముగియనున్న ఏడుగురు రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఒక్కొక్కరికీ కనీసం 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం కానుంది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలకు ఒక్కో రాజ్యసభ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు బీజేపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అయితే ఏడవ రాజ్యసభ సభ్యుడి కోసం మాత్రం ఇండిపెండెంట్లు కీలకంగా మారనున్నారు. దీంతో ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతివ్వనున్నారనేది వేచి చూడాల్సిందే. -
బీజేపీ ఓడించింది అంబేద్కర్‌ని..
సాక్షి, న్యూఢిల్లీ : 'ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముందు చెప్పినట్లుగానే మా అభ్యర్థిని ఓడించింది. ఎందుకంటే ఆ వ్యక్తి అంబేద్కర్ కాబట్టి.. అది కూడా ఓ దళిత్ కాబట్టి' అని బహుజన్ సమాజ్ పార్టీ నేత సతీష్ చంద్ర మిశ్రా అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 10 స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లతోపాటు బీఎస్పీ సీటును కూడా కొల్లగొట్టి మొత్తం 9 సీట్లు సొంతం చేసుకుంది. మరో సీటును ఎస్పీ దక్కించుకుంది. అయితే, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీకి సాయం చేసి తమ ఓటమికి కారణమైందనే ఆగ్రహంతోనే బీఎస్పీపై బీజేపీ పగ పెంచుకుని ఆ ప్రకారం తీర్చుకుందని మండిపడ్డారు. తమకు ఓటు పడకుండా ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఇందులో కీలక పాత్ర పోషించి డబ్బును ఎగజల్లారని ఆరోపించారు. దళితులపై బీజేపీ పగబట్టిందని, ఉద్దేశ పూర్వకంగా తాము నిలబెట్టిన దళిత అభ్యర్థిని ఓడించినట్లు తెలిపారు. 'సమాజ్‌వాది పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు కోరడంలో వేరే ఉద్దేశం ఏమీ లేదు.. వారి ఓట్లను మాకు బదిలీ చేయడం మాత్రమే. ముందు చెప్పినట్లుగానే బీజేపీ మా అభ్యర్థిని ఓడించింది.. ఎందుకంటే ఆయన అంబేద్కర్ కాబట్టి.. దళిత్ కాబట్టి.. ఈ విషయాన్ని మేం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతాం. దళిత అభ్యర్థిని బీజేపీ ఏ విధంగా ఓడిస్తుందో వివరిస్తాం' అని మిశ్రా చెప్పారు. రాజ్యసభ బరిలో బీఎస్పీ బీమ్ రావ్ అంబేద్కర్‌ను దింపగా తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడిపోయారు. -
రాజ్యసభ మూడు సీట్లూ గులాబీకే
-
ఊపిరి పీల్చుకున్న మాయావతి
సాక్షి, లక్నో : ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఊపిరి పీల్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఏర్పాటుచేసిన విందుకు అంతకు ముందు తీవ్ర ఉత్కంఠ రేపి మాయమైన ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకావడంతో ఆమె పార్టీ రాజ్యసభ సీటును గెలుచుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు నిర్వహించిన కీలక సమావేశానికి గైర్హాజరైన అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ కూడా ఈ విందుకు వచ్చారు. అఖిలేశ్‌తో శివపాల్ యాదవ్ కనిపించడం దాదాపు ఏడాది తర్వాత ఇదే తొలిసారి. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 8 స్థానాలు దక్కించుకుంటామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇక, ఎస్పీకి 1, బీఎస్పీకి 1 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. అయితే, తన రాజ్యసభ సీటును గెలుచుకునేందుకు ఎస్పీకి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి అసెంబ్లీలో 47 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. కానీ, బీఎస్పీకి మాత్రం 19 సీట్లే ఉన్నాయి. అయితే, రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు కనీసం 37మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. ఎస్పీ వద్ద అదనంగా 10 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో వారిని బీఎస్పీకి ఓటువేయాలని ఆదేశించారు. దాంతో బీఎస్పీకి 29మంది ఎమ్మెల్యేల మద్దతు దక్కుతోంది. అయితే, ఇంకా 8మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు, అజిత్ సింగ్ పార్టీ ఒకరు మాయావతికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దీంతో మాయవతికి కూడా రాజ్యసభ సీటు దక్కినట్లు అవుతుంది. అయితే, అనూహ్యంగా బుధవారం ఉదయం జరిగిన కీలక సమావేశంలో ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం, వారంతా అమిత్‌షాతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరగడంతో బీఎస్పీ, ఎస్పీలో ప్రకంపనలు పుట్టాయి. తమ రాజ్యసభ సీటు గల్లంతవుతుందేమో అని మాయావతి గుబులు చెందారు. అయితే, ఆ సమావేశం అయిపోయిన తర్వాత కొన్ని గంటలకు ఆ కనిపించకుండా పోయిన ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు తిరిగి డిన్నర్‌కు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఎస్పీకి బీఎస్పీ సాయం చేసి బీజేపీని ఓడించిన నేపథ్యంలో ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీకి ఎస్పీ సాయం చేస్తోంది. -
ఎస్పీ విందుకు ములాయం హాజరయ్యేనా?
లక్నో : రాజ్యసభ ఎన్నికలకు రెండు రోజుల ముందు సమాజ్‌వాదీ పార్టీ ఏర్పాటు చేసిన విందు ప్రాధాన్యత సంతరించుకుంది. నరేశ్ అగర్వాల్ బీజేపీలో చేరడంతో రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించేందుకు ఎస్పీ నేతలు ఈ విందు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ ఒకవైపు నిలవడంతో విజయాన్ని సాధించాయి. అందుకే పార్టీలోని విభేదాలను పక్కన బెట్టి ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం జరగనున్న ఈ విందులో ములాయం సింగ్ యాదవ్, శివపాల్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్, అఖిలేశ్ యాదవ్‌తో పాటు 200 మంది నాయకులు పాల్గొంటరాని పార్టీ నేతలు ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఖిలేశ్, ములాయం వర్గాల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ విందు ద్వారా రెండు వర్గాల మధ్య సయోధ్య కుదురుతుందని సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విందుకు ములాయం, శివపాల్ హాజరయ్యేది ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యసభ ఎన్నికలపై చర్చించడానికి అఖిలేశ్ కాల్ చేసి ఆహ్వానించినా శివపాల్ ఆ సమావేశానికి హాజరుకాలేదు. శివపాల్ ప్రస్తుతం తన సొంత గ్రామానికి వెళ్లడంతో ఆయన సాయంత్రం విందుకు హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం విందుకు హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. మరోవైపు సీఎం యోగి అదిత్యనాథ్ కూడా రాజ్యసభ ఎన్నికల్లో అనుసారించాల్సిన వ్యుహంపై బీజేపీ మిత్ర పక్షాలతో చర్చలు జరుపనున్నారు. -
24గంటల్లో చక్రం తిప్పిన అమిత్ షా!
సాక్షి, లక్నో : ఉప ఎన్నికల్లో బీజేపీపై పై చేయి సాధించామన్న సంతోషం పూర్తిగా అనుభవించకముందే సమాజ్‌వాది పార్టీకి, బహుజన్ సమాజ్ పార్టీకి కొత్త చిక్కొచ్చి పడింది. తమను ఓటమిపాలు చేసిన ఎస్పీ, బీఎస్పీని వెంటనే దెబ్బకొట్టేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అప్పుడే తెర వెనుకకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు వేదికగా చేసుకొని వారిద్దరిని దెబ్బకు దెబ్బ కొట్టేందుకు అమిత్‌షా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ నిర్వహించిన కీలక సమావేశానికి ఏడుగురు ఎస్పీ నేతలు డుమ్మా కొట్టారు. వీరి గైర్హాజరు వెనుక అమిత్‌షా హస్తం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. నిజంగానే వారు బీజేపీకి అనుకూలంగా మారితే మాత్రం బీఎస్పీ రాజ్యసభ సీటుకు గండిపడటం ఖాయం. దాదాపు 25 ఏళ్లపాటు కత్తులు దూసుకున్న ఎస్పీ, బీఎస్పీలు ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా చేతులు కలిపి బీజేపీకి ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ రెండు స్థానాలను కూడా బీఎస్పీ సాయంతో ఎస్పీ తన ఖాతాలో వేసుకొని సంబరాల్లో మునిగింది. గత నాలుగేళ్లలో బీజేపీకి అతి పెద్ద ఓటమి కూడా ఇదే. కర్ణాటక ఎన్నికల ముందు తమను దెబ్బ కొట్టిన ఎస్పీ, బీఎస్పీపై అమిత్‌షా గుర్రుగా ఉన్నారట. త్వరలో ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో అభ్యర్థికి కనీసం 37మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తమకు 311 సీట్లు ఉన్న నేపథ్యంలో కనీసం 8 సీట్లు గెలుస్తామని బీజేపీ ధీమాతో ఉంది. ఇక ఎస్పీకి 47 సీట్లు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి ఒక ఎంపీ సీటు ఖాయం. అయితే, తమ వద్ద అదనంగా ఉన్న 10మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉప ఎన్నికల్లో సాయం చేసిన బీఎస్పీకి ఇవ్వాలని ఎస్పీ నిర్ణయించుకుంది. బీఎస్పీకి ఇప్పటికే 19మంది ఎమ్మెల్యేలు ఉండగా సమాజ్‌వాది పార్టీ నుంచి 10మంది ఎమ్మెల్యేల మద్దతు, మిగితా మద్దతు అజిత్‌సింగ్ పార్టీ నుంచి బీఎస్పీ తెచ్చుకోవాలని భావిస్తోంది. అయితే, అనూహ్యంగా ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు కీలక సమావేశానికి రాలేదు. వీరిలో అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే, వీరంతా బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోందట. కానీ, సమాజ్ వాది పార్టీ నేతలు మాత్రం ఎన్నికల సమయానికి అంతా సర్దుకుంటుందని, తమ వాళ్లు తమతోనే ఉంటారనే విషయం అప్పుడు తెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ పోటీ లేకుండా రాజ్యసభకు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ మీడియాకు తెలిపారు. ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కే పరిస్థితి ఉండడంతో ఆ మేరకే రెండు పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో నిలిపిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకపోయింది. ఈ ఎన్నికతో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ వరుసగా రెండోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. టీడీపీ అభ్యర్థి కనకమేడల రవీంద్రకుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజ్యసభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ నుంచి గురువారం ధ్రువీకరణపత్రం తీసుకున్నారు. -
రాజ్యసభ బరిలో జీవీఎల్
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ 18 మందితో జాబితాను ఆదివారం విడుదల చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి బరిలో దిగుతారని పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిగా జీవీఎల్‌కు మంచి పేరుంది. భారత ప్రధాని అయ్యే సత్తా మోదీకి ఉందని 2011లోనే జీవీఎల్ తెలిపారు. ప్రస్తుతం ఈయన బీజేపీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అటు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు అనిల్ జైన్, సరోజ్ పాండే, అధికార ప్రతినిధి అనిల్ బాలుని తదితరులకు అవకాశం కల్పించింది. మహారాష్ట్ర నుంచి రాణే.. జైన్, జీవీఎల్లు ఉత్తరప్రదేశ్ నుంచి, ఛత్తీస్‌గఢ్ నుంచి పాండే, ఉత్తరాఖండ్ నుంచి బాలుని బరిలో దిగుతారని పేర్కొంది. కిరోడి లాల్ మీనా, మదన్‌లాల్‌లను రాజస్తాన్ నుంచి, కేరళ మాజీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధరన్‌ను మహారాష్ట్ర నుంచి బరిలో దించనుంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్న బలాల కారణంగా 18 మంది సభ్యుల విజయం ఖాయమే. మార్చి 23న ఎన్నికలు జరనుండగా.. నామినేషన్లకు సోమవారమే చివరితేది. మిషన్ 2019 లక్ష్యంతో.. రాణేకు పట్టం గట్టడం ద్వారా మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో బలం పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. రాజస్తాన్‌లో మీనా వర్గానికి ప్రతినిధిగా ఉన్న కిరోడీలాల్కు టికెట్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతనుంచి గట్టెక్కాలని బీజేపీ భావిస్తోంది. -
‘రాజ్యసభ’రసవత్తరం
-
‘రాజ్యసభ’రసవత్తరం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని మూడు ఖాళీలకు ఎన్నికలు అనివార్యమైతే ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉన్న రాజ్యసభ ఎన్నికల్లో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలం ప్రకారం మూడు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే పడనున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్నిబట్టి రాజ్యసభ ఎన్నికలు ఇప్పటిదాకా ఏకగ్రీవం కావడం సంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్కు అధికారికంగా 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ నుంచి కలిపి 25 మంది దాకా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి ఫిరాయించారు. ఒక్కో అభ్యర్థి గెలవడానికి కనీసం 30 ఓట్లకు తగ్గకుండా రావాలి. సాధారణ పరిస్థితుల్లో టీఆర్ఎస్కు సొంతంగా గెలుచుకున్న ఎమ్మెల్యేలు ఉంటే పోటీ పెద్ద విషయం కాదు. కానీ రాజ్యసభ ఎన్నికల్లో ప్రత్యేకమైన ఎన్నికల ప్రక్రియ ఉండటం, రాజ్యసభ ఎన్నికలకు పోటీ పెడు తున్నామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ఓపెన్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు... రాజ్యసభకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలను నిర్వహిస్తారు. పోలింగ్ సందర్భంగా బూత్ వద్ద ఉన్న పార్టీల పోలింగ్ ఏజెంటుకు ఎమ్మెల్యేలు తాము వేసే ఓటును చూపించాల్సి ఉంటుంది. పార్టీ విప్‌ను ఉల్లంఘించి మరో పార్టీ అభ్యర్థికి వేసే ఓటు చెల్లకపోయే ప్రమాదముంది. పార్టీ విప్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో స్థూలంగా రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై న్యాయ నిపుణులతో కేసీఆర్ లోతుగా చర్చిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తే రాజ్యసభ ఎన్నికల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయనే దానిపై మార్గాలను అన్వేషిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల సంకటం... రాజ్యసభ ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్ విధానం ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎక్కువ ఫిరాయింపులు ఉండటం, కాంగ్రెస్ పోటీలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ విప్‌ను అనివార్యంగా జారీ చేస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేల విషయంలోనూ పలు ఇబ్బందులు ఉన్నాయి. టీడీఎల్పీ విలీనం అయినట్టుగా స్పీకర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అయినా సాంకేతికంగా ఈ విలీనం ప్రకటన చెల్లదని టీడీపీ వాదిస్తోంది. బీఎస్పీ నుంచి పెద్దగా సాంకేతిక ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. కాకుంటే సీపీఐ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఉండే అవకాశముంది. మిగిలిన ఫిరాయింపుదారుల విషయంలో ఇంకా అస్పష్టత నెలకొంది. రాజ్యసభ ఎన్నికల విషయంలో టీడీపీ వైఖరి ఏమిటనేది ఇంకా తేలలేదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినా టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించినా టీడీపీ తీసుకునే నిర్ణయం కూడా రాజ్యసభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీ ఎవరికి మద్దతు ప్రకటిస్తుందో అనే అంశాన్ని బట్టి భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు కూడా ఉంటాయనేది తేలనుంది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని మజ్లిస్ ప్రకటించింది. ఏడుగురు ఎమ్మెల్యేల బలమున్న మజ్లిస్ ఎమ్మెల్యేల మద్దతు టీఆర్ఎస్కు ఈ సమయంలో కీలకంగా ఉపయోగపడనుంది. -
రాజ్యసభలో బీజేపీ హవా!
న్యూఢిల్లీ: వచ్చే నెల 23న 16 రాష్ట్రాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తామని కమలనాథులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా రాజ్యసభలో ప్రతిపక్షాలు కీలక బిల్లుల్ని అడ్డుకోవడాన్ని నిలువరించవచ్చన్నారు. ప్రస్తుతం 58 సీట్లతో రాజ్యసభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ను వెనక్కునెట్టింది. యూపీలో భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఖాళీ అయ్యే 10 సీట్లలో 8 చోట్ల బీజేపీ గెలవనుంది. ప్రస్తుతం యూపీలో బీజేపీకి ఓ రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఉన్నారు. అలాగే రాజస్తాన్‌లో ఖాళీకానున్న మూడు స్థానాలనూ కమలనాథులే దక్కించుకోనున్నారు. అయితే బిహార్‌లో ప్రస్తుతమున్న ఆరుస్థానాల్లో మూడు చోట్ల, గుజరాత్‌లోని నాలుగుస్థానాల్లో రెండుసీట్లను మాత్రమే బీజేపీ నిలుపుకునే అవకాశముంది. ఎన్డీఏ మిత్రపక్షాలతో పాటు కేంద్రానికి అనుకూలంగా ఉన్న అన్నాడీఎంకే, టీఆర్ఎస్, బీజేడీ, వైఎస్సార్సీపీల మద్దతును కలుపుకుంటే 245 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ దక్కే అవకాశముందని ఓ బీజేపీ సీనియర్ నేత తెలిపారు. ఈ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులు ఖరారు కానప్పటికీ పలువురు జాతీయ ఆఫీస్ బేర్లరను పార్టీ ఎంపికచేసే అవకాశముందన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులైన అనీల్ జైన్, అరుణ్ సింగ్, కైలాశ్ విజయవర్గియా, మురళీధర్‌రావు, రామ్‌మాధవ్, భూపేందర్ యాదవ్‌లు రాజ్యసభ అశావహుల జాబితాలో ఉన్నారన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రులు జైట్లీ, జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా, థావర్‌చంద్ గెహ్లాట్, రామ్‌దాస్ అథావలేల పదవీకాలం పూర్తికానుంది. వీరందరి పదవీకాలాన్ని కేంద్రం పొడిగించే అవకాశముందని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: గుజరాత్లో రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో 'నోటా' (పైవారు ఎవరు కాదు) వినియోగించకుండా 'స్టే' విధించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీకి తాజాగా చుక్కెదురైంది. నోటా ఆప్షన్‌పై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజ్యసభ ఎన్నికలో 'నోటా' ఆప్షన్‌పై 2014లో సర్క్యలర్ జారీచేస్తే ఇప్పుడెందుకు కోర్టును ఆశ్రయించారని కాంగ్రెస్‌ను సుప్రీంకోర్టు నిలదీసింది. రాజ్యసభ ఎన్నికల్లో 'నోటా' ఆప్షన్‌ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అధినేత్రి సోనియాగాంధీ వ్యక్తిగత రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అహ్మద్ పటేల్‌ను ఓడించి హస్తాన్ని గట్టి దెబ్బతీయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరుగురుఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది. దీంతో మరింతమంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని బెంగళూరులోని ఓ రిసార్ట్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కర్ణాటక మంత్రి శివకుమార్‌పై, గుజరాత్ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్‌పై ఐటీ దాడులు జరగడం కాంగ్రెస్ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. -
అమిత్‌షా ఆస్తులు ఇంత పెరిగాయా..!
అహ్మదాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన బల్వంత్‌సిన్హా రాజ్‌పుత్ శుక్రవారం రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేశారు. గుజరాత్ కోటా కింద ఖాళీ కానున్న మూడు స్థానాలకు బీజేపీ నుంచి ఈ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కింద వీరు దాఖలు చేసిన అఫిడవిట్లో, ఈ ముగ్గురి ఆస్తులు భారీగా పెరిగినట్టు తెలిసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా(ఆయన భార్యతో కలిపి) ఆస్తి అయితే ఏకంగా 2012 నుంచి 300 శాతం పైకి ఎగిసినట్టు తేలింది. అమిత్‌షా చరాస్తులు రూ.1.90 కోట్ల నుంచి రూ.19 కోట్లకు పెరిగాయి. అంతేకాక ఆయన స్థిరాస్తులు 2012లో రూ.6.63 కోట్లుంటే, 2017కి వచ్చేసరికి అవి రూ.15.30 కోట్లకు పెరిగినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే వీటిలో ఆయన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు రూ.10.38 కోట్లగా ఉన్నట్టు అమిత్‌షా తెలిపారు. అంతేకాక స్మృతీ ఇరానీ(ఆమె భర్తతో కలిపి) స్థిర, చరాస్తులు కూడా 2014లో రూ.4.91కోట్లుంటే, 2017కి వచ్చే సరికి అవి 80 శాతం పెరిగి రూ.8.88 కోట్లకు ఎగిశాయి. ఇరానీ ఆస్తులు అంతలా పెరగకపోయినప్పటికీ, ఆమె భర్త జుబిన్ ఆస్తుల విలువ మాత్రం భారీగా పెరిగినట్టు తెలిసింది. కాగ 2014లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆమె సమర్పించిన అఫిడవిట్లో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి కరెస్పాడెన్స్‌లో బీకామ్ పార్ట్1 పూర్తిచేసినట్టు తెలిపారు. తర్వాత ఆమె డిగ్రీపై పలు లీగల్ కేసులు నడిచాయి. ఈ సారి రాజ్యసభకు సమర్పించిన అఫిడవిట్లో మాత్రం ఆమె మూడేళ్ల డిగ్రీ కోర్సును పూర్తిచేయలేదని తెలిపారు. ప్రస్తుతం ఇరానీ టెక్స్టైల్ మంత్రిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన బల్వంత్‌సిన్హా రాజ్‌పుత్ తన చరాస్తులు రూ.254 కోట్లగా, స్థిరాస్తులు రూ.62.56 కోట్లగా ఉన్నట్టు డిక్లేర్ చేశారు. -
ఆగస్టులో రాజ్యసభ ఎన్నికలు
న్యూఢిల్లీ: రాజ్యసభలోని 10 స్థానాలకు ఆగస్టు 8వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజ్యసభ సభ్యులైన కేంద్రమంత్రి సృ్మతి ఇరానీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఒ బ్రియాన్ తదితరుల పదవీ కాలం ఆగస్టు 18వ తేదీతో ముగియనుండటంతో ఆ స్థానాలకు ఎన్నికలు జరుపుతామని తెలిపింది. ఆగస్టు 18వ తేదీతో పదవీకాలం ముగియనున్న గుజరాత్, పశ్చిమబెంగాల్‌కు చెందిన 9 స్థానాలతోపాటు మేలో కన్నుమూసిన మధ్యప్రదేశ్‌కు చెందిన కేంద్రమంత్రి అనిల్ దవే స్థానంలో ఈ ఎన్నికలు అవసరమయ్యాయని తెలిపింది. ప్రస్తుతం రిటైరయ్యే వారిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు, కాంగ్రెస్‌కు ఇద్దరు, బీజేపీకి ఇద్దరు, సీపీఎంకు చెందిన ఒకరు ఉన్నారు. వీరంతా కూడా వచ్చే 17వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికతోపాటు, వచ్చే నెల 5వ తేదీన జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారని సీఈసీ తెలిపింది.