పొరుగునున్న తమిళనాడులో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. పాలక పక్షం అన్నా డీఎంకే నుంచి నలుగురు, డీఎంకే, సీపీఎం పక్షాల నుంచి ఒక్కొక్కరి చొప్పున అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ సాయంత్రంతో ముగియడంతో తుది ఫలితాలు వెల్లడయ్యాయి.
అన్నా డీఎంకే పార్టీకి చెందిన ఎల్. శశికళా పుష్ప, విజిలా సత్యనాథ్, ఎస్.ముత్తుకరుప్పన్, ఏకే సెల్వరాజ్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరితో పాటు డీఎంకేకు చెందిన తిరుచ్చి ఎన్ శివ, సీపీఎం సభ్యుడు టీకే రంగరాజన్ కూడా పెద్దల సభకు వెళ్లారు. ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏఎంపీ జమాలుద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. డీఎంకేకు చెందిన ఏఏ జిన్నా, వాసంతి స్టాన్లీ, కాంగ్రెస్ సభ్యులు జీకే వాసన్, జయంతి నటరాజన్లతో పాటు అన్నా డీఎంకే సభ్యుడు బాలగంగ, సీపీఎం ఎంపీ రంగరాజన్ల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. వీరిలో రంగరాజన్ ఒక్కరికే మళ్లీ అవకాశం దక్కింది.
తమిళనాట రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం
Published Fri, Jan 31 2014 5:21 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement