
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల ఫలితాల వెల్లడి సమయానికి హైడ్రామా మొదలైంది. నాలుగు రాష్ట్రాలు.. 16 స్థానాల కోసం శుక్రవారం ఓటింగ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటల నుంచే కౌంటింగ్ మొదలు కావాల్సి ఉంది. అయితే.. ఈసీకి ఫిర్యాదులు అందడంతో కౌంటిగ్ ప్రక్రియకాస్త ఆలస్యంగా మొదలైంది.
ఇదిలా ఉంటే.. రాజ్యసభ ఎన్నికల రాజస్థాన్ ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ మూడు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. జీ మీడియా అధినేత సుభాష్ చంద్ర ఓటమి పాలయ్యారు. ఇద్దరు బీజేపీ సభ్యులు క్రాసింగ్ ఓటింగ్‌కు పాల్పడినట్లు సమాచారం.
మొత్తం స్థానాల్లో ఏకగ్రీవం 41 స్థానాలు కాగా, ఎన్డీయే 17, యూపీఏ 10, ఇతరులు 14 ఏకగ్రీవంగా దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment