రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, బండా ప్రకాశ్ గెలుపొందారు. వీరిలో బండా ప్రకాశ్‌కు అత్యధికంగా 33 ఓట్లురాగా.. సంతోష్, లింగయ్యయాదవ్‌లకు 32 ఓట్ల చొప్పున పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌కు 10 ఓట్లు పడ్డాయి. దీంతో ముగ్గురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందినట్టుగా రిటర్నింగ్ అధికారి నర్సింహాచార్యులు ప్రకటించి, ధ్రువ పత్రాలు అందజేశారు.
రాజ్యసభ మూడు సీట్లూ గులాబీకే
Published Sat, Mar 24 2018 7:05 AM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement