
రాజ్యసభ సీటుపై టీడీపీతో చర్చలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపికపై పొత్తులో భాగంగా టీడీపీతో చర్చలు జరుపుతున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాజ్యసభ సీటు కొనసాగించే విషయంపై టీడీపీతో బీజేపీ చర్చలు జరుపుతోంది. అయితే ఈ విషయంలో బీజేపీ నుంచి ప్రతిపాదన ఏదీ రాలేదని టీడీపీ నాయకులు చెబుతున్న విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికను వారంలో పూర్తి చేస్తామని అమిత్ షా చెప్పారు.