నువ్వు పో.. నువ్వే పో..
నువ్వు పో.. నువ్వే పో..
Published Wed, Jan 29 2014 1:45 AM | Last Updated on Thu, Aug 16 2018 5:07 PM
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురైన తిరుగుబాటు అభ్యర్థుల బెడద.. ఆ పార్టీ సీనియర్ నేతలిద్దరి మధ్యా వాగ్వాదానికి దారితీసింది. వుంగళవారం అసెంబ్లీ లాబీల్లో ఎదురైన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డిల మధ్య పెరిగిన మాటామాటా.. పార్టీ నుంచి ‘నువ్వు పో అంటే.. నువ్వే పో’ అనే స్థారుుకి వెళ్లింది. ఒకదశలో ఇద్దరూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ వివుర్శలు చేసుకున్నారు. లాబీల్లో అప్పటివరకు వేరే నేతతో వూట్లాడుతున్న జేసీ అటువైపు వస్తున్న బొత్సను ఉద్దేశించి ‘అంతా ఈయున చేతిలోనే ఉంది..’ అని అన్నారు. దీంతో అక్కడ ఆగిన బొత్స.. ‘దవుు్మంటే పార్టీ నుంచి బయుటకు వెళ్లి ఆ వూటలు వూట్లాడు. పార్టీనుంచి పొవ్మున్నా ఇక్కడే ఉండి ఎందుకీ రాజకీయూలు? నీలా పార్టీలో ఉంటూ నేను ద్రోహం చేయుడం లేదు’ అంటూ తీవ్రస్వరంతో వుండిపడ్డారు.
దీంతో జేసీ కూడా అంతే తీవ్రంగా స్పందించారు. ‘నేనెందుకు బయుటకు పోవాలి? నువ్వే పో. ద్రోహం చేస్తున్నదెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కొత్తగా నీగురించి చెప్పేందుకు ఏవుుంది?’ అని వ్యాఖ్యానించారు. నీలా ద్రోహం చేయుడం లేదని, లాలూచీ పడడం లేదని బొత్స అనడంతో.. ‘లాలూచీ ఎవరు పడుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి నాలుగు స్థానాలకు పోటీచే అవకాశవుున్నా వుుగ్గురినే ఎందుకు ప్రకటించారు? ఆ ఒక్కస్థానం ఎవరితో లాలూచీ పడి వదులుకుంటున్నారు.
26 వుంది ఎమ్మెల్యేలు అదనంగా ఉన్నా పోటీకి అభ్యర్థిని పెట్టకుండా టీఆర్‌ఎస్‌తో కువ్ముక్కు అవుతున్నది మీరు కాదా? లాలూచీ పడుతూ పార్టీని, రాష్ట్రాన్నీ అధోగతిలోకి నెడుతున్నది మీరే కదా?’ అంటూ జేసీ అరిచారు. ఒక దశలో అలవాటుగానో, లేక మరో విధంగానో కానీ బొత్సపై చేరుువేసి వురీ వూట్లాడారు. తాను ఎవరితోనూ లాలూచీ పడడం లేదని, అరుునా నీలాంటి వారికి సవూధానం ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదంటూ బొత్స అక్కడినుంచి విసురుగా వెళ్లిపోయారు.
Advertisement
Advertisement