'ధైర్యముంటే పార్టీని విడిచిపో... నువ్వే పో' | fight between JC Diwakar Reddy and Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

'ధైర్యముంటే పార్టీని విడిచిపో... నువ్వే పో'

Published Tue, Jan 28 2014 2:33 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

'ధైర్యముంటే పార్టీని విడిచిపో... నువ్వే పో'

'ధైర్యముంటే పార్టీని విడిచిపో... నువ్వే పో'

హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ, మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి ఛాంబర్ వద్ద మంగళవారం బొత్స, జేసీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రెబల్ అభ్యర్థుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేలాయి.

ధైర్యముంటే పార్టీని విడిచి మాట్లాడాలని..లాలూచీ రాజకీయాలు చేయవద్దని బొత్స వ్యాఖ్యానించగా... వెళ్లాలనుకుంటే నువ్వే పో అని జేసీ సమాధానమిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో లాలూచీ పడింది నీవేనంటూ బొత్సపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా అసహనానికి లోనైన ఆయన ...ఓ దశలో బొత్సపై చేయి ఎత్తారు. నాలుగో అభ్యర్థిని పెట్టేందుకు ఆస్కారం ఉన్నా లాలూచీ పడింది నువ్వు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement