ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న బాబు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటమి భయంతోనే కేంద్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. రానున్ను ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలేచే శక్తిలేదని అందుకే ఏమీ చేయలేని పరిస్థితిలో కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా ఉండికూడా ఢిల్లీ 29 సార్లు వెళ్లి ఒక్క పని కూడా చేయించుకోలేని అసమర్థ వ్యక్తి చంద్రబాబని, కేంద్రం నుంచి టీడీపీ వైదొలగడం మాకే మంచిదని తీవ్ర ఆరోపణలు చేశారు.