
యూ-టర్న్ సీఎం చంద్రబాబు హైకోర్టు విషయంలో ప్లేటు మార్చారని జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు.
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. యూ-టర్న్ సీఎం చంద్రబాబు హైకోర్టు విషయంలో ప్లేటు మార్చారని ట్విటర్‌లో పేర్కొన్నారు. విభజన చట్టం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆంధ్ర హైకోర్టుకు సహకరిస్తే చంద్రబాబు నీచంగా రాజకీయాలు ఆపాదిస్తున్నారని నిప్పులు చెరిగారు. నిన్నకు నిన్న క్రెడిట్ తమదేనని ఎంపీ కే. రవీంద్ర కుమార్ డబ్బా కొట్టుకున్నారని గుర్తు చేశారు. మీ 'బతుకులు చెడ' అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఊరికే అనలా! అంటూ జీవీఎల్ ఎద్దేవా చేశారు.
U-టర్న్ CM చంద్రబాబు @ncbn హైకోర్ట్ విషయంలో ప్లేటు మార్చారు. విభజన చట్ట అమలులో భాగంగ కేంద్రం ప్రత్యేక ఆంధ్ర హైకోర్ట్కుకు సహకరిస్తే నీచంగా రాజకీయం ఆపాదిస్తున్నారు. నిన్నకు నిన్న క్రెడిట్ మాకేనని ఎంపీ కే. రవీంద్ర కుమార్ డబ్బా కొట్టుకున్నారు. మీ "బతుకులు చెడ" అని KCR ఊరికే అనలా! pic.twitter.com/aag4QyRWDi
— GVL Narasimha Rao (@GVLNRAO) December 28, 2018