హైదరాబాద్: విద్యుత్ ఒప్పందాల ఉల్లంఘనపై ఏపీ ప్రభుత్వానికి లోకాయుక్త బుధవారం నోటీసులు జారీ చేశారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఎందుకు నిలిపివేశారో వెల్లడించాలని లోకాయుక్త ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ అంశంపై జనవరి 19 లోపల సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి జారీ చేసిన ఆదేశాలలో లోకాయుక్త పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలను ఉల్లంఘిస్తుందంటూ తెలంగాణకు చెందిన అడ్వొకేట్ జానార్దన్గౌడ్ లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో లోకాయుక్త బుధవారంపై విధంగా స్పందించారు.