
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రకాశం జిల్లా, కారంచేడుకు చెందిన రైతు పొలూరి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, లోక్‌సభ సెక్రటరీ జనరల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment