సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలనే ఏపీ విభజన చట్టంలోని హామీలపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నాలుగు సంవత్సరాలు గడిచినా ఏపీ విభజన చట్టంలోని హామీలను ఎందుకు అమలు చేయలేక పోయారో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని న్యాయస్థానం సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొంగులేటి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పిటీషన్‌లో ఇంప్లీడ్ కావాలన్నారు.
తనకు ఎవరిపైనా కోపం లేదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రీడిజైన్ జరగాలని తెలిపారు. పోలవరం రీడిజైన్ జరగాలనే అంశాన్ని కేసీఆర్ గాలికొదిలేశారని, ఇపుడు ఆయన దృష్టంతా రాజకీయాల చుట్టే తిరుగుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టించుకోకుండా, కాంగ్రెస్‌పై విమర్శలకే కేసీఆర్ సమయం కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఎలా పోరాడుతున్నాయో చూసి నేర్చుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment