ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోనే ఆ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోనే ఆ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బుధవారం మీడియాతో కాసేపు సోనియా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలపై కాంగ్రెస్ పోరాడుతుందని ఆమె పేర్కొన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తెస్తామని సోనియా స్పష్టంచేశారు. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణం, పోలవరానికి నిధులు కేటాయించాలని విభజన చట్టంలో పేర్కొన్నామని, రెండేళ్లు గడుస్తున్నా విభజన చట్టం హామీలు అమలు కావడంలేదని సోనియా ఆందోళన వ్యక్తంచేశారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోదీ ఏపీకి మట్టి, నీరు ఇచ్చి ముంచారని రాహుల్ ఆరోపించారు.