సోనియా, రాహుల్ సంతాపం | Sonia, Rahul condole deaths in Andhra accident | Sakshi
Sakshi News home page

సోనియా, రాహుల్ సంతాపం

Published Mon, Aug 24 2015 3:21 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సోనియా, రాహుల్ సంతాపం - Sakshi

సోనియా, రాహుల్ సంతాపం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిపట్ల సానూభూతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని సూచించారు. మున్మందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 'బెంగళూరు-నాందేడ్ రైలు ప్రమాదం ఒక్కసారిగా నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను' అని సోనియా అన్నారు.

అనంతపురం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతిచెందగా వారిలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ దేవదుర్గ్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ కూడా దుర్మరణం చెందారు. పెనుగొండ మండలం మడకశిర వద్ద నాందేడ్ ఎక్స్ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement