condole
-
దేవీప్రియ మృతి పట్ల గవర్నర్ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ కవి, జర్నలిస్టు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవీప్రియ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రచయితగా, కార్టూనిస్టుగా, కవిగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని గవర్నర్ అన్నారు. గుంటూరు జిల్లా పల్నాడులోని ఓబులేశునిపల్లెలో జన్మించిన దేవిప్రియ సినీరంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి జర్నలిజంలో స్థిరపడ్డారు. దేవిప్రియ మరణం తెలుగు కవిత్వానికి తీరని లోటని గవర్నర్ అన్నారు. 'గాలి రంగు' రచన ఆయన సాహిత్య ప్రతిభకు మచ్చు తునక అని, కవి, అమ్మచెట్టు వంటి అత్యుత్తమ సంకలనాలు ఆయన కలం నుండి జాలువారాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు బిశ్వ భూషణ్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
షీలా దీక్షిత్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్(81) గుండెపోటుతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో శనివారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. షీలా మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. షీలా భౌతిక కాయాన్ని ఈస్ట్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అంత్యక్రియలు నిగమ్‌బోధ్ ఘాట్‌లో ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఢిల్లీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. షీలా దీక్షిత్ శనివారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఫోర్టిస్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు అత్యాధునిక వైద్య చికిత్స అందించింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి తాత్కాలికంగా కుదుటపడింది. కొద్ది సేపటి తర్వాత మరోసారి గుండెపోటు రావడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రముఖుల సంతాపం ఢిల్లీ సీఎంగా షీలా నగర రూపురేఖలనే మార్చేశారని, ఆమె ప్రజల మదిలో కలకాలం గుర్తుండిపోతారని రాష్ట్రపతి కోవింద్ తన సంతాపం సందేశంలో పేర్కొన్నారు. షీలా మంచి పరిపాలనాదక్షురాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధిలో షీలా సేవలు శ్లాఘనీయమని ప్రధాని మోదీ అన్నారు. అనంతరం మోదీ షీలా నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. షీలా మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. షీలా దీక్షిత్‌ను ఆయన..అత్యంత ఆత్మీయురాలు, కాంగ్రెస్ పార్టీ అభిమాన పుత్రికగా పేర్కొన్నారు. అంకితభావం కలిగిన ప్రజా నేతలను కాంగ్రెస్ కోల్పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఆమె మరణం తీరని నష్టమని, ఆమె సేవలను ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. షీలా దీక్షిత్ కుమార్తె, కుమారుడికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాసిన లేఖను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్లో ఉంచారు. ‘మీ తల్లికి నా హృదయంలో గొప్ప స్థానముంది. నా భర్త రాజీవ్‌తో షీలాజీకి మంచి అనుబంధం ఉండేది. ఈ క్రమంలో ఆమెతో నాకూ స్నేహం ఏర్పడింది. షీలాజీకి ఉన్న అనేక సుగుణాలను నేను అభిమానించడం ప్రారంభించాను. ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా, డీపీసీసీ చీఫ్‌గా, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నకాలంలో ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేశాం’ అని సోనియా పేర్కొన్నారు. సమర్ధురాలైన పాలకురాలు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: సీనియర్ రాజకీయవేత్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విషాదంలో మునిగి ఉన్న ఆమె కుటుంబీకులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. ఆమె మరణంతో దేశం ఒక సమర్థురాలైన పాలకురాలిని కోల్పోయిందని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. షీలా దీక్షిత్ పోరాట పటిమకు, సాహసానికి, చురుకుదనానికి పెట్టింది పేరని జగన్ కొనియాడారు. షీలా చివరి ఆదేశాలు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటనలో ప్రతిష్టంభన తొలగని పరిస్థితుల్లో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఆందోళనకు దిగాలని పార్టీ కార్యకర్తలను షీలా దీక్షిత్ కోరినట్లు తెలుస్తోంది. యూపీలో పర్యటిస్తున్న ప్రియాంకను అక్కడి బీజేపీ ప్రభుత్వం నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. శనివారం కూడా ఆమె నిర్బంధం కొనసాగినట్లయితే బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలపాల్సిందిగా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ హోదాలో షీలా దీక్షిత్ కార్యకర్తలకు శుక్రవారం ఆదేశాలిచ్చినట్లు సీనియర్ నేత ఒకరు తెలిపారు. అవసరమైతే ఆదివారం కూడా నిరసన కొనసాగించాలని కూడా ఆమె చిట్టచివరి ఆదేశాలు జారీ చేశారని పార్టీ నేత కిరణ్ వాలియా వివరించారు. -
వైఎస్సార్సీపీ ఎంపీల సంతాపం
తాను నమ్మిన సిద్ధాంతాలను మానవతా ధృక్పథంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేసి సుపరిపాలన అందించిన ఒక పాలనాధక్షుడిగా వాజ్‌పేయి చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. 10 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు పనిచేసి దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు వాజ్‌పేయి. ఆయన మరణంతో దేశం ఒక మహోన్నత నాయకుడిని కోల్పోయింది. – వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాదరావు -
స్నేహం కోసం ఎంతో శ్రమించారు
ఇస్లామాబాద్/వాషింగ్టన్/మాస్కో: భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల అమెరికా, రష్యా, చైనా, పాకిస్తాన్ సహా పలు ప్రపంచ దేశాలు సంతాపం వ్యక్తం చేశాయి. విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా విదేశాలతో భారత స్నేహపూర్వక సంబంధాల కోసం వాజ్‌పేయి ఎంతో శ్రమించారని ఆయా దేశాలు గుర్తుచేసుకున్నాయి. భారత్–పాక్ల్లో శాంతిస్థాపన కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పాక్‌కు కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలోనే భారత్–పాక్ సంబంధాల్లో మంచి పురోగతి కనిపించదని గుర్తుచేసుకున్నారు. -
జయ 'విజన్ 2023': బిజినెస్ పెద్దల సంతాపం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై పలువురు పారిశ్రామిక పెద్దలు, వ్యాపార వేత్తలు, వివిధ పరిశ్రమ సంఘాల ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి ఆర్థిక పురోగతికి ఆమె ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. 'తమిళనాడు విజన్ 2023' కాన్సెప్ట్ తో పనిచేసిన ఏకైక వ్యక్తి జయలలిత అని ఫిక్కీ అధ్యక్షుడు పీ మురారి సంతాపం ప్రకటించారు. అనేక విషయాల్లో ఆమె పరిశ్రమ సలహాలను స్వీకరించే వారని తెలిపారు. ముఖ్యంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల ప్రాముఖ్యతలపై తామిచ్చిన సలహాలను వెంటనే ఆమోదించారన్నారు. తాను1955 -1984 మధ్య కాలంలో తమిళనాడు ప్రభుత్వంతో ఉన్నాననీ, ఒక యూనిక్ దృష్టితో తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధికోసం ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఆమె లేని లోటును పూరించడం చాలా కష్టమన్నారు. టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ అమ్మ మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆర్ధిక పురోగతి, రాష్ట్ర శ్రేయస్సు ,ఉద్యోగాల కల్పనకు కోసం పరిశ్రమ, వాణిజ్య రంగానికి మంచి ప్రోత్సాహాన్నిచ్చరని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి కలకాలం గుర్తుండిపోతుందన్నారు. హ్యుందాయ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో వై కెకూ సంతాపం ప్రకటిస్తూ ఆమె మరణం తీవ్ర దిగ్భ్రమ కలిగించిందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధితోపాటు, హ్యుందాయ్ మోటార్ కార్యకలాపాలకు మద్దతు అందించారన్నారు. జయలలిత మరణం తనను తీవ్రంగా బాధించిందంటూ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సంతాపం తెలిపారు. అమ్మను మంచి చతురత, వాగ్దాటి ఉన్న 'ఐరన్ లేడీ' గా ఆయన పేర్కొన్నారు. -
దళితుల గొంతు ఆగింది
– బొజ్జా తారకం భౌతికకాయానికి నివాళులు అర్పించిన చిత్తర్వు హైదరాబాద్ (హిమాయత్‌నగర్) : సుదీర్ఘకాలంపాటు దళితుల పక్షాన పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి బొజ్జా తారకం అని ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్స్ అసోసియేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు చిత్తర్వు నాగేశ్వరరావు అన్నారు. క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందిన బొజ్జా తారకం భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చిత్తర్వు నాగేశ్వరరావు శనివారం సందర్శించారు. బొజ్జా తారకం కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా చిత్తర్వు మాట్లాడుతూ ఎంతోకాలం దళితుల సమస్యలపై సింహాస్వప్నంలా పోరాడిన వ్యక్తి బొజ్జా తారకం అని కొనియాడారు. ఆయనమృతి తీరని లోటని పేర్కొన్నారు. -
'ఆయన మరణం చాలా బాధ కలిగించింది'
చెన్నై : నటుడు కళాభవన్ మణి మృతి కోలీవుడ్‌లోనూ విషాద ఛాయలను నింపింది. మలయాళం నుంచి వచ్చిన కళాభవన్ మణి బహుభాషా నటుడు. మాతృభాషలో కథానాయకుడిగా పలు చిత్రాలు చేసిన ఆయన తమిళం, తెలుగు తదితర భాషల్లో ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు పోషించారు. తమిళంలో కమలహాసన్, విక్రమ్, సూర్య వంటి ప్రముఖ కథానాయకులతో నటించి ప్రాచుర్యం పొందారు. ఆయా చిత్రాల ద్వారా తమిళ ప్రేక్షకుల గుండెల్లోనూ సుస్థిర స్థానాన్ని పొందిన కళాభవన్ మణి మరణం తమిళ చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కోలీవుడ్‌లో కళాభవన్ మణి నట పయనం 1998లో మరుమలర్చి చిత్రం నుంచి ఇటీవల కమలహాసన్ నటించిన పాపనాశం వరకూ నిరాటంకంగా సాగింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కమలహాసన్ సంతాపం వ్యక్తం చేస్తూ మిత్రుడు కళాభవన్ మణి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన మరణం చాలా బాధ కలిగిందన్నారు. కళాభవన్ మణి బాణీను ఆయన వల్ల స్ఫూర్తి పొందిన నటులు చిత్ర పరిశ్రమలో ఉన్నారని గుర్తు చేశారు. నటుడు సూర్య తన సంతాపం తెలియజేస్తూ కళాభవన్ మణి చాలా మంచి నటుడన్నారు. ఆయనతో స్నేహం నా గుండెల్లో జ్ఞాపకాలుగా మిగిలిపోతాయనీ, కళాభవన్ మణి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని సూర్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
సోనియా, రాహుల్ సంతాపం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిపట్ల సానూభూతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని సూచించారు. మున్మందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 'బెంగళూరు-నాందేడ్ రైలు ప్రమాదం ఒక్కసారిగా నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను' అని సోనియా అన్నారు. అనంతపురం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతిచెందగా వారిలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ దేవదుర్గ్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ కూడా దుర్మరణం చెందారు. పెనుగొండ మండలం మడకశిర వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
చక్రి సంగీత స్వరం మూగబోయింది..
-
ముండేకు వైఎస్ఆర్ సీపీ ఎంపీల నివాళి
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోపీనాథ్ ముండేకు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు నివాళులర్పించారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ముండే పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దేశం ఓ గొప్ప నాయకున్ని కోల్పోయిందని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గోపీనాథ్ ముండే ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. ముండే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
'ఆయన లేని లోటు పూడ్చలేనిది'
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండేకు పార్టీలకు అతీతంగా నాయకులు సంతాపం తెలిపారు. ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనలేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. తన సహచరుడి మరణం తనను షాక్ కు గురిచేసిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. మరో కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముండే హఠాన్మణం పట్ల ఎన్సీపీ అధినేత శరద పవార్ సంతాపం ప్రకటించారు. తన పాత స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేపోతున్నానని జేడీ(యూ) నేత శరద్ యాదవ్ పేర్కొన్నారు. ముండే మరణం బీజేపీ, తమ పార్టీకి పెద్ద దెబ్బ అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర మంచి నాయకున్ని కోల్పోయిందని నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ ట్వీట్ చేశారు.