
ఇస్లామాబాద్/వాషింగ్టన్/మాస్కో: భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల అమెరికా, రష్యా, చైనా, పాకిస్తాన్ సహా పలు ప్రపంచ దేశాలు సంతాపం వ్యక్తం చేశాయి. విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా విదేశాలతో భారత స్నేహపూర్వక సంబంధాల కోసం వాజ్‌పేయి ఎంతో శ్రమించారని ఆయా దేశాలు గుర్తుచేసుకున్నాయి. భారత్–పాక్‌ల్లో శాంతిస్థాపన కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పాక్‌కు కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలోనే భారత్–పాక్ సంబంధాల్లో మంచి పురోగతి కనిపించదని గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment