మైనారిటీ కమిషన్ రికార్డులన్నింటినీ భద్రపరచాలని కమిషన్ కార్యదర్శిని బుధవారం ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.
మైనారిటీ కమిషన్ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మైనారిటీ కమిషన్ రికార్డులన్నింటినీ భద్రపరచాలని కమిషన్ కార్యదర్శిని బుధవారం ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న మైనారిటీ కమిషన్ గురించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని, ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిం చడం లేదని కమిషన్ చైర్మన్ హైకోర్టును ఆశ్రరుుంచారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. కమిషన్ చైర్మన్, సభ్యుల మూడేళ్ల పదవీ కాలం ఈ ఏడాది మే తో ముగిసిందని తెలిపారు. అందువల్ల కమిషన్ బాధ్యతలను చూసుకునేందుకు కార్యదర్శిని ఏర్పాటు చేశామన్నారు. రికార్డులను కార్యదర్శికి అప్పగించడం సబబుగా ఉంటుందని, ఈ మేరకు పిటిషనర్‌ను ఆదేశించాలని కోరారు. అంగీకరించిన ధర్మాసనం రికా ర్డులన్నింటినీ భద్రపరచాలని కార్యదర్శిని ఆదేశించింది. కమిషన్ కొనసాగింపు విషయంలో మరో వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది.