పూనమ్ పాండే వెబ్సైట్ హ్యాక్.. పాకిస్థానీ పాత్ర | Actress Poonam Pandey's website hacked | Sakshi
Sakshi News home page

పూనమ్ పాండే వెబ్సైట్ హ్యాక్.. పాకిస్థానీ పాత్ర

Published Tue, Jan 28 2014 4:21 PM | Last Updated on Wed, Jul 25 2018 1:49 PM

పూనమ్ పాండే వెబ్సైట్ హ్యాక్.. పాకిస్థానీ పాత్ర - Sakshi

పూనమ్ పాండే వెబ్సైట్ హ్యాక్.. పాకిస్థానీ పాత్ర

ముంబై: హాట్ హాట్ ఫోజులు, సంచలన వ్యాఖ్యలు, ట్వీట్లతో ఎలాగోలా వార్తల్లో నిలిచే బాలీవుడ్ ముద్దుగుమ్మ, మోడల్ పూనమ్ పాండేకు ఈసారి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. పూనమ్ వెబ్సైట్ ‘www.poonampandey.in’ ను ఆదివారం పాకిస్థాన్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. దీంతో అవాక్కయిన పూనమ్ ముంబై సైబర్ క్రైం సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెబ్సైట్ను హ్యాక్ చేశారని తెలియగానే షాక్కు గురయ్యానని ఈ మోడల్ భామ చెప్పింది. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యానని చెప్పుకొచ్చింది. హ్యాక్ చేసిన వ్యక్తి పాకిస్థాన్, కాశ్మీర్ సంబంధిత విషయాల్ని పూనమ్ సైట్లో రాశాడు. ఈ విషయాల్ని పూనమ్ ట్వీట్ చేసింది. షాక్ నుంచి తేరుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే వెబ్సైట్ తన నియంత్రణలోకి వస్తుందని పేర్కొంది. కొత్త లుక్, మరింత మసాల వార్తలతో ముందుకొస్తానంటూ ముక్తాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement