- ఐదు రోజుల్లో ఇది రెండో సారి
ఏయూ వెబ్‌సైట్ హ్యాకింగ్
Published Thu, Aug 4 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
పెదవాల్తేరు : ఏయూ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైందని రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు బుధవారం మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెబ్‌సైట్ హోమ్ పేజీలోని లోగోలను హ్యాకర్లు మార్చేశారని, దీని వల్ల నష్టం లేదని, అయినప్పటికీ నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏయూ వెబ్‌సైట్ హ్యాక్ కావడం ఐదు రోజుల్లో ఇది రెండోసారి. గత నెల 30న తొలిసారి హ్యాక్ అయింది. www.andhravuniversity.edu.in వెబ్‌సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అన్న నినాదాలు వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. వెంటనే స్పందించిన అధికారులు మధ్యాహ్నానికి పునరుద్ధరించారు. వెబ్‌సైట్ హ్యాకింగ్ జరగలేదని, డొమైన్‌ను ఇతరులు డైవర్ట్ చేశారని దాని నిర్వాహకుడు ఆవాల రమేష్ ఆరోజు తెలిపారు. అయితే మళ్లీ హ్యాక్ చేయడంతో రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement