సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు.. టీఎస్ ఇప్పుడు ఏకంగా పోలీస్ యాప్స్‌నే హ్యాక్ చేసేశారు. కొన్ని రోజుల క్రితం ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు రూపొందించిన ‘హ్యాక్ ఐ యాప్’ను కూడా హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. యాప్‌లను హ్యాక్ చేసి డేటాను చోరీ చేస్తున్నారు.
చోరీచేసిన డేటాను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు 120 డాలర్లకు తెలంగాణ పోలీసుల డేటా అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. 12 లక్షల మంది డేటా బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ హ్యాకింగ్‌కు పాల్పడిన ముఠాను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు. చోరీ చేసిన సమాచారంతో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment