![Superintendent Of Police Facebook Hack In Nalgonda - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/19/facebook-hack.jpg.webp?itok=dbh5YVAS)
సాక్షి, నల్లగొండ: నల్లగొండ ఎస్పీ రంగనాథ్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయింది. ఫేస్‌బుక్‌లో సైబర్ నేరగాళ్లు ఎస్పీ రంగనాథ్ ఫొటో డీపీ(డిస్‌ప్లే పిక్చర్)గా పెట్టి డబ్బులు కావాలంటూ కొందరికి మెసేజ్‌లు పెట్టినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. నలుగురు వ్యక్తులకు మెసేజ్‌లు పెట్టినప్పటికీ అనుమానం వచ్చి వారు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. రెండేళ్లుగా ఎస్పీ తన వ్యక్తిగత ఫేస్‌బుక్ ఖాతాను ఉపయోగించడంలేదు. తన ఫేస్‌బుక్ హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్న విషయం తెలియడంతో శుక్రవారం తన ఖాతాను ఎస్పీ డీయాక్టివేట్ చేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో సీఐగా పనిచేసిన బాల గంగిరెడ్డి ఫేస్‌బుక్ కూడా హ్యాక్ అయింది. డీపీలో బాల గంగిరెడ్డి ఫొటో పెట్టి డబ్బులు కావాలని సైబర్ నేరగాళ్లు మెసేజ్ పెట్టడంతో ఇద్దరు వ్యక్తులు రూ.20వేల చొప్పున రూ.40,000 ఖాతాలో వేసినట్లు సమాచారం. ప్రస్తుతం బాల గంగిరెడ్డి హైదరాబాద్ చిలకలగూడలో సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment