కోటిమంది సమాచారం గోవిందా!
ముంబై: ఇటీవల హ్యకింగ్ కు గురైన భారతీయ రైల్వే టికెటింగ్ వెబ్ సైట్ (ఐఆర్సీటీసీ)కు తాజాగా మరో చిక్కొచ్చిపడింది. హ్యకింగ్ కు గురైన సమాచారంలో ఒక కోటికి పైగా కస్టమర్ల వివరాలు ఉండటంతో పాటు ఆ వివరాలను సీడీలలో పొందుపరచి రూ.15,000లకు కావలసిన వారికి అమ్ముతున్నట్లు అధికారులకు తెలిసింది.
మహారాష్ట్ర ఇంటిలిజెన్స్ బ్యూరో సైబర్ పోలీసుల వివరాల ప్రకారం హ్యకింగ్ సమయంలో దాదాపు ఒక కోటికి పైగా కస్టమర్ల ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, పాన్ కార్డు నంబర్ తదితర వివరాలను తస్కరించినట్లు తెలిపారు.
వెబ్ సైట్ హ్యక్ కాలేదు: రైల్వే పీఆర్వో
కాగా ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో వివరాలు హ్యక్ అయినట్లు మీడియాలో వస్తున్న వార్తలను రైల్వే పీఆర్వో సందీప్ దత్తా ఖండించారు. దీనిపై రైల్వే కమిటీ విచారణ జరుపుతోందని వివరించారు. గతంలోనూ ఐఆర్సీటీసీ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైన విషయం తెలిసిందే.