Cyber cell
-
వారానికి జరిగే సైబర్ అటాక్‌లు ఎన్నంటే..
భారతదేశంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి వేగంగా పురోగమిస్తుంది. అయితే అందుకు అనువుగా డేటా భద్రత, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల నిర్వహణ సవాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పొరుగు దేశాల్లోని శత్రువులు, స్కామర్లు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ మరింత క్లిష్టంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం..ఇండియాలోని సంస్థలపై సగటున గత ఆరు నెలల్లో వారానికి 2,157 సార్లు సైబర్ దాడులు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంస్థపై సగటున 1,139 దాడులు జరిగాయి. ఇటీవల జరిగిన సింగపూర్ సైబర్ వీక్-2023 సమావేశంలో నిపుణులు మాట్లాడారు. భారతీయ సాంకేతిక నిపుణులు, వ్యాపార కార్యనిర్వాహకులు పరస్పరం సహకారం అందించుకుంటూ డేటా భద్రతపరంగా సమగ్ర వ్యవస్థను రూపొందించాలన్నారు. దేశ పురోగతికి ప్రధాన అంశాలైన ఐటీ పరిశ్రమలతోపాటు ఆరోగ్య సంరక్షణ, విద్య/ పరిశోధన, రిటైల్, హాస్పిటాలిటీ, మాన్యుఫ్యాక్చరింగ్, రవాణా వంటి రంగాలు సైబర్ సెక్యూరిటీ సవాళ్లకు అనువుగా చర్యలు తీసుకోవాలని నిపుణులు తెలిపారు. రోజురోజూ సైబర్ సెక్యూరిటీ చాలా క్లిష్టంగా మారుతుందని ఏపీఏసీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వివేక్ గుల్లపల్లి చెప్పారు. కంపెనీల్లోని ఐటీ విభాగం తరచు సైబర్ సెక్యూరిటీని నిర్వహించాలని ఆయన సూచించారు. సంస్థలో సైబర్ సెక్యూరిటీ వ్యూహాన్ని అమలు చేయడానికి బోర్డులు, మేనేజ్మెంట్ సభ్యులతో కలిసి పని చేయాలన్నారు. -
సైబర్ దాడుల సన్నద్ధతపై ‘అరెటే’ ఫోకస్
హైదరాబాద్: సైబర్ రిస్క్ నిర్వహణ కంపెనీ ‘అరెటే’.. సైబర్ దాడుల నిరోధానికి, ఒకవేళ సైబర్ దాడులు తలెత్తితే ఆ సమయంలో సన్నద్ధతకు సంబంధించి కొత్తగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ప్రకటించింది. చిన్న, మధ్య తరహా సంస్థల కోసం దీన్ని రూపొందించామని, సహజంగా ఈ సంస్థలే ఎక్కువగా దాడులకు గురవుతుంటాయని, పూర్తి స్థాయిలో వ్యవస్థల పునరుద్ధరణకు 6–8 రోజుల సమయం తీసుకుంటున్నట్టు అరెటే తెలిపింది. చిన్న, మధ్య తరహా సంస్థల సిస్టమ్స్‌లో అప్పటికే హానికాక సాఫ్ట్వేర్లు ఏవైనా ఉన్నాయా? కస్టమర్లకు సంబంధించి సున్నితమైన సమాచారం లీక్ అయిందా గుర్తించడంతోపాటు.. పరిశ్రమలోనే అత్యుత్తమ విధానాలు, రిస్క్ నిర్వహణతో ఇది ఉంటుందని వివరించింది. సంస్థలకు మరింత రక్షణ కలి్పంచి, సైబర్ దాడుల రిస్క్‌ను తగ్గించడమే తమ లక్ష్యమని అరెటే ప్రకటించింది. -
అయ్యో.. మొబైల్ పోయిందా? ఇలా చేయండి
విజయనగరం క్రైమ్: ఎంతో విలువైన మొబైల్ మిస్సయిందా? కంగారు పడకండి. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. జిల్లా పోలీస్‌శాఖ నూతనంగా రూపకల్పన చేసి నిరంతర పర్యవేక్షణకు సైబర్ సెల్‌ను ఏర్పాటుచేసింది. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు ఇటీవలికాలంలో పెరుగుతుండడంతో, బాధితులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకండా, ఫిర్యాదుల స్వీకరణను సులభతరం చేస్తూ ఎస్పీ ఎం.దీపిక చర్యలు చేపట్టారు. మొబైల్ పొగొట్టుకున్న బాధిత ఫిర్యాదు దారు పేరు, చిరునామా, సంప్రదించాల్సిన మొబైల్ నంబర్, మొబైల్ మోడల్, ఐఎంఈఐ నంర్, ఫోన్ పోయిన తేదీ, సమయం, ప్రాంతం వంటి వివరాలను పోలీస్ వాట్సాప్ నంబర్ 8977945606కు పంపించాలి. ఫిర్యాదు అందుకున్న వెంటనే సైబర్‌సెల్ పోలీసులు బాధిత ఫోన్‌ను ట్రాక్ చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చర్యలు చేపడతారు. పోగొట్టుకున్న ఫోన్లను ట్రాక్ చేసి తర్వాత తిరిగి బాధితులకు అందజేస్తారు. ఒకవేళ పోయిన ఫోన్లు ట్రాక్ కాకుంటే చట్టపరమైన చర్యలు చేపట్టి, దర్యాప్తు చేస్తారు. వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సైబర్ సెల్ సిబ్బంది స్వీకరించి, వాటిని రిజిస్టర్లో నమోదుచేసి, పోయిన మొబైల్స్‌ను కనుగొనేందుకు చర్యలు చేపడతారు. ఆందోళన అవసరం లేదు జిల్లాలో మొబైల్స్ పోగొట్టుకున్న ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జస్ట్ డయల్ 8977945606కు చేసి ఫిర్యాదు చేస్తే సైబర్ సెల్ నిరంతర పర్యవేక్షణ చేస్తుంది. పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. పోలీస్ శాఖ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఎం.దీపిక, ఎస్పి, విజయనగరం -
విద్యార్థులతో మేడమ్ రాసలీలలు వైరల్.. దర్యాప్తు ముమ్మరం
చెన్నై: తమిళనాడులో ఓ గవర్నమెంట్ టీచర్ చేసిన పని సంచలనంగా మారింది. ముగ్గురు విద్యార్థులతో శారీరకంగా కలవడమే కాదు.. ఆ చెండాలాన్ని వీడియో తీసి వైరల్ చేసిన ఘటన పెనుదుమారం రేపింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే ఘటన కావడంతో స్వయంగా తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. మధురైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తోంది సదరు టీచర్(42). ఈ క్రమంలో ఓరోజు ముగ్గురు విద్యార్థులను ఇంటికి రప్పించుకుని.. వాళ్లతో శారీరకంగా కలిసింది. ఈ తతంగాన్ని 39 ఏళ్ల వయసున్న ఆమె ప్రియుడు, స్థానిక వ్యాపారవేత్త ఒకడు వీడియో తీశాడు. ఆపై ఆ వీడియోను తన స్నేహితుల సాయంతో వాట్సాప్ ద్వారా సర్క్యూలేట్ చేశాడు. వీడియో వ్యవహారం పోలీసుల దృష్టికి చేరడంతో తమిళనాడు డీజీపీ కార్యాలయం స్పందించింది. తక్షణమే ఆ వీడియోను తొలగించే ప్రయత్నాలు చేయాలని మధురై సైబర్ సెల్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై టీచర్, ఆమె ప్రియుడ్ని మధురై పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. భర్త నుంచి విడిపోయిన సదరు మహిళ.. 2010 నుంచి సదరు వ్యాపారవేత్తతో సహజీవనం చేస్తోంది. కేవలం వైరల్ కావడం కోసమే ఆ వీడియో తీశారా? లేదంటే.. అశ్లీల సైట్లలో అప్లోడ్ చేసి డబ్బు సంపాదించాలనుకున్నారా? బ్లాక్‌మెయిలింగ్ కోణం ఉందా? అనేది సైబర్‌విభాగం తేల్చాల్సి ఉంది. వీడియోను ఎవరికి పంపారు? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఆ ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు సదరు టీచర్‌పై, ఆమె ప్రియుడిపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. -
జిల్లాకో సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్
సాక్షి, అమరావతి: ఆన్లైన్ మోసాలు, వేధింపులను అరికట్టేందుకు జిల్లాకో సైబర్ సెల్, ల్యాబ్, సోషల్ మీడియా ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. జిల్లా స్థాయిలో సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్‌లకు వేర్వేరుగా బీటెక్ అర్హత ఉన్న ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లు, సిబ్బందిని ఎంపిక చేసినట్టు తెలిపారు. ప్రతి జిల్లాకూ సైబర్ లీగల్ అడ్వయిజర్, సైబర్ నిపుణులను నియమిస్తామని చెప్పారు. సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్‌ల కోసం ఎంపిక చేసిన అధికారులు, సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి వెబినార్ ద్వారా సోమవారం డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, డెస్క్ ఫోరెన్సిక్, మొబైల్ ఫోరెన్సిక్, పాస్వర్డ్ రికవరీ, సీడీఆర్ అనాలసిస్, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, ప్రోక్సీ ఎర్రర్ ఐడెంటిటీ, ఈ–మెయిల్, సోషల్ మీడియా తదితర టూల్స్లతో కూడిన ఈ సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా స్థాయిలోనే డిజిటల్ ఎవిడెన్స్, సోషల్ మీడియా ఐడెంటిటీ వంటి కీలక సాక్ష్యాధారాలను సేకరించడం ద్వారా దోషులను గుర్తించి సత్వరం శిక్షలు పడేలా చొరవ చూపుతామని చెప్పారు. ఇప్పటికే సైబర్ నేరాలకు పాల్పడుతున్న 1,551 మంది ప్రొఫైళ్లను గుర్తించి, వారిపై సైబర్ బుల్లీ షీట్స్ తెరిచినట్టు డీజీపీ వెల్లడించారు. జిల్లా స్థాయి సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్‌లను అనుసంధానిస్తూ రాష్ట్ర స్థాయిలో సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు అవసరమైన నిధులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారని డీజీపీ గౌతం సవాంగ్ వివరించారు. -
బిట్కాయిన్ల ఆచూకీ చెబితే రూ.2 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద బిట్‌కాయిన్ చోరి వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్‌సెక్యుర్ నుంచి దాదాపు రూ.20 కోట్ల విలువైన 438 బిట్కాయిన్లు చోరికి గురయ్యాయి. ఈ దొంగతనానికి గురైన బిట్కాయిన్ల ఆచూకీ కోసం ఈ ఎక్స్చేంజీ తీవ్ర ఎత్తున్న ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో తాము కోల్పోయిన బిట్కాయిన్ల కనిపెట్టి, ఆచూకీ చెప్పిన వారికి రూ.2 కోట్ల రివార్డు అందిచనున్నట్టు కాయిన్‌సెక్యుర్ ప్రకటించింది. ‘మా నిధులను రికవరీ చేసుకునేందుకు హ్యాకర్లను గుర్తించడానికి మా యూజర్ల నుంచి, బిట్‌కాయిన్ కమ్యూనిటీ నుంచి సాయం కోరుతున్నాం’ అని కాయిన్‌సెక్యుర్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ వారం మొదట్లో తమ కంపెనీ వాలెట్ నుంచి రూ.20 కోట్ల విలువైన 438 బిట్కాయిన్లు చోరికి గురైనట్టు కాయిన్‌సెక్యుర్ ఢిల్లీ పోలీసు సైబర్‌సెల్ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రకటించిన రివార్డు విలువ చోరికి గురైన మొత్తం విలువలో 10 శాతం. అసలేం జరిగింది...? కాయిన్‌సెక్యుర్ అనే ఈ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్కు రెండు లక్షలకు పైగా యూజర్లున్నారు. ఆఫ్‌లైన్‌గా వారు బిట్కాయిన్లను కంపెనీ స్టోర్ చేస్తోంది. వీటిని స్టోర్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ కీలు అంటే పాస్వర్డ్లు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ లీకేజీ ద్వారా హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. దీనికి గుర్తించిన కంపెనీ, హ్యాకర్లను గుర్తించడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ప్రభావితానికి గురైన వాలెంట్ల డేటా అంతా అప్పటికే చోరీకి గురై, మొత్తం డేటాను హ్యాకర్లు తొలగించేశారు. బిట్కాయిన్లను కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. ఇక కంపెనీ ఏం చేయలేని పరిస్థితుల్లో గురువారం రాత్రి నుంచి ఈ విషయాన్ని తన వెబ్సైట్ ద్వారా యూజర్లకు తెలపడం ప్రారంభించింది. తమ బిట్కాయిన్ల నిధులు బయటికి బహిర్గతమయ్యాయి అని చెప్పడానికి చింతిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. ఈ చోరీలో అంతర్గత వ్యక్తుల పాత్ర ఉందని అనుమానిస్తున్నట్టు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్ కర్లా అన్నారు. -
అతిపెద్ద క్రిప్టో చోరీ : రూ.20 కోట్లు గోవిందా!
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ చోరీ జరిగింది. టాప్ ఎక్స్చేంజ్ సంస్థ నుంచి రూ.20 కోట్ల విలువైన 438 బిట్కాయిన్లు చోరీకి గురైనట్టు తెలిసింది. ఢిల్లీకి చెందిన క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్‌సెక్యుర్ దీనిపై ఫిర్యాదు దాఖలు చేసింది. సంస్థ వాలెట్ నుంచి ఈ నగదును సీఎస్ఓ అమితాబ్ సక్సేనా చోరీ చేసినట్టు సైబర్ సెల్ వద్ద ఈ ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐటీ యాక్ట్ సెక్షన్ 66, ఐపీసీ సెక్షన్స్ కింద ఈ కేసు సైబర్‌సెల్ రిజిస్ట్రర్ చేసింది. సక్సేనా దేశం విడిచి పారిపోయే సూచనలు ఉన్నాయని, ఆయన పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని ఈ ఎక్స్చేంజ్ ప్రభుత్వాన్ని కోరుతోంది. అసలేం జరిగింది...? కాయిన్‌సెక్యుర్ అనే ఈ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్కు రెండు లక్షలకు పైగా యూజర్లున్నారు. ఆఫ్‌లైన్‌గా వారు బిట్కాయిన్లను కంపెనీ స్టోర్ చేస్తోంది. వీటిని స్టోర్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ కీలు అంటే పాస్వర్డ్లు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ లీకేజీ ద్వారా హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. దీనికి గుర్తించిన కంపెనీ, హ్యాకర్లను గుర్తించడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ప్రభావితానికి గురైన వాలెంట్ల డేటా అంతా అప్పటికే చోరీకి గురై, మొత్తం డేటాను హ్యాకర్లు తొలగించేశారు. బిట్కాయిన్లను కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. ఇక కంపెనీ ఏం చేయలేని పరిస్థితుల్లో గురువారం రాత్రి నుంచి ఈ విషయాన్ని తన వెబ్సైట్ ద్వారా యూజర్లకు తెలపడం ప్రారంభించింది. తమ బిట్కాయిన్ల నిధులు బయటికి బహిర్గతమయ్యాయి అని చెప్పడానికి చింతిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. ఈ చోరీలో అంతర్గత వ్యక్తుల పాత్ర ఉందని అనుమానిస్తున్నట్టు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్ కర్లా అన్నారు. ప్రైవేట్ కీలను ఆన్లైన్లో ఎక్స్పోర్ట్ చేయమని, ఉద్దేశ్యపూర్వకంగానే ఈ క్రైమ్ చేసినట్టు తాము అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. తమ అనుమానాలన్నింటిన్నీ సైబర్‌సెల్‌తో షేర్ చేశామని, హ్యాక్ సోర్స్‌ను గుర్తించి, బిట్కాయిన్లు ఎక్కడ ఉన్నాయో కనుగొంటామని కర్లా చెప్పారు. ఒకవేళ ఈ నిధులను గుర్తించలేకపోతే, కంపెనీనే తన సొంత ప్యాకెట్ నుంచి కస్టమర్లకు పరిహారాలు చెల్లిస్తామని తెలిపారు. -
వీడియో కాల్స్ మాట్లాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!
న్యూఢిల్లీ : వాట్సాప్, స్కైప్ లలో వీడియో కాల్స్ మాట్లాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.! మీ పర్సనల్ చాట్స్, వీడియో కాల్స్ హ్యాక్ అవుతున్నాయి. ఏకాంతంగా మాట్లాడుకున్న వీడియో కాల్స్‌ను హ్యాక్ చేసి అశ్లీల వెబ్సైట్లలలో అప్లోడ్ చేస్తున్నారు. వ్యక్తిగత వీడియోలను హ్యాక్ చేయడం రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ మధ్యకాలంలో ఓ పాతికేళ్ల యువతి నవంబర్‌లో తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో మాట్లాడిన వీడియోను హ్యాక్ చేసి అశ్లీల సైట్లో అప్లోడ్ చేశారంటూ సైబర్ సెల్లో ఫిర్యాదు చేసింది.యూఆర్ఎల్లను తెలుపుతూ తన వీడియోలను సైట్నుంచి తొలగించాలని కోరింది. రెండు నెలల క్రితం ఢిల్లీకి చెందిన ఒక అమ్మాయి గతంలో తాను మాట్లాడిన వీడియో కాల్‌ను అశ్లీల సైట్లో పెట్టారంటూ సైబర్ సెల్లో ఫిర్యాదు చేసిందని సైబర్ సెల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో వీడియోకాల్స్‌ను రికార్డు చేయడం, వాట్సాప్, స్కైప్ వీడియో కాల్స్‌ను హ్యాక్ చేసి అశ్లీల సైట్లల్లో పెట్టే కేసులు ఎక్కువయ్యాయని చెప్పారు. ఎక్కువగా భార్యాభర్తలు మాట్లాడుకున్న వీడియో కాల్స్ హాకింగ్‌కు గురవుతున్నాయని తెలిపారు. వాట్సాప్‌లో వీడియో కాలింగ్ ఫీచర్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి వీడియోలు ఎక్కువగా హ్యాక్‌కు గురవుతున్నాయని అన్నారు. ఐపీ అడ్రస్ ద్యారా సులభంగా హ్యాకర్లు వీడియో కాల్స్‌ను హ్యాక్ చేస్తున్నారని తెలిపారు. ఎన్జీవో ఇండియన్ సైబర్ ఆర్మీ చైర్మన్ కిస్లే చౌదరి మాట్లాడుతూ... వీడియో కాల్స్ అంత సురక్షితం కాదని అన్నారు. దీని వల్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం అవుతోంది. ఏకాంతంగా మాట్లాడుకున్న వీడియో కాల్స్‌ను హ్యాక్ చేసి శృంగార సైట్లలో అప్లోడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఫోన్లలో కొన్ని రహస్య యాప్‌లు ఉంటాయని, వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే అవి ఫోన్లలోని డేటాను సంగ్రహిస్తాయని తెలిపారు. స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ కూడా ఆన్లైన్లో అందుబాటు ఉన్నట్లు చెప్పారు. అవి వ్యక్తుల వీడియో కాల్స్‌ను రికార్డు చేసి హ్యాక్ చేస్తాయని చౌదరి వివరించారు. ఓపెన్ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా మొబైల్స్ ఎక్కువగా హ్యాకింగ్‌కు గురవుతున్నట్లు వెల్లడించారు. బాధితుల్లో చాలా మంది అమ్మాయిలు ఉంటున్నారని, తమ వీడియోలు హ్యాక్‌కు గురయ్యాయని తెలిసినా భయంతో వారు ఫిర్యాదు చేయడం లేదని అన్నారు. ఓపెన్‌గా దొరికే వైఫైలను వాడకపోవడమే ఉత్తమమని చెప్పారు. అధికారిక గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడమే సురక్షితమని తెలిపారు. -
కోటిమంది సమాచారం గోవిందా!
ముంబై: ఇటీవల హ్యకింగ్ కు గురైన భారతీయ రైల్వే టికెటింగ్ వెబ్ సైట్ (ఐఆర్సీటీసీ)కు తాజాగా మరో చిక్కొచ్చిపడింది. హ్యకింగ్ కు గురైన సమాచారంలో ఒక కోటికి పైగా కస్టమర్ల వివరాలు ఉండటంతో పాటు ఆ వివరాలను సీడీలలో పొందుపరచి రూ.15,000లకు కావలసిన వారికి అమ్ముతున్నట్లు అధికారులకు తెలిసింది. మహారాష్ట్ర ఇంటిలిజెన్స్ బ్యూరో సైబర్ పోలీసుల వివరాల ప్రకారం హ్యకింగ్ సమయంలో దాదాపు ఒక కోటికి పైగా కస్టమర్ల ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, పాన్ కార్డు నంబర్ తదితర వివరాలను తస్కరించినట్లు తెలిపారు. వెబ్ సైట్ హ్యక్ కాలేదు: రైల్వే పీఆర్వో కాగా ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో వివరాలు హ్యక్ అయినట్లు మీడియాలో వస్తున్న వార్తలను రైల్వే పీఆర్వో సందీప్ దత్తా ఖండించారు. దీనిపై రైల్వే కమిటీ విచారణ జరుపుతోందని వివరించారు. గతంలోనూ ఐఆర్సీటీసీ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైన విషయం తెలిసిందే. -
పోలీస్స్టేషన్లలో ‘సైబర్ సెల్’
సాక్షి, ముంబై : రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతుండడంతో వీటిని నివారించేందుకు నగర పోలీసులు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నగర్ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో ఉన్న 93 పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా సైబర్ సెల్‌లను ఏర్పాటుచేయనున్నామన్నారు. నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అదుపుచేయడమే ధ్యేయంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశంతో ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. వీటికోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తామని, వారికి ల్యాబ్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్‌తోపాటు ఇతర సదుపాయాలను కల్పిస్తామన్నారు. మరో 15 రోజుల్లో ఈ సైబర్ సెల్‌లను ప్రతి పోలీస్టేషన్లో ఏర్పాటు చేయనున్నట్లు మారియ పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని సైబర్ నేరాలనూ బీకేసీ సైబర్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ సెల్ ద్వారా దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఇది పోలీసులకు అదనపు భారంగా పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సెల్‌కు సబ్ ఇన్స్పెక్టర్ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రతి పోలీస్‌స్టేషన్ సైబర్ నేరాలను స్వయంగా ఎదుర్కోవాలన్న ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేసినట్లు మారియ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సెల్లో ఒక అధికారితోపాటు ఇద్దరు లేదా ముగ్గురు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారు. ఈ సైబర్ సెల్లో పనిచేయడానికి ఎవరు ఆసక్తి కనబరుస్తున్నారో.. వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని మారియ పేర్కొన్నారు. ఇంటర్నెట్ ప్రొటోకాల్(ఐపి)ను ఎదుర్కోవడానికి సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. దీంతో వారు సాఫ్ట్‌వేర్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన తర్వాత నేరస్తులను సులువుగా ట్రేస్ చేయవచ్చని మారియ అభిప్రాయపడ్డారు.