న్యూఢిల్లీ : వాట్సాప్, స్కైప్ లలో వీడియో కాల్స్ మాట్లాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.! మీ పర్సనల్ చాట్స్, వీడియో కాల్స్ హ్యాక్ అవుతున్నాయి. ఏకాంతంగా మాట్లాడుకున్న వీడియో కాల్స్‌ను హ్యాక్ చేసి అశ్లీల వెబ్‌సైట్లలలో అప్‌లోడ్ చేస్తున్నారు. వ్యక్తిగత వీడియోలను హ్యాక్ చేయడం రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ మధ్యకాలంలో ఓ పాతికేళ్ల యువతి నవంబర్‌లో తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో మాట్లాడిన వీడియోను హ్యాక్ చేసి అశ్లీల సైట్లో అప్‌లోడ్ చేశారంటూ సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేసింది.యూఆర్‌ఎల్‌లను తెలుపుతూ తన వీడియోలను సైట్‌నుంచి తొలగించాలని కోరింది.
రెండు నెలల క్రితం ఢిల్లీకి చెందిన ఒక అమ్మాయి గతంలో తాను మాట్లాడిన వీడియో కాల్‌ను అశ్లీల సైట్‌లో పెట్టారంటూ సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేసిందని సైబర్ సెల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో వీడియోకాల్స్‌ను రికార్డు చేయడం, వాట్సాప్, స్కైప్ వీడియో కాల్స్‌ను హ్యాక్ చేసి అశ్లీల సైట్లల్లో పెట్టే కేసులు ఎక్కువయ్యాయని చెప్పారు.
ఎక్కువగా భార్యాభర్తలు మాట్లాడుకున్న వీడియో కాల్స్ హాకింగ్‌కు గురవుతున్నాయని తెలిపారు. వాట్సాప్‌లో వీడియో కాలింగ్ ఫీచర్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి వీడియోలు ఎక్కువగా హ్యాక్‌కు గురవుతున్నాయని అన్నారు. ఐపీ అడ్రస్ ద్యారా సులభంగా హ్యాకర్లు వీడియో కాల్స్‌ను హ్యాక్ చేస్తున్నారని తెలిపారు. ఎన్జీవో ఇండియన్ సైబర్ ఆర్మీ చైర్మన్ కిస్లే చౌదరి మాట్లాడుతూ... వీడియో కాల్స్ అంత సురక్షితం కాదని అన్నారు. దీని వల్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం అవుతోంది.
ఏకాంతంగా మాట్లాడుకున్న వీడియో కాల్స్‌ను హ్యాక్ చేసి శృంగార సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఫోన్లలో కొన్ని రహస్య యాప్‌లు ఉంటాయని, వాటిని ఇన్‌స్టాల్ చేసుకుంటే అవి ఫోన్లలోని డేటాను సంగ్రహిస్తాయని తెలిపారు. స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ కూడా ఆన్‌లైన్‌లో అందుబాటు ఉన్నట్లు చెప్పారు.
అవి వ్యక్తుల వీడియో కాల్స్‌ను రికార్డు చేసి హ్యాక్ చేస్తాయని చౌదరి వివరించారు. ఓపెన్ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా మొబైల్స్ ఎక్కువగా హ్యాకింగ్‌కు గురవుతున్నట్లు వెల్లడించారు. బాధితుల్లో చాలా మంది అమ్మాయిలు ఉంటున్నారని, తమ వీడియోలు హ్యాక్‌కు గురయ్యాయని తెలిసినా భయంతో వారు ఫిర్యాదు చేయడం లేదని అన్నారు. ఓపెన్‌గా దొరికే వైఫైలను వాడకపోవడమే ఉత్తమమని చెప్పారు. అధికారిక గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడమే సురక్షితమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment