వాట్సాప్ వీడియో కాల్ లింక్ స్కామ్ | Don't open this link for WhatsApp video calling | Sakshi
Sakshi News home page

వాట్సాప్ వీడియో కాల్ లింక్ స్కామ్

Published Fri, Nov 18 2016 12:15 PM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

వాట్సాప్ వీడియో కాల్ లింక్ స్కామ్ - Sakshi

వాట్సాప్ వీడియో కాల్ లింక్ స్కామ్

ప్రముఖ  సోషల్ నెట్ వర్కింగ్ సైట్  వాట్సాప్  ఇటీవల  కొత్తగా లాంచ్ చేసిన  వీడియో కాలింగ్ అప్లికేషన్  ను అపుడే  హ్యాకర్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.  నిన్న, మొన్నటి వరకు బేటా వర్షన్ యూజర్లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్ వీడియో కాలింగ్ తాజాగా  వాట్సాప్ యూజర్లకు అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.   అయితే ఈ ఫీచర్ ఇన్విటేషన్ ముసుగులో  స్కామ్ భయం ఇపుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.   వీడియో కాల్ ఇన్విటేషన్ పేరుతో మోసపూరిత లింక్స్ వాట్సాప్‌లో  చక్కర్లు కొడుతున్నాయని, వీటిని క్లిక్ చేయటం ద్వారా వాట్సాప్ అకౌంట్‌ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీడియో కాలింగ్ ఫీచర్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం...కేవలం ఇన్విటేషన్ ద్వారా  మాత్రమే ఈ ఫీచర్ కి అనుమంతి వుందంటూ యూజర్లను ట్రాప్ చేసి, సమాచారాన్ని హ్యాక్ చేస్తున్నారని టెక్ నిపుణులు  తెలిపారు.ఇలాంటి  మెసేజ్ ల పట్ల అప్రతమత్తంగా ఉండాలని  సూచిస్తున్నారు.  ఈ  మోసగాళ్ల  ట్రాప్ లో  కుండా కేవలం  గూగుల్  ప్లే ద్వారా మాత్రమే వీడియో కాలింగ్ అప్లికేషన్ను   డౌన్ లోడ్ చేసకోవాలని తెలిపారు.

కాగా  తాజాగా అధికారిక వాట్సాప్ అకౌంట్‌లలోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఉపయోగించుకుంటున్న యూజర్లు వాట్సాప్ వీడియో కాల్స్ నాణ్యత పై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ టు ఫేస్ కాల్స్ సమయంలో పి నాసిరకమైన వీడియో క్వాలిటీ పూర్ గా ఉందని, ఎక్కువ డేటాను ఖర్చవుతోందని  వాదిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement