న్యూఢిల్లీ: తన ఫేస్ బుక్ ఖాతా తిరిగి పునరుద్ధరించబడిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తెలిపారు. పలువురు ప్రముఖుల ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేస్తున్న హ్యాకర్లు ఆదివారం బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఫేస్ బుక్ను హ్యాక్ చేశారు. దీంతో తన ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్కు గురైందని స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు, ఫాలోవర్స్కు షాహిద్ తెలియజేశారు.
అయితే, త్వరలోనే హ్యాకింగ్ నుంచి తప్పించి తన ఖాతాను పునరుద్ధరిస్తానని ప్రకటించిన ఆయన అన్నట్లుగానే సోమవారం తిరిగి తన ఖాతాను తిరిగి ప్రారంభించారు. 'ఫేస్ బుక్ ఖాతా పునరుద్ధరించబడింది.. గణపతి బప్ప మోరియా' అంటూ ట్విట్టర్లో షాహిద్ పేర్కొన్నారు.
షాహిద్ ఫేస్ బుక్ హ్యాక్..
Published Mon, Sep 28 2015 6:01 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement