కార్ల అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికీ టెస్లా కంపెనీ గురుంచి తెలియకుండా ఉండదు. ఈ కంపెనీకి చెందిన కార్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. మరి ఈ టెస్లా కంపెనీకి చెందిన కార్లు ఇంతలా క్రేజ్ సంపాదించుకోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా?.. ఆ కార్లు పూర్తిగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్లు; అలాగే, ఇందులో ఏ ఆటోమొబైల్ కంపెనీ ఇంతవరకు వినియోగించని అత్యాధునిక ఆటోనమస్ వెహికల్ టెక్నాలజీ ఉండటమే దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీ వల్ల ఈ కార్లను కీ సహాయం లేకుండా మొబైల్ సహాయంతో స్టార్ట్ చేయడంతో పాటు వాటి డోర్స్ వాటంతట అవే ఓపెన్ కావడం, కార్లను పార్క్ చేయడం వంటివి చేయవచ్చు.
మరి, ఇలాంటి అత్యాధునిక ఆటోనమస్ వెహికల్ టెక్నాలజీని ఎవరైనా హ్యాక్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలాంటి ఈ సాంకేతికతను జర్మనీకి చెందిన 19 ఏళ్ల కుర్రాడు హ్యాక్ చేసి చూపించాడు. ఈ 19 ఏళ్ల సైబర్ సెక్యూరిటీ డేవిడ్ కొలంబో తన జీవిత కాలంలో అతిపెద్ద లోపాన్ని కనుగొన్నాడు. కొలంబో ఒక ఫ్రెంచ్ కంపెనీ కోసం భద్రతా తనికీలు చేస్తున్నప్పుడు ఆ సంస్థ నెట్‌వర్క్‌లో సాఫ్ట్ వేర్ ద్వారా ఆ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వాడుతున్న టెస్లా కారుకి సంబంధించిన డేటాను హ్యాక్ చేశాడు. ఈ డేటాలో కారు ఎక్కడ ఎక్కడ తిరిగిందో పూర్తి చరిత్రను తెలుసుకోవడంతో పాటు ఆ క్షణంలో కారు ఉన్న ఖచ్చితమైన స్థానాన్ని కనుగొన్నాడు.
25కి పైగా టెస్లా కార్లు అధీనంలోకి
డేవిడ్ కొలంబో కేవలం ఈ ఒక్క కారును మాత్రమే హ్యాక్ చేయలేదు.. అనేక ఇతర టెస్లా కార్లను కూడా హ్యాక్ చేసినట్లు తను పేర్కొన్నాడు. ఆ కారు యజమానులకు తను కారుని హ్యాక్ చేసినట్లు చెప్పడానికి ఆ కారు హారన్ మోగించడం, డోర్స్ ఓపెన్ చేసినట్లు తెలిపాడు. యూరప్, ఉత్తర అమెరికా అంతటా ఉన్న 13 దేశాలలో 25కి పైగా టెస్లా కార్లలో ఈ లోపాలను కనుగొన్నానని తెలిపాడు. ఇలా చాలా కార్లలో ఇతర భద్రత లోపాలు ఉండే అవకాశం ఉన్నట్లు తను తెలిపాడు.
(చదవండి: టాటా మోటార్స్: వాహనాల ధరల పెంపు)
ఈ లోపాలు గురుంచి టెస్లా కంపెనీ మెయిల్ చేసినట్లు కొలంబో వివరించారు. ఆ కంపెనీకి చెందిన ఒక భద్రతా బృందం సభ్యుడు తనను సంప్రదించాడని, అతను తనతో సమాచారం పంచుకున్నట్లు కూడా పేర్కొన్నాడు. ఈ విషయం గురించి టెస్లాతో సంప్రదింపులు జరిగాయని, యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి కూడా తనను సంప్రదించినట్లు తెలిపారు. అయితే, ఈ లోపం గల సాంకేతికతను తృతీయపక్ష సాఫ్ట్ వేర్ కంపెనీ తయారీ చేసినట్లు తెలిసింది.
ఇదే మొదటసారి కాదు...
ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన ఆటోమొబైల్స్ని హ్యాక్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2015లో ఇద్దరు భద్రతా పరిశోధకులు రిమోట్ గా జీప్ చెరోకీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక జర్నలిస్ట్ అమెరికాలోని హైవే పై గంటకు 70 మైళ్ల వేగంతో వెళ్తున్నప్పుడు ఆ వాహనం ఇంజిన్ ఒక్కసారిగా నిలిపివేశారు. దీంతో సదురు కంపెనీ ఆ లోపాలను సరిదిద్దాడానికి వాహనలను రీకాల్ చేసింది. ఇలాంటి ఆటోనమస్ వెహికల్ టెక్నాలజీ వల్ల ప్రమాదం పొంచి ఉన్నట్లు కొలంబో తెలపడంతో పాటు ఇతరులు ఎవరైనా ఈ భద్రత లోపాన్ని కనిపెట్టి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది అని తెలిపారు.
డేవిడ్ కొలంబో..?
డేవిడ్ కొలంబోకు 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తన తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఇంత భాద నుంచి బయటపడటానికి ఎక్కువ సమయం తను కంప్యూటరు కోడింగ్ మీద గడిపాడు. ఆ తర్వాత తన స్కూల్లో చెప్పే పాఠలా మీద ఆసక్తిపోవడంతో రోజుకి రెండు రోజులు మాత్రమే స్కూల్ కి వెళ్ళేవాడు. మిగతా సమయాన్ని సైబర్ టెక్నాలజీ నేర్చుకోవడానికి కేటాయించాడు. ఆ టెక్నాలజీలో ప్రావీణ్యం సాధించాక ఒక కంపెనీని కొలంబో టెక్నాలజీ పేరుతో స్థాపించాడు.
(చదవండి: గ్యాస్ అయిపోయిందని టెన్షన్ వద్దు !.. అరగంటలో మరో సిలిండర్?)
Comments
Please login to add a commentAdd a comment