టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్స్‌తో పంచుకోవడమే కాదు జీవితానికి సంబంధించిన కోట్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక విడాకుల అనంతరం ప్రతి విషయంపై నెట్టంట స్పందించింది సామ్. దీంతో ఆమె పోస్ట్స్‌పై ఆసక్తి నెలకొంది. అప్పటి నుంచి సమంత ఏ పోస్ట్ షేర్ చేసిన అది వార్తల్లోకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె చేసిన ఓ పోస్ట్ అందరికి షాకిచ్చింది.
ఎప్పుడు తన సినిమాల అప్‌డేట్స్, సామాజీక అంశాలు, ఎమోషనల్ కొట్స్, తన పెట్స్‌కు సంబంధించిన ఫొటోల షేర్ చేస్తూ అవే లోకంగా ఉండే సామ్ తొలిసారి రాజకీయాలకు సంబంధించిన పోస్ట్ పెట్టింది. అది కూడా కేటీఆర్ ఫోటో షేర్ చేస్తూ.. ‘నా ప్రజలే నా బలం, నా ధైర్యం, నా నమ్మకం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసి ఆమె ఫాలోవర్స్, ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏంటీ.. సమంత రాజకీయాలపై స్పందించింది అంటూ నెటిజన్లు చర్చించుకున్నారు. అంతేకాదు ‘ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి వస్తున్నావా? సామ్’ అంటూ ఆమెను అంతా ప్రశ్నిస్తున్నారు.
దీంతో ఈ పోస్ట్‌పై సామ్ డిజిటల్ మేనేజర్ శేషాంక బినాష్ స్పందించింది. ఇది సమంత చేసిన పోస్ట్ కాదని, సమంత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని స్పష్టం చేసింది. ‘టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే ఇలా జరిగింది. ఒక గ్రూప్‌లో పోస్ట్ చేయాల్సిన పోస్ట్ సమంత గ్రూప్‌లో యాడ్ అయ్యింది. మేం ఈ పోస్ట్ ఎవరూ చేశారనే దానిపై ఆరా తీస్తున్నాం. దీనిపై మా ఇన్‌స్టాగ్రామ్ టీంతో చర్చిస్తున్నాం. వారు ఎవరో తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంటాం. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండ జాగ్రత్తగా ఉంటాం. మీకు అసౌకర్యం, కన్ప్యూజన్ కలిగించినందుకు క్షమాపణలు’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. ఇక ఇదే పోస్ట్‌ను స్క్రీన్ షాట్‌ను సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ఫ్యాన్స్‌తో పంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment