ఇస్రో సైట్పై చైనా హ్యాకర్ల దాడి | Website of ISRO's commercial arm Antrix hacked | Sakshi
Sakshi News home page

ఇస్రో సైట్పై చైనా హ్యాకర్ల దాడి

Published Sun, Jul 12 2015 4:09 PM | Last Updated on Mon, Aug 13 2018 3:53 PM

ఇస్రో సైట్పై చైనా హ్యాకర్ల దాడి - Sakshi

ఇస్రో సైట్పై చైనా హ్యాకర్ల దాడి

న్యూఢిల్లీ: వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు కొత్త సమస్య వచ్చిపడింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థకు చెందిన వాణిజ్య విభాగానికి చెందిన వెబ్ సైట్ హ్యాకింగ్కు గురైంది. దాని హోం పేజీలో స్పోర్ట్స్కు చెందిన పేజీ మాత్రమే కనిపిస్తుంది. చైనాకు చెందిన హ్యాకర్లు దాడి చేసినట్లు ఇస్రో అధికారులు ధృవీకరించారు.

ఇస్రోకు చెందిన కమర్షిల్ ఆర్మ్ యాంట్రిక్స్ విభాగం హ్యాకింగ్కు గురైనట్లు వారు తెలిపారు. రెండు రోజుల కిందటే పీఎస్ఎల్వీ-సీ28 ఐదు విదేశీ(బ్రిటన్) ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ లోగానే సూట్ హ్యాకింగ్కు గురికావడం ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం వాణిజ్య విభాగం ఆర్మ్ యాంట్రిక్స్ హోం పేజీలో పశ్చిమ కెనడా, దక్షిణాఫ్రికాకు చెందిన స్కూల్ విద్యా విధానం, విద్యార్థులు, క్రీడలువంటి సమాచారంతో ఒక పేజీ కనిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement